మూడు దశాబ్దాలుగా అన్నాడీఎంకే లేదా డీఎంకే పార్టీల పొత్తుతో నెట్టుకుని వస్తున్న కాంగ్రెస్ పార్టీని లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీలు దూరం పెట్టేశాయి. జాతీయ స్థాయిలో అప్రతిష్టపాలైన కాంగ్రెస్‌తో
చెన్నై, సాక్షి ప్రతినిధి : మూడు దశాబ్దాలుగా అన్నాడీఎంకే లేదా డీఎంకే పార్టీల పొత్తుతో నెట్టుకుని వస్తున్న కాంగ్రెస్ పార్టీని లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీలు దూరం పెట్టేశాయి. జాతీయ స్థాయిలో అప్రతిష్టపాలైన కాంగ్రెస్‌తో జత కట్టేందుకు మరేపార్టీ సాహసించలేదు. దీంతో విధిలేక ఒంటరి పోరుకు దిగిన కాంగ్రెస్ మొత్తం 40 స్థానాల్లో ఘోరంగా ఓడిపోయింది. దాదాపు అన్నిచోట్ల డిపాజిట్లు గల్లంతయ్యూయి.
రాళ్లు ఏరివేస్తాం: జ్ఞానదేశికన్
పార్టీ ఓటమికి కారణాలు ఏమిటో అందరికీ తెలుసని, బలమైన కూట మిని ఏర్పాటు చేసుకోలేక పోయామని జ్ఞానదేశికన్ పేర్కొన్నారు. అయితే పార్టీలోని అంతర్గత శత్రువుల వల్లే ఎక్కువ నష్టం చేకూరిందన్నారు. ఇటువంటి అనసవర రాళ్లను ఏరివేసి పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం వర్గాన్ని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. పదవులపై నాకు మోహం లేదు, అధిష్టానం ఆదేశిస్తే తప్పుకునేందుకు సిద్ధమని చెప్పారు. పార్టీలో సమస్యలుంటే చర్చించి పరిష్కరించుకోవాలి అంతేగానీ పత్రికలకు ఎక్కకూడదని ఆయన సూచించారు.
రాష్ట్రంలో ఇక ఏ పార్టీతో కాంగ్రెస్‌కు పొత్తు వద్దని, ఒంటరిపోరుతోనే బల నిరూపణ చేసుకోవాలని పలువురు కార్యకర్తలు సూచించారు. కన్యాకుమారి స్థానం నుంచి పోటీచేసి ద్వితీయస్థానంలో నిలిచి భారీ ఓట్లు సాధించిన వసంతకుమార్‌ను ఈ సందర్భంగా సత్కరించారు.సమావేశం అనంతరం మీడియా తో మాట్లాడుతూ, రాష్ట్ర, జిల్లా కమిటీ లు ఇటీవలే ఏర్పడినందున త్వరలో డివిజన్, నగర కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తామని, ఉత్సాహంగా పాల్గొనేవారికి జిల్లా స్థాయి పదవులను అప్పగిస్తామని చెప్పారు. పార్టీ బలోపేతానికి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నట్లు తెలిపారు.
చిదంబరం వర్గం డుమ్మా
లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి అంశమే ప్రధాన అజెండాగా ఏర్పాటు చేసుకు న్న సమావేశానికి మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరం వర్గానికి చెందిన ఒక్క కార్యకర్తకూడా హాజరుకాలేదు. ఎన్నికల ఫలితాలు వెలువడగానే చిదంబ రం అనుచరులు జ్ఞానదేశికన్‌పై దుమ్మెత్తిపోశారు. పార్టీలో నేతలను కలుపుకుపోలేదు, భారీగా ప్రచారా లు నిర్వహించలేదు, ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ అధిష్టానం ఇచ్చిన సొమ్మును స్వాహా చేశారు వంటి అనే క ఆరోపణలను గుప్పించారు. టీఎన్‌సీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం నా టి సమావేశానికి రాష్ట్రఅగ్రనేతలు జీకే వాసన్, ఇళంగోవన్, తంగబాలు వ ర్గాలకుచెందిన వారు హాజరయ్యూరు.