chirutha puli
-
ఏలూరు జిల్లాలో చిరుత సంచారం
-
రాజమండ్రి: రూట్ మార్చిన చిరుత
రాజమహేంద్రవరం రూరల్/కడియం: దివాన్ చెరువు అభయారణ్యంలో సంచరించిన చిరుత పులి కడియం నర్సరీ ప్రాంతానికి చేరినట్టు అటవీశాఖ అధికారులు ధ్రువీకరించారు. కడియం – వీరవరం రోడ్డు మధ్యలోని దోసాలమ్మ కాలనీలో చిరుత జాడలు కనిపించాయి. దీంతో కాలనీ వాసులందరూ భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న దివాన్ చెరువు ఫారెస్టు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ పద్మావతి, రేంజర్ శ్రీనివాస్, స్క్వాడ్ డీఆర్వో రాజా అండ్ టీమ్, రేంజ్ పరిధిలోని సిబ్బంది ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. అవి చిరుత పాదముద్రలే అని గుర్తించారు. అయితే అది ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందనే విషయం అంతుపట్టడం లేదు. కొన్ని నర్సరీలలో సీసీ కెమెరాలు ఉంటాయి. పులి భయంతో నర్సరీల్లో రైతులెవ్వరూ ఉండడం లేదు. చిరుత ఈ ప్రాంతంలోనే ఉందా, ఎక్కడికైనా వెళ్లిందా అన్న విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. పులి సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులు, కూలీలకు బుధవారం నర్సరీలకు వెళ్లవద్దని సూచించారు. -
తిరుమల నడక మార్గంలో బాలుడిపై చిరుత దాడి
తిరుమల: తిరుమల నడక మార్గంలోని 7వ మైలు వద్ద ఓ చిరుత పులి బాలుడిపై దాడి చేసింది. తన తాతతో కలిసి అక్కడే ఉన్న దుకాణంలో తినుబండారాలు కొనుక్కుంటున్న సమయంలో హఠాత్తుగా వచ్చిన చిరుత బాలుడి మెడ పట్టుకుని ఎత్తుకెళ్లినట్టు తెలుస్తోంది. వెంటనే స్పందించిన అక్కడి దుకాణదారుడు, తల్లిదండ్రులు, భద్రతా సిబ్బంది కేకలు పెడుతూ చిరుత వెనుక పరుగులు తీశారు. టార్చ్‌లు వేస్తూ, రాళ్లు విసరడంతో 7వ మైలు కంట్రోల్ రూం వద్ద చిరుత బాలుడిని వదిలేసి అడవిలోకి వెళ్ళిపోయింది. చిరుత దాడి నుంచి బాబును అక్కడి భద్రతా సిబ్బంది రక్షించినట్టు సమాచారం. గాయాల పాలైన బాలుడిని మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని శ్రీపద్మావతి చిన్నపిల్లల ఆస్పత్రికి తరలించారు. బాలుడి చెవి వెనుక, మరికొన్ని ప్రాంతాల్లో చిరుత దంతపు గాయాలయ్యాయి. అయితే ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. గాయపడిన బాలుడు కర్నూలు జిల్లా ఆదోని వాసి కౌషిక్(3)గా గుర్తింపు. జరిగిన విషయం తెలియడంతో టిటిడి ఈవో ధర్మారెడ్డి బాలుడిని పరామర్శించారు. బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ధర్మారెడ్డి సూచించారు. చిరుత దాడి చేసిన మెట్ల మార్గంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటునట్టు తెలిపారు. ఇకపై నడక మార్గంలో భక్తులను గుంపులు గుంపులుగా పంపుతామన్నారు. భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. స్విమ్స్‌కు చెందిన న్యూరో స్పెషలిస్ట్‌లు ప్రత్యేక వైద్యం అందిస్తున్నారని ధర్మారెడ్డి పేర్కొన్నారు. -
సంగారెడ్డి జిల్లాలో చిరుత సంచారం
-
'చిరుత పులి' రోజుకొకటి బలి!
సాక్షి, హైదరాబాద్: అంతరించడంలో చిరుతదే వేగం. పులుల కంటే వేగంగా అంతరించి పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న వన్యప్రాణుల్లో చిరుతపులి ముందు వరసలో ఉందని జంతుప్రేమికులు, పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఐదేళ్లలో ప్రపంచంలోనే అత్యధికంగా భారత్‌లోనే ఎక్కువగా చిరుతపులులు మరణించాయి. ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే 218 చిరుతలు మరణించాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. పెరుగుతున్న మనిషి, మృగం సంఘర్షణ అడవులు, పచ్చదనం తగ్గిపోతూ పట్టణీకరణ విస్తరించడంతో మనుషులు–జంతువుల మధ్య సంఘర్షణ పెరుగుతోంది. జంతువులు ముఖ్యంగా చిరుతపులులు వంటివి ఆహారం కోసం గ్రామాల శివార్లలోకి, నివాస ప్రాంతాల్లోకి వస్తుండటంతో వాటిపై దాడులు పెరుగుతున్నాయి. వేట, గ్రామస్తుల దాడులతోపాటు బావుల్లో పడి, విద్యుత్ షాక్, రైలు,రోడ్డు ప్రమాదాలకు గురై చిరుతలు మృత్యువాత పడుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రతిరోజు ఒక చిరుతపులి చనిపోతున్నట్టు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 2018లో అత్యధికంగా 460 చిరుతలు ప్రాణాలు కోల్పోయాయి. తెలుగు రాష్ట్రాల్లో.. 2014లో రాష్ట్ర విభజనకు పూర్వం ఉమ్మడి ఏపీలో పులుల ఆవాసప్రాంతాలు, అభయారణ్యాల్లో 345 చిరుత పులులున్నట్టుగా అంచనా. పులుల మాదిరిగా దట్టమైన అడవులు, ఆహారం, నీటికి అనువైన ప్రాంతాలు, విశాలమైన పరిసరాలకే చిరుతపులులు పరిమితం కావు. అడవుల బయట అనువైన ప్రాంతాల్లో కూడా సులభంగా ఇవి జీవించగలుగుతాయి. ఈ లక్షణాలను బట్టి ఉమ్మడి ఏపీలో అడవుల బయట 250కు తక్కువ కాకుండా చిరుతలు ఉన్నాయని పర్యావరణవేత్తల అంచనా. అయితే, 2018 నాటికి ఏపీలో 300 నుంచి 350 వరకు, తెలంగాణలో 100 నుంచి 150 వరకు చిరుతపులులుంటాయని భావిస్తున్నారు. 2014లో దేశవ్యాప్తంగా పులుల ఆవాస ప్రాంతాల్లో చిరుతల సంచారానికి సంబంధించి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ సేకరించిన వివరాల ప్రకారం మొత్తం 7,872 చిరుతపులులు ఉన్నట్టు అంచనా.. అన్ని రకాలుగా కలుపుకుంటే.. మొత్తంగా 15 వేల వరకు ఉండొచ్చని చెబుతున్నారు. 2018కు సంబంధించి పులుల గణణ వివరాలను అధికారికంగా ప్రకటించారు. చిరుతల సంఖ్యను ఇంకా ప్రకటించాల్సి ఉంది. కాగా, పులుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్న విధంగానే...రాజస్తాన్‌లో మాదిరిగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చిరుతల కోసం ప్రత్యేకంగా ‘ప్రాజెక్ట్ లెపర్డ్’ను ప్రారంభించాలని హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ ప్రతినిధి ఇమ్రాన్ సిద్ధిఖీ కోరుతున్నారు. -
తిరుమల కొండపై చిరుత హల్చల్
-
ఎట్టకేలకు చిరుతను బంధించిన ఫారెస్ట్ అధికారులు
-
గ్రామంలో సంచరిస్తున్న చిరుత
మెదక్‌రూరల్: దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఉండాల్సిన చిరుత పులులు వ్యవసాయ పొలాల్లో సంచరిస్తున్నాయి. కంటికి కనిపించిన మూగజీవాలపై పంజా విసురుతున్నాయి. మొన్న రామాయంపేట మండలంలోని లక్ష్మాపూర్, నిన్న అదే మండల పరిధిలోని దండేపల్లిలో, నేడు మెదక్ మండల పరిధిలోని ఖాజీపల్లిలో చిరుత పులులు సంచరిస్తున్నాయి. అటవీ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాకు చిరుత చిక్కిన సంఘటన మెదక్ మండలం ఖాజీపల్లి శివారులో ఆదివారం చోటుచేసుకుంది. మెదక్ మండలం ఖాజీపల్లి అటవీ ప్రాంతం శివారులో అదే గ్రామానికి చెందిన కాసుల లక్ష్మినారాయణకు వ్యవసాయ భూమి ఉంది. అక్కడే పశువులను పెంచుతున్నాడు. శుక్రవారం రాత్రి ఓ లేగదూడను ఏదో జంతువు హతమార్చింది. చిరుత అయి ఉండవచ్చని అనుమానించిన రైతు అటవీ అధికారులకు సమాచామిచ్చాడు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు ఆ లేగ చనిపోయిన చోటుకు చిరుత తిరిగి రావచ్చనే కోనంలో సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఊహించిన విధంగానే సీసీ కెమెరాకు ఓ భారీ చిరుత చిక్కింది. దీంతో చిరుత సంచరిస్తున్నట్లు అధికారులకు స్పష్టమైంది. దీంతో శివారులో ప్రాంతాల్లో గల వ్యవసాయ పొలాలకు వెళ్లాలంటేనే చుట్టుపక్కల గ్రామాలవారు జంకుతున్నారు. ఇటీవల రామాయంపేట మండలంలో బీభత్సవం సృష్టిస్తున్న చిరుతను పట్టుకోకముందే మెదక్ మండలంలో చిరుత సంచారం అటవిశాఖ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. అడవుల్లో ఆహారం, నీరు లేకపోవడం వల్లే గ్రామ శివారుల్లోకి చిరుత ప్రవేశిస్తుందా అనే కోణంలో అధికారులు ఆలోచిస్తున్నారు. అధికారులు అప్రమత్తమై చిరుతను బందించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
తిరుమలలో చిరుత మళ్లీ హల్చల్
సాక్షి, తిరుమల: తిరుమలవాసులకు, అక్కడికి వచ్చే భక్తులకు చిరుత పులులు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. కొంతకాలంగా అటవీప్రాంతానికి ఆనుకుని ఉన్న బాలాజీనగర్, కాటేజీ ప్రాంతాల్లో చిరుతల సంచారం పెరిగింది. ఇటీవల బాలాజీ నగర్‌లోని తూర్పు ప్రాంతంలో ఓ ఇంట్లో దూరిన చిరుత అక్కడి కుక్కను ఎత్తుకెళ్లింది. తాజాగా, ఆదివారం రాత్రి చిరుత తిరిగి అదే ప్రాంతానికి చేరుకుంది. సుమారు గంటకుపైగా అటూఇటూ తిరగాడింది. చెట్లు అలికిడి కావడంతో ఇంటి మిద్దెపై ఉన్న స్థానికుడు చిరుతను గుర్తించాడు. వెంటనే తన కెమెరాలో చిరుతను బంధించాడు. -
అడవిలో మేకల కాపరి మృతి
భీమ్‌గల్(బాల్కొండ): మండలంలోని పిప్రి గ్రా మ శివారు అటవీ ప్రాంతంలో మంగళవారం గామాని కి చెందిన మేకల కాపరి సంపంగి ఎల్లయ్య(40) మృతి చెందాడు. ఎల్లయ్య ఉదయం మేకలను కా యడానికి గ్రామ శివారులోని అడవికి వెళ్లాడు. సా యంత్రమైనా ఇంటికి రాకపోయే సరికి అతని భా ర్య ఎల్లయ్యను వెతుకు తూ అడవిలోకి వెళ్లింది. దా యి చెరువు సమీపం లోని బూరుగు చెట్టు వద్ద ఎల్ల య్య మృతదేహం కనిపించింది. మృతదేహంపై తీవ్రమైన గాయాలున్నాయి. శరీరాన్ని క్రూరృమృగాలు పీక్కుతి న్న ఆనవాళ్లున్నాయి. దీంతో ఆమె విషయం గ్రా మస్తులకు తెలిపింది. ఎస్సై సుఖేందర్ రెడ్డి, అ టవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ అతీక్, బీట్ ఆఫీసర్ ముజాహిద్ అహ్మద్‌లు ఘటనా స్థలానికి వెళ్లి వి చారణ జరిపారు. చిరుత లేదా ఎలుగు బంటి చంపి ఉంటుందని అనుమానిస్తున్నారు. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
