కేజీబీవీ విద్యార్ధిని రమ్య ఎందుకు ఆత్మహత్య చేసుకున్నట్లు
-రమ్య ఆత్మహత్యపై మూడు రోజులు అయినా వీడని మిస్టరీ
-పోస్టుమార్టం ఆధారంగా దర్యాప్తు చేయడానికి సిద్దమవుతున్న పోలీసులు
శ్రీకాకుళం జిల్లా : లావేరు మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికలు విద్యాలయంలో ఈనెల21వ తేదీ రాత్రి వాటర్ ట్యాంకులో దూకి పాఠశాల విద్యార్ధిని బి రమ్య ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన వార్త తెలిసిందే. అయితే రమ్య ఆత్మహత్య ఎందుకు చేసుకుందన్న కారణాలు మూడు రోజులు కావస్తున్నా నేటికి తెలియరాకుండా మిస్టరీగానే ఉన్నాయి. ఇంటి వద్ద గాని, పాఠశాలల్లో గాని రమ్యకు ఏసమస్యలు లేవని రమ్య తల్లిదండ్రులు, పాఠశాల ప్రత్యేకాధికారి చెబుతున్నారు. ఏ కారణాలు లేకుండా, ఏసమస్యలే లేకుండా రమ్య ఊరికే ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలలో రమ్య బాగా చదువుతుందని చెబుతున్నారు కూడ. బాగా చదువుకునే విద్యార్దిని ఒకే సారి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందన్న ప్రశ్నలు కూడ వ్యక్తమవుతున్నాయి. దసరా సెలవులుకు రమ్య ఇంటికి వెళ్లి వచ్చిన తరువాతనే అమెలో కొంత మార్పు వచ్చిందని తెలుస్తుంది. రమ్య ఆత్మహత్య చేసుకొని మృతి చెంది మూడు రోజులు కావస్తున్నా కార ణాలు ఎవరికి అంతుపట్టడం లేదు. ఏది ఏమైనా రమ్య ఆత్మహత్య కారణాలు తెలియరాకపోవడం పోలీసులుకు సవాల్‌గానే మారింది.
- రమ్య పోస్టుమార్టం ఆధారంగా కారణాలుపై పోలీసులు దర్యాప్తు
రమ్య ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు అంతుపట్టక పోవడంతో పోస్టుమార్టం రిపోర్టు ఆదారంగా కేసును దర్యాప్తు చేసి కారణాలును కనుగొనడానికి పోలీసులు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. రమ్యకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా లేకా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేది పోస్టు మార్టం రిపోర్టులో తెలుస్తుందని, దాని ఆధారంగా కారణాలును తెలుసుకోవచ్చునని పోలీసులు బావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈనెల 26 వ తేదీన రమ్య పోస్టుమార్టం రిపోర్టు వస్తుందని అప్పుడు వరకూ వేచి చూసి అప్పుడు ఆత్మహత్య కారణాలుపై దర్యాప్తు చేయాలని పోలీసులు బావిస్తున్నట్లు తెలుస్తుంది. పోస్టు మార్టం ఆదారంగా అయినా రమ్య ఆత్మహత్యకు కారణాలు తెలియాలంటే కొద్ది రోజులు వేచిచూడాల్సిందే.