
సాక్షి, తిరుమల: తిరుమలవాసులకు, అక్కడికి వచ్చే భక్తులకు చిరుత పులులు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. కొంతకాలంగా అటవీప్రాంతానికి ఆనుకుని ఉన్న బాలాజీనగర్, కాటేజీ ప్రాంతాల్లో చిరుతల సంచారం పెరిగింది. ఇటీవల బాలాజీ నగర్‌లోని తూర్పు ప్రాంతంలో ఓ ఇంట్లో దూరిన చిరుత అక్కడి కుక్కను ఎత్తుకెళ్లింది.
తాజాగా, ఆదివారం రాత్రి చిరుత తిరిగి అదే ప్రాంతానికి చేరుకుంది. సుమారు గంటకుపైగా అటూఇటూ తిరగాడింది. చెట్లు అలికిడి కావడంతో ఇంటి మిద్దెపై ఉన్న స్థానికుడు చిరుతను గుర్తించాడు. వెంటనే తన కెమెరాలో చిరుతను బంధించాడు.
Comments
Please login to add a commentAdd a comment