Pesticides Drug
-
కూల్ డ్రింక్ అనుకుని.. పురుగుమందు
నెల్లూరు, కలువాయి: కూల్‌డ్రింక్ అని పొరబడి పురుగు మందు తాగి ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన కలువాయి మండలం ఉయ్యాలపల్లి పంచాయతీ ఎర్రబల్లిలో విషాదాన్ని నింపింది. స్థానికుల సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన శివకృష్ణ, ధనమ్మల మొదటి కుమారుడు కాకుమూరి జగదీష్ (9) స్థానిక ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. జగదీష్ తండ్రి శివకృష్ణ మంగళవారం ఉయ్యాలపల్లిలో జరిగిన జన్మభూమి–మా ఊరు కార్యక్రమానికి వెళ్లాడు. అక్కడ ఏర్పాటు చేసిన పశువైద్య శిబిరంలో మూగజీవాలకు వాడే క్లాటాక్స్ (సైఫర్మెత్రిన్) పురుగు మందును ఖాళీ స్ప్రైట్ బాటిల్లో తీసుకువచ్చి ఇంటి వరండాలోని ఫ్రిజ్‌పై ఉంచి బయటకు వెళ్లాడు. మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చిన జగదీష్ ఫ్రిజ్‌పై ఉన్న బాటిల్‌ను చూసి కూల్‌డ్రింక్ అనుకుని తాగాడు. దీంతో అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే కలువాయికి తీసుకువచ్చి ప్రాథమిక చికిత్స అనంతరం పొదలకూరుకు తరలించగా అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. బాలుడి మృతితో అతని తల్లిదండ్రులు, బంధువులు గుండెలు అవిసేలా రోదించారు. గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. జగదీష్‌ను కడచూపు చూసి కాలనీ వాసులు బాలుడికి కన్నీటి వీడ్కోలు పలికారు. అందుబాటులోకి రాని 108 వాహనం బాలుడిని చికిత్స నిమిత్తం కలువాయి నుంచి పొదలకూరుకు తరలించేందుకు బాధితులు పలుమార్లు 10 8 వాహనానికి ఫోన్ చేసినా సరిగా స్పందించలే దు. వాహనం రాకపోవడంతో గంట ఆలస్యంగా ప్రై వేట్ వాహనంలో తరలించడంతో అప్పటికే జాప్యం కారణంగా బాలుడు మృతిచెందాడని బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఈఓ పరామర్శజగదీష్ మృతి నేపథ్యంలో ఎంఈఓ జి.సుధీర్‌బాబు, పాఠశాల ఉపాధ్యాయులు, సీఆర్పీలు బుధవారం ఉదయం గ్రామానికి వెళ్లి జగదీష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. జగదీష్ మృతికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
పురుగుమందుతో ఎస్పీ గ్రీవెన్స్‌కు యువకుడు
ఒంగోలు క్రైం: ఓ యువకుడు పురుగుమందు డబ్బాతో ఎస్పీ గ్రీవెన్స్‌కు వచ్చేందుకు ప్రయత్నించటం సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం వద్ద కలకలం రేపింది. ఎస్పీ బి.సత్య ఏసుబాబు నిర్వహిస్తున్న గ్రీవెన్స్ సెల్ వద్దకు వెళ్లాలని ప్రయత్నించాడు. జిల్లా పోలీసు కార్యాలయం ప్రధాన గేటు వద్ద భద్రత సిబ్బంది సహజ పరిశీనలో అతడి వద్ద పురుగుమందు డబ్బా గుర్తించారు. అప్రమత్తమైన పోలీసులు పురుగుమందు డబ్బా స్వాధీనం చేసుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు అతడిని ఎస్పీ బి.