ఆశలు..ఆవిరి | Hopes .. Steam | Sakshi
Sakshi News home page

ఆశలు..ఆవిరి

Published Tue, Apr 1 2014 2:28 AM | Last Updated on Thu, Jun 14 2018 4:21 PM

ఆశలు..ఆవిరి - Sakshi

ఆశలు..ఆవిరి

 నవ వసంతం వారిళ్లలో కొత్త దనం తేలేదు సరికదా.. తీరని విషాదాన్ని నింపి..కాలుని నిర్ణయం కఠినమని రుజువు చేసింది. భర్తా, పిల్లలతో కలిసి ఉగాది వేడుకను చేసుకుందామని ఎదురు చూస్తున్న ఆ ఇల్లాలికి గుండెనిండా శోకాన్ని నింపింది. దేవరకద్ర మండలం బస్వాయిపల్లికి చెందిన చంద్రమ్మకు ఎదురైన దుస్థితి.  మాచన్ పల్లిలో ఆడపడుచు ఇంటి వద్ద ఉండి చదువుకుంటున్న పిల్లలు యాదమ్మ (12), యశ్వంత్ (8)లను పండుగకు ఇంటికి తెస్తానని వెళ్లిన భర్త వెంకటయ్య (35) కొడుకు సహా అందని లోకాలకు వెళ్లిపోయాడు. కుమార్తె తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలైంది. ఇంటికి హుషారుగా బైక్‌పై బయలు దేరిన వారిని  బస్సు మృత్యు దేవతై కబలిం చింది. ఈ విషయం తెలిసిన చంద్రమ్మకు కంటనీరు తప్పా మాట పెగలడం లేదు.

కుటుం బంపై పెంచుకున్న ఆశలు..చెదిరిన స్వప్నమవ్వడాన్ని తట్టుకోలేక పోతోంది. ఇక భూత్పూ ర్ జాతీయ రహదారిపై జరిగిన   రోడ్డు ప్రమాదంలో ఆరుగురు బొలెరో వాహనం బోల్తాపడి ప్రమాదంలో చిక్కుకోగా మాసన్న (50) అనే వ్యక్తి, గుర్తు తెలియని మరో ఇరువురు ప్రాణాలు కోల్పోయి ఆత్మీయులకు వేదనను మిగిల్చారు.
 
పండగపూట పచ్చని తోరణాలతో కళకళలాడాల్సిన కుటుంబాల్లో రక్తం చిందింది.  బంధువులు..స్నేహితులు..ఇరుగుపొరుగు వారితో ఆనందం నిండాల్సిన ఇళ్లల్లో కన్నీరు మిగిలింది. షడ్రుచులతో తయూరు చేసిన పచ్చడి తిందామని దూరప్రాంతాల నుంచి తమతమ ఇళ్లకు బయలు దేరిన వారు తిరిగిరాని లోకాలకు చేరి‘పోయూరు’.అరుున వారితో ఆప్యాయంగా గడుపుదామనుకున్న వారు విగతజీవులై తమవారిని శోకసంద్రంలో ముంచేశారు. దేవరకద్ర నియోజకవర్గంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయలతో మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
 
 
 బొలెరో బోల్తా : ముగ్గురు మృతి
 
 భూత్పూర్ : వేగంగా వెళ్తున్న ఓ బొ లెరో వాహనం అదుపుతప్పి బోల్తాపడి  ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరి కి తీవ్రగాయాలయ్యాయి. సోమవారం జాతీయ రహదారిపై గల శేర్‌పల్లి (బి) సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసు కుంది. హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు బండల లోడ్‌తో వెళ్తున్న వాహనం లో ఆరుగురు ప్రయాణికులు కూడా ఉన్నారు.  వెనుక టైరు పంక్చర్ కావడంతో బోల్తాపడింది.  పెబ్బేర్ మం డలం పెంచికలపాడుకు చెందిన హ రిజన్ మాసన్న (50) అక్కడికక్కడే మృ తిచెందాడు. అతని కుమారుడు బాలకృష్ణకు కాలు, చేయి విరిగింది. మ రో ఇద్దరు మృతుల ఆచూకీ తెలియాల్సి ఉంది. కర్నూలుకు చెందిన డ్రైవర్ సురేశ్‌కు కాలు విరగ్గా, తలకు తీవ్రగాయాలయ్యాయి. గాయాలైన బాలకృష్ణ, సు రేశ్‌లను 108 ద్వారా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 బతికి బయటపడ్డ దంపతులు...
 