యువకుడిపై చిరుత దాడి
సాక్షి, నిర్మల్ : చిరుత దాడిలో యువకుడు గాయపడిన సంఘటన నిర్మల్ జిల్లా పెంబి మండలం అక్టోనిమాడ గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆత్రం సంతోష్(19) ఉదయం పంటచేనుకు వెళ్తుండగా చిరుతపులి ఒక్కసారిగా దాడిచేసింది. యువకుడు కేకలు వేయడంతో సమీపంలో ఉన్న గ్రామస్థులు అక్కడకు చేరుకోవడంతో చిరుత పారిపోయింది. దాడిలో యువకుడి కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. గాయపడిన సంతోష్‌ను చికిత్స నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. చిరుత సంచారంపై గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. -
అలీనగర్‌పై చిరుత పంజా
► మేక ల మందపై దాడి ► నాలుగు మేకలు మృతి జన్నారం(ఆదిలాబాద్) : భయం గుప్పిట్లో బతుకుతున్న జన్నారం మండలంలోని అలీనగర్‌పై చిరుతపులి పంజా విసిరింది. దీంతో వారి భయానికి మరింత ఆందోళన తోడైంది. చిరుతపులి అడవిలోనుంచి అలీనగర్ గ్రామానికి వచ్చింది. ఇళ్ల పక్కనే ఉన్న మేకల మందపై దాడి చేసింది. నాలుగు మేకలను హతమార్చింది. ఈ సంఘటన ఆ గ్రామ గిరిజనులకు తీవ్ర భ యూందోళనలకు గురిచేసింది. ప్రత్యక్ష సాక్షి, బాధితుడు పెంద్రం కృష్ణ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నారు. తెల్లవారుజామున... పెంద్రం కృష్ణ ఆదివారం రాత్రి తన ఇంటి పక్కన గల దొడ్లోకి మేకలను తోలి, బయ ట పందిరి కింద పడుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయం లో మేకల అరుపులు వినిపించాయి. చప్పుడు విని లేచి చార్జింగ్ టార్చ్లైట్తో చూసేసరికి చిరుతపులి ఓ మేక తలను నోటితో కరిచి రక్తం తాగుతోంది. దీంతో కృష్ణ గట్టిగా కేకలు వేశాడు. కేకలు విని చిరుత మేకను వదిలి పారిపోయింది. అతడు కూడా చిరుతను తరుముతూ కొంత దూరం వెళ్లాడు. వచ్చి తన తల్లి దృపదబారుు తో పాటు అందరినీ నిద్ర లేపాడు. అప్పటికే పెంద్రం బొజ్జుబాయికి చెందిన రెండు మేకలు, కృష్ణకు చెందిన రెండు మేకలను చిరుత చంపివేసింది. తెల్లారే వరకు గూడెం వాసులు మేల్కొనే ఉన్నారు. ఈ విషయం తెల్లవారి ఫారెస్ట్ అధికారులకు తెలియజేశారు. అనంతరం పశు వైద్యాధికారితో పోస్టుమార్టం నిర్వహించారు. బీట్ అధికారి భూమన్న వివరాలను నమోదు చేసుకున్నారు. ఇదివరకే పులి వస్తుందని భయం గుప్పిట్లో బతుకుతున్న గిరిజనులకు చిరుత దాడి మరింత ఆందోళనలకు గురిచేస్తోం ది. తమకు అడవి జంతువులతో ప్రాణభయం ఉందని, ఈ విషయంలో శాశ్వత పరి ష్కారం చూపించాలని గిరిజన పెద్దలు మాణిక్‌రావు, పార్వతిరావు కోరుతున్నారు.