సత్య ఏసుబాబు వద్దకు తీసుకెళ్లారు. అతడు తన కష్టాన్ని ఎస్పీకి మొరపెట్టుకున్నాడు. చినగంజాం మండలం సంతరావూరుకు చెందిన వడ్డాణం రాఘవులు ఉన్నత చదువులు చదువుకున్నాడు. తల్లి ఛాయాదేవి, తండ్రి శ్రీరాములు మధ్య ఏర్పడిన మనస్పర్థలతో వారు వేర్వేరుగా ఉంటున్నారు. ఇది తనకు మానసిక వేదన కలిగిస్తోందని వాపోయాడు. దీనికి తోడు తండ్రి శ్రీరాములు మరొక మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని, ఆస్తులు హారతి కర్పూరంలా కాజేస్తూ తమను దిక్కు లేని వారిగా చేస్తున్నాడన్నారు. మొత్తం 17 ఎకరాలు పొలం ఉంటే ఇప్పటికే ఐదెకరాలు అమ్మాడని, స్థానిక పోలీసులను కలిసి తన గోడు వెళ్లబోసుకుంటే అది సివిల్ వ్యవహారమని, తాము ఏమీ చేయలేమని తేల్చి చెప్పారని పేర్కొన్నాడు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ఎస్పీని రాఘవులు వేడుకున్నాడు. -
మరణ మృదంగం
తినే ఆహారంలో విష పదార్థాలు కలిశాయా..? క్రిమిసంహారక మందు కలుపుకుని మూకుమ్మడి ఆత్మహత్యకు పాల్పడ్డారా..? ఎవరైన హత్య చేశారా..? ఇలా అంతుచిక్కని ప్రశ్నలెన్నో.. మరెన్నో సందేహాలు. కారణాలు ఏమైతేనేం.. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలో శుక్రవారం తెల్లవారుజామున మరణమృదంగం ప్రతిధ్వనించింది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అనుమానాస్పదంగా విగత జీవులవడం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తీవ్ర కలకలంరేపింది. నల్లగొండ జిల్లా, రాజాపేట (ఆలేరు) : సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం మునిగడపకు చెందిన దుబ్బాసి బాలరాజు(44), భార్య నిర్మల(40) దంపతులు. వీరికి కుమార్తె శ్రావణి (15), కుమారులు చింటు (12, బన్నీ (8) ఉన్నారు. బాలరాజు సికింద్రాబాద్ కూషాయిగూడ, జమ్మికుంటకు వెళ్లి కూలిపనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా బాలరాజుకు అప్పుడ్పుడు ఫిట్స్ రావడం, వచ్చే కూలి డబ్బులు సరిపోక కుటుంబ పోషణ భారంగా మారింది. చేసిన అప్పులకు తన తోబుట్టువులు అండగా నిలిచినా సరిపోలేదు. దీంతో బాలరాజు నెల రోజుల క్రితం రాజాపేట మండల కేంద్రానికి చెందిన బెజుగం నాగభూషణం పౌల్ట్రీఫాంలో పనిచేసేందుకు మాట్లాడుకున్నాడు. బాలరాజు ఏడాది క్రితం రాజాపేటలోని ఓ పౌల్ట్రీ ఫాంలో పనిచేసిన అనుభవం ఉండటంతో నాగభూషణం నెలకు రూ. 8వేలు ఇచ్చేందుకు అగీకరించాడు. అడ్వాన్స్‌గా ఇచ్చిన డబ్బుతో కడుపునొప్పితో బాధపడుతున్న కుమార్తెకు ఆపరేషన్ చేయించాడు. బాలరాజు మామ జనగాం జిల్లా లింగంపల్లి గ్రామానికి చెందిన బాలనర్సయ్య(68) వారం రోజుల క్రితం పాముకుంట శివారులోని ఓ దాబాలో పనిచేస్తూ జీవిస్తున్నాడు. కాగా ఇటీవల బాలరాజుకు ఫిట్స్ ఎక్కువగా రావడంతో ఆస్పత్రిలో చేర్పించేందుకు భార్య నిర్మల తన తల్లిదండ్రులు భారతమ్మ(60), బాలనర్సయ్యలను మూడు రోజుల క్రితం ఇంటికి పిలిపించుకుంది. నిర్మల గురువారం రాత్రి చికెన్ తీసుకొచ్చి వంట చేసింది. రాత్రి పౌల్ట్రీ పనులు ముగించుకుని కుటుంబ సభ్యులంతా కలిసి భోజనాలు చేసి నిద్రించారు. పలుమార్లు ఫోన్‌చేసినా.. పౌల్ట్రీ యజమాని నాగభూషణం రాత్రి 9 గంటల ప్రాంతంలో వచ్చేసరికి బాలరాజు కుటుంబ సభ్యులు నిదురించి ఉండటాన్ని గమనించి తిరిగి వెళ్లాపోయాడు. రాత్రి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని, సమీపంలోని వ్యవసాయ బావివద్ద ఉన్న ఓ రైతును పంపించినా వారు లేవలేదని పౌల్ట్రీ యజమాని తెలిపాడు. ఉదయం 4గంటల సమయంలో వచ్చి చూసేసరికి కుటుంబ సభ్యులతంతా విగతజీవులై పడిఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందజేశాడు. నష్టపరిహారం చెల్లించాలని బంధువుల డిమాండ్ తమ కుటుంబ సభ్యులను చంపేశారంటూ బాలరాజు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు నష్టపరిహారం అందించాలని పౌల్ట్రీ యజమానిని డిమాండ్ చేశారు. నష్టపరిహారంగా రూ.70లక్షలు ఇవ్వాలంటూ కోరారు. ఇందుకు పౌల్ట్రీ యజమాని అంగీకరించకపోవడంతో ఇరువర్గాల పెద్దలు చర్చలు జరిపారు. మృతుల కుంటుంబాలకు ఆర్థికసాయంగా రూ.4 లక్షలు అందజేసేందుకు అంగీకరించారు. రాజాపేటలో విషాదం రాజాపేట శివారులో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందడంతో మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటన మండలమే కాకుండా ఇతర జిల్లాలకు పాకడంతో, బంధువులు, ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తాం : కలెక్టర్ అనితారామచంద్రన్ భువనగిరిఅర్బన్ : మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తామని కలెక్టర్ అనితారామచంద్రన్ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమి త్తం భువనగిరిలోని ఏరియా ఆస్పత్రికి తీసుకవచ్చారు. ఈ మేరకు కలెక్టర్ ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం గదిలో ఉన్న మృతదేహాలను సందర్శించారు. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. పోలీస్ విచారణ కొనసాగుతుందని, త్వరతిగతిన విచారణ చేసి కారణం ఏమిటో తెలుసుకుంటామన్నారు. అనంతరం మృతుల కుటుంబాలను పరమర్శించారు. మృతదేహాల తరలింపు విషయం తెలుసుకున్న బంధువులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి సొంత గ్రామమైన సిద్దిపే ట జిల్లా జగదేవ్‌పూర్ మండలంలోని మునిగడప గ్రామానికి తరలించారు. వృద్ధ దంపతుల మృతదేహాలను జనగాం జిల్లా లింగాల గ్రామానికి తీసుకెళ్లారు. పూర్తిస్థాయిలో విచారణ చేపడతాం రాజాపేట శివారులోని పౌల్ట్రీఫాంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందిన ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతాం. విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని క్లూజ్టీమ్స్, డాగ్స్కాడ్స్ను రప్పించాం. సంఘటన స్థలంలో పురుగులమందు, కొన్ని ఆధారాలు దొరికాయి, పరీక్షల నిమిత్తం పంపించాం. బాలరాజు అన్న రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపడుతున్నాం. పోస్టుమార్టం చేసిన తర్వాతనే పూర్తి వివరాలు తెలుస్తాయి. – డీసీపీ రామచంద్రారెడ్డి -
ప్రేమజంట ఆత్మహత్య
► పెళ్లికి అడ్డుపడిన పెద్దలు ► మనస్తాపంతో అఘాయిత్యం పెద్దపల్లి/ఓదెల : వారిద్దరు ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. మూడుముళ్లు ఏడడుగుల బంధంతో ఏకమవ్వాలని ఆశపడ్డారు. కానీ వారి ప్రేమ.. పెళ్లికి కులం అడ్డొచ్చింది. అబ్బారుు కుటుంబసభ్యులు ససేమిరా అన్నారు. దీంతో మనస్తాపం చెందిన ప్రేమికులు కలిసి బతకలేకపోరుునా.. కలిసే చనిపోదామని నిర్ణరుుంచుకున్నారు. కూల్‌డ్రింక్‌లో విషం కలుపుకుని తాగి మరణంలోనూ ఏకమయ్యూరు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓదెల మండలం కొలనూర్‌కు చెందిన కేశెట్టి కృష్ణమూర్తి అలియూస్ కిట్టు(28), మద్దెల మౌనిక(23) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారం రోజుల క్రితం ఈ జంట కొలనూర్ నుంచి వెళ్లి వేములవాడ మండలం అగ్రహారంలో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించగా కిట్టు బంధువులు అడ్డుకున్నారు. దీంతో పెళ్లి అక్కడే ఆగింది. తనకు న్యాయం చేయాల్సిందిగా మౌనిక గురువారం కొలనూర్‌లోని కిట్టు ఇంటి ముందు దీక్షకు దిగింది. పొత్కపల్లి ఎస్సై శంకరయ్య జంటకు కౌన్సెలింగ్ నిర్వహించి పెళ్లి జరిపేందుకు హామీ ఇచ్చారు. మళ్లీ కిట్టు తల్లిదండ్రులు నిరాకరించడంతో ఇక తాము కలిసి జీవించలేమని మనస్తాపం చెందారు. శనివారం గ్రామం నుంచి బైక్‌పై బయల్దేరి పెద్దపల్లికి చేరుకున్నారు. పట్టణంలో కూల్డ్రింక్తోపాటు క్రిమిసంహారక మందు కొనుగోలు చేశారు. అనంతరం స్థానిక రైల్వే ఓవర్‌బ్రిడ్జి సమీపంలోని ఓ రియల్ వెంచర్లో గల షెడ్ ఆవరణలో కూల్‌డ్రింగ్‌లో విషయం కలుపుకొని తాగి మృతి చెందారు. రాఘవాపూర్ గ్రామస్తులు మృతహదేహాలను చూసి పెద్దపల్లి పోలీసులకు సమాచారం అందించారు. మృతుల వద్ద లభించిన ఆధారాలతో కొలనూర్‌కు చెందిన కిట్టు, మౌనికగా గుర్తించారు. వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. స్థానిక సివిల్ అసుపత్రికి పోస్టుమార్టం చేసిన అనంతరం బంధువులకు మృతదేహాలను అప్పగించారు. కొలనూర్‌లో కిట్టు, మౌనికలకు బంధువులు వేర్వేరుగా అంత్యక్రియలు నిర్వహించారు. కిట్టు తండ్రి కేశెట్టి రాజయ్య, మౌనిక తండ్రి మద్దెల వెంకటయ్య నుంచి ఫిర్యాదు తీసుకున్న ఎస్సై రాజ్‌కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అందరితో కలివిడిగా స్నేహంగా ఉండే కిట్టు, మౌనిక ఆత్మహత్యతో వారి బంధుమిత్రులు, స్నేహితులు విషాదంలో మునిగారు. డిగ్రీ పూర్తి చదివిన ఒక్కగానొక్క కూతురు మద్దెల మౌనిక ఆత్మహత్యకు పాల్పడటంతో తల్లితండ్రులు మద్దెల వెంకటయ్య, లక్ష్మి తల్లిడిల్లుతున్నారు. కేశెట్టి రాజయ్య దంపతుల చిన్నకుమారుడు కిట్టు. చిన్పప్పటినుంచి కష్టపడి కుటుంబానికి అండగా ఉండే కిట్టు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. -
అప్పులబాధ భరించలేక..
