కొండమోడు గ్రామానికి చెందిన కరీం మృతి పై అనుమానాలు
భ ర్తను హత్య చేశారని
భార్య పోలీసులకు ఫిర్యాదు
మృతదేహం వెలికితీత
పిడుగురాళ్ళ రూరల్ చనిపోయిన వ్యక్తి శవాన్ని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు వెలికితీసి శుక్రవారం పోస్ట్‌మార్టం చేసిన ఘటన రాజుపాలెం వుండలం కొండమోడు గ్రావుంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. గతేడాది సెప్టెంబర్ 3న కొండమోడు గ్రామానికి చెందిన కరీం పిడుగురాళ్ల వెళుతున్నానని చెప్పి మరుసటి రోజు శవమై కన్పించాడు. బంధువులు ముస్లింల శ్మశానవాటికలో ఖననం చేశారు. తన భర్తను హత్య చేశారని ఆరోపిస్తూ కరీం భార్య షహీనా పోలీసులు చుట్టూ తిరుగుతోంది. ప్రజా సంఘాల ఒత్తిడి మేరకు రెండు రోజుల క్రితం పోలీసులు కేసు నమోదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం పిడుగురాళ్ళ రూరల్ సీఐ శ్రీధర్‌రెడ్డి, రాజుపాలెం తహశీల్దార్ సీహెచ్ విజయు జ్యోతికువూరి, గుంటూరు ఫోరెన్సిక్ ల్యాబ్ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ కృష్ణవుూర్తి, గురజాల మెడికల్ ఆఫీసర్ సతీష్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీశారు. పంచనావూ నిర్వహించి పోస్టువూర్టం చేశారు.
ప్రజా సంఘాల నేతల ఆగ్రహం
పోర్ట్‌మార్టం చేసే విధానంపై ప్రజా సంఘాల నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా హక్కుల సంఘం వేదిక రాష్ట్ర సెక్రటరీ, డిఫెన్స్ లాయుర్ పాపారావు, ప్రజా హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి మీసాల ప్రభుదాసు మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం పోస్టువూర్టం నిర్వహించేందుకు వుుగ్గురు పైన డాక్టర్లు ఉండాలన్నారు. ఒక్క వైద్యుడితో ఎలా నిర్వహిస్తారంటూ అధికారులను ప్రశ్నించారు. దీంతో పోలీసులు డాక్టర్లను పిలిపించారు.
మధ్యాహ్నం వరకూ కనిపించని మృతదేహం జాడ
మధ్యాహ్నం 2 గంటల వరకు కరీం వుృతదేహం జాడ కనిపించలేదు. ఇటీవల శ్మశానవాటికకు మెరక తోలించడంతో సమస్య ఎదురైంది. పొక్లెయిన్‌తో తవ్వించి జాడ కనుగొన్నారు. కరీం భార్య షహీనా నుంచి అధికారులు స్టేట్‌మెంటు నమోదు చేశారు. తన భర్తను ఎవరో హత్య చేశారని ఆమె తెలిపింది. కొండమోడులోని ఓ పెస్టిసైడ్ కంపెనీలో 10 సంవత్సరాలుగా గువుస్తాగా పని చేస్తున్నాడని, గతేడాది జనవరి 15న యుజవూనితో గొడవ పడి వచ్చాడని తెలిపింది. తర్వాత షాపు యజమాని సెప్టెంబర్ 2న ఇంటి వద్దకు వచ్చి వేరే కంపెనీలో పని చేయువద్దని, చేస్తే సహించేది లేదంటూ హెచ్చరించారని షహీనా ఫిర్యాదు చేసింది. వుూడవ తేదీ రాత్రి 9.30 గంటల సవుయుంలో ఓ ఫోన్ కాల్ వచ్చిందని, వెంటనే వస్తానని చెప్పి వెళ్ళిన భర్త మర్నాడు పిడుగురాళ్లలోని ఓవర్‌బ్రిడ్జి వద్ద చనిపోరుు ఉన్నాడని తహశీల్దార్‌కు తెలిపింది. అనంతరం రెండవ వైద్యాధికారి, గురజాల మెడికల్ ఆఫీసర్ సతీష్ సంఘటనా స్థలానికి హాజురు కావటంతో సాయుంత్రం 6 గంటల సవుయుంలో గొరుు్యలో నుంచి కరీం మృతదేహాన్ని తీసి మరలా పోస్టుమార్టం నిర్వహించారు. నివేదికలను పోలీసు అధికారులకు అందజేస్తావున్నారు. సీఐ శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ కేసును త్వరలో ఛేదిస్తామన్నారు. ప్రజా సంఘాల నాయుకులు వూట్లాడుతూ కరీం మృతి వెనుక రాజకీయు కోణాలు ఉన్నాయుని, సిట్టింగ్ జడ్జితో పోస్టువూర్టం నిర్వహించాలని వారు కోరారు. కార్యక్రవుంలో రాజుపాలెం, పిడుగురాళ్ళ, వూచవరం ఎస్‌ఐలు, రెవెన్యూ, వైద్య సిబ్బంది పలువురు పాల్గొన్నారు.
ఆరు నెలల తర్వాత పోస్ట్‌మార్టం
Published Sat, Feb 27 2016 2:40 AM | Last Updated on Thu, Oct 4 2018 5:51 PM
Advertisement
Advertisement