బీఎంకే కోటి(41) భౌతికకాయానికి పోస్టుమార్టంపూర్తయింది.
చెన్నై: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం ఒంటికి నిప్పంటించుకొని మృతిచెందిన బెంగళూరు ముని కామకోటి అలియాస్ బీఎంకే కోటి(41) భౌతికకాయానికి పోస్టుమార్టంపూర్తయింది. కాసేపట్లో మునికోటి భౌతిక కాయాన్ని కుటుంబసభ్యులకు వైద్యులు అప్పగించనున్నారు. తీవ్రగాయాలతో చెన్నై కేఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మునికోటి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ రోజు సాయంత్రం కోటి అంత్యక్రియలను తిరుపతిలో నిర్వహించనున్నారు.
మరో బాధితుడు శేషాద్రిని కేఎంసీ ఆస్పత్రిలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి పరామర్శించారు. బాధితుడికి అవసరమైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.