- పురుగులమందు తాగి రైతు బలవన్మరణం - ఆలేరులో ఘటన ఆలేరు పట్టణానికి చెందిన గుంటుక వేణుగోపాల్‌రెడ్డి(45)కి వ్యవసాయమే జీవనాధారం. తన కున్న నాలుగు ఎకరాల భూమితో పాటు, కొంత భూమికౌలు తీసుకుని పత్తి, వరి సాగు చేశాడు. పెట్టుబడులకు తెలిసిన వారి వద్ద రూ. 5 లక్షల వరకు అప్పు చేశాడు. రెండేళ్లుగా కాలం అనుకూలించలేదు. కుటుంబ అవసరాల కోసం యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూర్ గ్రామంలోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ కంపెనీలో కార్మికునిగా పనిచేశాడు. ఇంటి అవసరాలు.. అప్పులు పెరిగిపోవడంతో తట్టుకోలేకపోయాడు. తీవ్ర మనస్తాపానికి గురైన వేణుగోపాల్‌రెడ్డి బుధవారం అర్ధరాత్రి వ్యవసాయ బావి వద్దకు వెళ్లి వెంట తెచ్చుకున్న పురుగులమందు తాగాడు. తెల్లవారుజామున అటుగా వెళ్లిన రైతులు అపస్మారకస్థితిలో పడి ఉన్న వెంకట్‌రెడ్డి వద్దకు వెళ్లి చూడగా అప్పటికే మృతిచెందాడు. సమాచారం అందుకుని ఘటన స్థలానికి కుటుంబ సభ్యులు చేరుకుని బోరున విలపించారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. మృతిడి భార్య సోమలక్ష్మి ఫిర్యాదు మేరకు ఏఎస్సై సలీం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఈ నీళ్లు తాగితే చచ్చేటోళ్లం
మాక్లూర్ : ‘నల్లాల నుంచి వచ్చే నీళ్లు మంచిగనే ఉంటయ్ అనుకున్నం. కానీ, కొద్దిగా తాగితే కళ్లు, ఒళ్లు తిరిగింది. చానా నీళ్లు తాగితే చచ్చేటోళ్లం’ అని మండలంలోని గద్వాల్ క్యాంపు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వారు తెలిపిన వివరాలిలా...గ్రామ సమీపంలోని తాగునీటి బోరుబావిలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పంటల పొలాలకు వాడే పురుగుల మందు పోశారు. గురువారం ఉదయం గ్రామ వాటర్‌మన్ లచ్చయ్య వెళ్లి మోటారు స్టార్ట్ చేయగా బోరుబావి నుంచి ట్యాంకులోకి విషం కలిపిన నీరు చేరింది. అదే నీటిని కుళాయిల ద్వారా గ్రామంలో సరఫరా చేయడంతో వాటిని పట్టుకుని తాగగా వాసన వచ్చింది. కొంచెం తాగి చూస్తే కళ్లు తిరగడం ప్రారంభమైంది. పురుగుల మందు కలిపి ఉంటారని గ్రహించి గ్రామస్తులు ఎంపీడీఓ, పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. బోరుబావి వద్ద పురుగుల మందు డబ్బా దొరికిందని తెలిపారు. నిందితులను పట్టుకుని తాగునీటి సౌకర్యం కల్పించాలని ఎంపీడీఓను వేడుకున్నారు. కాసేపు ధర్నా నిర్వహించిన అనంతరం ఎంపీడీఓ గోపిబాబు, ఎస్సై వెంకట్రాములు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు గోపాల్నగేష్, గ్రామస్తులు గంగాధర్, ఇసాక్, పురుషోత్తం, పద్మారావు, సామెల్, లచ్చయ్య, బెంచిమెన్, మనోహర్, సుమారు 100 మంది పాల్గొన్నారు. -
పెళ్లయిన ఆరు నెలలకే..
జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు మహిళల ఆత్మహత్య కొన్నె(బచ్చన్నపేట) : పెళ్లయిన ఆర్నెల్ల్లకే ఇద్దరు మహిళలు తనువు చాలించారు. బచ్చన్నపేట మండలం కొన్నెలో ఒకరు.. ములుగు మండలంలోని చిన్నగుంటూరుపల్లిలో మరొకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల కథనం ప్రకా రం.. దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన వసంత(20)కు కొన్నెకు చెందిన చీర వేణుతో ఆర్నెళ్ల క్రితం వివాహమైంది. ఈ క్రమంలో వసంత బుధవారం ఉదయం వ్యవసాయ బావి వద్దకు పత్తి సేకరించేందుకు వెళ్లింది. అక్కడే పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందింది. వసంత ఆత్మహత్యకుగల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా మృతురాలి అత్త, మామ, భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఎస్సై షాదుల్లాబాబా జనగామ ఏరియా ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. చిన్నగుంటూరుపల్లిలో.. ములుగు : నెల్లూరు జిల్లాకు చెందిన అజ్మీరా దేవి(22) మండలంలోని చిన్నగుంటూరుపల్లి గ్రామానికి చెందిన అజ్మీరా అఖిల్‌ను 6 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. తరచూ గొడవలు జరగడంతో దేవి బుధవారం పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా చికిత్సపొందుతూ మృతిచెందినట్లు తెలిపారు.