మానవపాడు మండలం తక్కశిలకు చెందిన మద్దిలేటి, లక్ష్మి అనే దంపతులు  డ్రైవర్ పక్కకు కూర్చొని ప్రయాణిస్తున్నారు. డ్రైవర్ కాలు, చేయి విరి గినా మద్దిలేటి, లక్ష్మిలకు ఎలాంటి గా యాలు కాకుండా బతికి బయటపడ్డారు. ఈ సంఘటన నుంచి తేరుకున్న అనంతరం భగవంతుడు తమకు పునర్జన్మ ప్రసాదించాడని  లక్ష్మమ్మ రో దిస్తూ తెలిపింది.  మృతి చెందిన ముగ్గురి శవాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. జ డ్చర్ల రూరల్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో భూత్పూర్ ఎస్సై లక్ష్మారెడ్డి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  పెంచికలపాడులో విషాదం

 పెంచికలపాడు(పెబ్బేరు) :  పొట్ట చేత పట్టుకొని పనికోసం పట్నం వెళ్లిన తం డ్రీ కొడుకులపై విధి కక్ష గట్టింది. తన కుమారుడితో ఉగాది పండుగకు సొంత ఊరికి బయలు దేరి వస్తుండగా మార్గమధ్యంలో వారు ప్రయాణిస్తున్న వాహ నం ప్రమాదానికి గురై తండ్రి అక్కడికక్కడే మృతి చెందగా.. కుమారుడికి తీ వ్ర గాయలయ్యాయి. తన భర్త , కుమారుడు పండుగకు వస్తున్నారని ఎదురు చూస్తున్న ఆ ఇల్లాలికి విషయం తెలిసేసరికి కుప్పకూలిపోయింది.  పెంచికల పాడు  ఎస్సీ కాలనీకి చెందిన కర్రె మశన్న(52), అక్కమ్మ దంపతులకు ఆరుగురు సంతానం. వారిలో ఐదుగురు ఆ డపిల్లలు కాగా ఒకే ఒక్క కుమారుడు. నిరుపేద కుటుంబానికి చెందిన వారు కావడంతో పని కోసం  హైదరాబాద్ వె ళ్లి కూలీ చసి  జీవనాన్ని గడుపుతున్నా రు.   తన కుమారుడు బాలకష్ణతో కలిసికూలీ చేస్తూ ఐదుగురు కూతుళ్ల పెళ్లీలు చేశారు. ఖర్చుల నిమిత్తం హైదరాబాద్‌లో పని చేస్తుండేవారు.
 
 పండగపూట విషాదం నెలకొంది. బస్సు రూపంలో వచ్చిన మృత్యువు ఇద్దరిని బలిగొంది. తండ్రీ, కూతురు,కొడుకు కలిసి వస్తున్న బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢికొట్టి ఇద్దరి ప్రాణాలు బలిగొంది. తండ్రీ కొడుకులు దుర్మరణం చెందగా..కూతురు తీవ్ర గాయూలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సోమవారం దేవరకద్ర-మహబూబ్‌నగర్ మార్గమధ్యంలోని కోటకదిర స్టేజీ వద్ద  ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దేవరకద్ర మండలం బస్వాయిపల్లికి చెందిన హరిజన్ వెంకటయ్య, చంద్రమ్మ  దంపతులకు ఇద్దరు ఆడ సంతానం, ఒక్కగానొక్క కొడుకు ఉన్నాడు. వెంకటయ్య (35) వడ్డెరపని చేస్తూ తన టుంబాన్ని పోషించుకుంటున్నాడు. కూతురు యాదమ్మ (12) యశ్వంత్ అలియాస్ చింటూ (8)లు కోటకదిర స్టేజీ సమీపంలోని కాకతీయ ప్రైవేట్ పాఠశాలలో ఒకరు 8వ తరగతి, ఒకరు ఒకటో తరగతి చదువుతున్నారు. వీరు మహబూబ్‌నగర్ మండలం మాచ న్‌పల్లిలోని తన మేనత్త వద్ద ఉంటూ ప్రతి రోజు పాఠశాలకు వెళ్లి విద్యనభ్యసిస్తున్నారు.

అయితే పండగకు తన కూతురు, కొడుకును బైక్‌పై  స్వగ్రామానికి తీసుకు వస్తుండగా  కోటకదిర స్టేజీ వద్ద  రాయచూర్ నుంచి హైదరాబాద్  వెళ్లే ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో వెంకటయ్య అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. యాదమ్మ, యశ్వంత్‌లకు తీవ్ర గాయాలయ్యాయి.  108 అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా యశ్వంత్ మార్గమధ్యంలోనే మృతి చెందాడు. యాదమ్మ తీవ్ర గాయాలపాలై ఎస్‌వీఎస్ ఆస్పత్రిలో కోలుకుంటోంది. కుటుంబ సభ్యుల రోదనలు  అందరినీ కలిచివేశారుు. మహబూబ్‌నగర్ రూరల్ పోలీసులు ప్రమాద స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 బస్వాయిపల్లిలో విషాదం...

 రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకులు మృతిచెందడంతో వారి స్వగ్రామమైన బస్వాయిపల్లిలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. అందరితో కలిసిమెలిసి ఉండే తండ్రి, కొడుకులు ఇద్దరు ఒకేసారి దుర్మరణం చెందడంతో గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement