అడవిలో మేకల కాపరి మృతి | shepherd was died in forest | Sakshi
Sakshi News home page

అడవిలో మేకల కాపరి మృతి

Published Wed, Feb 14 2018 4:25 PM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

భీమ్‌గల్‌(బాల్కొండ): మండలంలోని పిప్రి గ్రా మ శివారు అటవీ ప్రాంతంలో మంగళవారం గామాని కి చెందిన మేకల కాపరి సంపంగి ఎల్లయ్య(40) మృతి చెందాడు. ఎల్లయ్య ఉదయం మేకలను కా యడానికి గ్రామ శివారులోని అడవికి వెళ్లాడు. సా యంత్రమైనా ఇంటికి రాకపోయే సరికి అతని భా ర్య ఎల్లయ్యను వెతుకు తూ అడవిలోకి వెళ్లింది. దా యి చెరువు సమీపం లోని బూరుగు చెట్టు వద్ద ఎల్ల య్య మృతదేహం కనిపించింది. మృతదేహంపై తీవ్రమైన గాయాలున్నాయి. శరీరాన్ని క్రూరృమృగాలు పీక్కుతి న్న ఆనవాళ్లున్నాయి. దీంతో ఆమె విషయం గ్రా మస్తులకు తెలిపింది. ఎస్సై సుఖేందర్‌ రెడ్డి, అ టవీ శాఖ సెక్షన్‌ ఆఫీసర్‌ అతీక్, బీట్‌ ఆఫీసర్‌ ముజాహిద్‌ అహ్మద్‌లు ఘటనా స్థలానికి వెళ్లి వి చారణ జరిపారు. చిరుత లేదా ఎలుగు బంటి చంపి ఉంటుందని అనుమానిస్తున్నారు. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. 

1
1/1

మృత దేహాన్ని పరశీలిస్తున్న అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement