అలీనగర్‌పై చిరుత పంజా
► మేక ల మందపై దాడి
► నాలుగు మేకలు మృతి
జన్నారం(ఆదిలాబాద్) : భయం గుప్పిట్లో బతుకుతున్న జన్నారం మండలంలోని అలీనగర్‌పై చిరుతపులి పంజా విసిరింది. దీంతో వారి భయానికి మరింత ఆందోళన తోడైంది. చిరుతపులి అడవిలోనుంచి అలీనగర్ గ్రామానికి వచ్చింది. ఇళ్ల పక్కనే ఉన్న మేకల మందపై దాడి చేసింది. నాలుగు మేకలను హతమార్చింది. ఈ సంఘటన ఆ గ్రామ గిరిజనులకు తీవ్ర భ యూందోళనలకు గురిచేసింది. ప్రత్యక్ష సాక్షి, బాధితుడు పెంద్రం కృష్ణ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నారు.
తెల్లవారుజామున...
పెంద్రం కృష్ణ ఆదివారం రాత్రి తన ఇంటి పక్కన గల దొడ్లోకి మేకలను తోలి, బయ ట పందిరి కింద పడుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయం లో మేకల అరుపులు వినిపించాయి. చప్పుడు విని లేచి చార్జింగ్ టార్చ్‌లైట్‌తో చూసేసరికి చిరుతపులి ఓ మేక తలను నోటితో కరిచి రక్తం తాగుతోంది. దీంతో కృష్ణ గట్టిగా కేకలు వేశాడు. కేకలు విని చిరుత మేకను వదిలి పారిపోయింది. అతడు కూడా చిరుతను తరుముతూ కొంత దూరం వెళ్లాడు. వచ్చి తన తల్లి దృపదబారుు తో పాటు అందరినీ నిద్ర లేపాడు. అప్పటికే పెంద్రం బొజ్జుబాయికి చెందిన రెండు మేకలు, కృష్ణకు చెందిన రెండు మేకలను చిరుత చంపివేసింది.
తెల్లారే వరకు గూడెం వాసులు మేల్కొనే ఉన్నారు. ఈ విషయం తెల్లవారి ఫారెస్ట్ అధికారులకు తెలియజేశారు. అనంతరం పశు వైద్యాధికారితో పోస్టుమార్టం నిర్వహించారు. బీట్ అధికారి భూమన్న వివరాలను నమోదు చేసుకున్నారు. ఇదివరకే పులి వస్తుందని భయం గుప్పిట్లో బతుకుతున్న గిరిజనులకు చిరుత దాడి మరింత ఆందోళనలకు గురిచేస్తోం ది. తమకు అడవి జంతువులతో ప్రాణభయం ఉందని, ఈ విషయంలో శాశ్వత పరి ష్కారం చూపించాలని గిరిజన పెద్దలు మాణిక్‌రావు, పార్వతిరావు కోరుతున్నారు.