జగదీష్ మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు, (ఇన్‌సెట్లో) మృతి చెందిన జగదీష్ (ఫైల్)
నెల్లూరు, కలువాయి: కూల్‌డ్రింక్ అని పొరబడి పురుగు మందు తాగి ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన కలువాయి మండలం ఉయ్యాలపల్లి పంచాయతీ ఎర్రబల్లిలో విషాదాన్ని నింపింది. స్థానికుల సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన శివకృష్ణ, ధనమ్మల మొదటి కుమారుడు కాకుమూరి జగదీష్ (9) స్థానిక ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. జగదీష్ తండ్రి శివకృష్ణ మంగళవారం ఉయ్యాలపల్లిలో జరిగిన జన్మభూమి–మా ఊరు కార్యక్రమానికి వెళ్లాడు.
అక్కడ ఏర్పాటు చేసిన పశువైద్య శిబిరంలో మూగజీవాలకు వాడే క్లాటాక్స్ (సైఫర్‌మెత్రిన్) పురుగు మందును ఖాళీ స్ప్రైట్ బాటిల్‌లో తీసుకువచ్చి ఇంటి వరండాలోని ఫ్రిజ్‌పై ఉంచి బయటకు వెళ్లాడు. మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చిన జగదీష్ ఫ్రిజ్‌పై ఉన్న బాటిల్‌ను చూసి కూల్‌డ్రింక్ అనుకుని తాగాడు. దీంతో అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే కలువాయికి తీసుకువచ్చి ప్రాథమిక చికిత్స అనంతరం పొదలకూరుకు తరలించగా అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. బాలుడి మృతితో అతని తల్లిదండ్రులు, బంధువులు గుండెలు అవిసేలా రోదించారు. గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. జగదీష్‌ను కడచూపు చూసి కాలనీ వాసులు బాలుడికి కన్నీటి వీడ్కోలు పలికారు.
అందుబాటులోకి రాని 108 వాహనం
బాలుడిని చికిత్స నిమిత్తం కలువాయి నుంచి పొదలకూరుకు తరలించేందుకు బాధితులు పలుమార్లు 10 8 వాహనానికి ఫోన్ చేసినా సరిగా స్పందించలే దు. వాహనం రాకపోవడంతో గంట ఆలస్యంగా ప్రై వేట్ వాహనంలో తరలించడంతో అప్పటికే జాప్యం కారణంగా బాలుడు మృతిచెందాడని బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంఈఓ పరామర్శజగదీష్ మృతి నేపథ్యంలో ఎంఈఓ జి.సుధీర్‌బాబు, పాఠశాల ఉపాధ్యాయులు, సీఆర్‌పీలు బుధవారం ఉదయం గ్రామానికి వెళ్లి జగదీష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. జగదీష్ మృతికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment