yellaiah
-
కోమాల్లోకి వెళ్లిన కొడుకు! న్యాయం కోసం ట్యాంక్ ఎక్కిన తల్లి.. చివరకి?
నల్గొండ: తన కుమారుడిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఓ మహిళ గురువారం నడిగూడెం మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో వాటర్ ట్యాంక ఎక్కి నిరసన తెలిపింది. వివరాలు.. నడిగూడెం మండల కేంద్రానికి చెందిన గుంజ యల్లయ్య, మురళి అన్నదమ్ములు. మురళికి, అతడి భార్యకు కొద్దిరోజులుగా తగాదాలు జరుగుతున్నాయి. గత నెల మురళి, అతడి భార్య గొడవ పడుతుంగా.. యల్లయ్య సర్ది చెప్పేందుకు ప్రయత్నించగా కొందరు దుండగులు అతడిపై దాడి చేశారు. దీంతో యల్లయ్య తీవ్ర గాయాలపాలై కోమాలోకి వెళ్లి ఇంటి వద్దనే చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారని, కానీ తమకు ఇప్పటి వరకు న్యాయం చేయడం లేదని యల్లయ్య తల్లి అచ్చమ్మ గురువారం నడిగూడెం బస్టాండ్ సెంటర్లో ఉన్న వాటర్ ట్యాంకు ఎక్కి నిరసనకు దిగింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ ఏడుకొండలు ఘటనా స్థలానికి చేరుకొని న్యాయం చేస్తామని హామీ ఇచ్చి అచ్చమ్మను కిందకు దించారు. ఇవి చదవండి: నడి సంద్రంలో పెను ప్రమాదం! ఒక్కసారిగా.. -
అడవిలో మేకల కాపరి మృతి
భీమ్‌గల్(బాల్కొండ): మండలంలోని పిప్రి గ్రా మ శివారు అటవీ ప్రాంతంలో మంగళవారం గామాని కి చెందిన మేకల కాపరి సంపంగి ఎల్లయ్య(40) మృతి చెందాడు. ఎల్లయ్య ఉదయం మేకలను కా యడానికి గ్రామ శివారులోని అడవికి వెళ్లాడు. సా యంత్రమైనా ఇంటికి రాకపోయే సరికి అతని భా ర్య ఎల్లయ్యను వెతుకు తూ అడవిలోకి వెళ్లింది. దా యి చెరువు సమీపం లోని బూరుగు చెట్టు వద్ద ఎల్ల య్య మృతదేహం కనిపించింది. మృతదేహంపై తీవ్రమైన గాయాలున్నాయి. శరీరాన్ని క్రూరృమృగాలు పీక్కుతి న్న ఆనవాళ్లున్నాయి. దీంతో ఆమె విషయం గ్రా మస్తులకు తెలిపింది. ఎస్సై సుఖేందర్ రెడ్డి, అ టవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ అతీక్, బీట్ ఆఫీసర్ ముజాహిద్ అహ్మద్‌లు ఘటనా స్థలానికి వెళ్లి వి చారణ జరిపారు. చిరుత లేదా ఎలుగు బంటి చంపి ఉంటుందని అనుమానిస్తున్నారు. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
'లక్షల కోట్లతో కార్పొరేట్లకు మోదీ ఊడిగం'
బేతంచెర్ల (కర్నూలు జిల్లా): కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 100 రోజుల్లో నల్లధనాన్ని తీసుకువచ్చి ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు పంపిణీ చేస్తామని నేటికి 400 రోజులు కావస్తున్నా వాటిని అమలు చేయలేదని సీపీఎం నేతలు విమర్శించారు. పేదలకు, రైతులకు ఇస్తున్న సంక్షేమ పథకాలలో కోత కోసి సామన్య ప్రజలపై భారాలు మోపి పెట్టుబడిదారులకు రూ.5 లక్షల కోట్లు కేటాయించి ఊడిగం చేస్తున్నారని సీపీఎం నాయకులు ఆరోపించారు. భూస్వాములకు,పెట్టుబడిదారుల దోపిడికి వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు ఐక్యంగా వర్గ పోరాటాలు నిర్వహించడం ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారమవుతాయని సీపీఎం డోన్ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎల్లయ్య, వ్యవసాయ కార్మిక సంఘం డోన్ డివిజన్ కార్యదర్శి ఈశ్వరయ్యలు తెలిపారు. ఆదివారం స్థానిక వ్యవసాయ కార్మిక సంఘం కార్యాలయంలో ఆ సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షురాలు బెల్లం అంజలి అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 70 సంవత్సరాలు కావస్తున్నా పేదల కనీస అవసరాలు తీర్చటంలో పాలకులు విఫలమయ్యాయని వారు విమర్శించారు. -
కంటెయినర్, డీసీఎం వ్యాన్ ఢీ: ఇద్దరి మృతి
తూప్రాన్ (మెదక్): తూప్రాన్ మండల కేంద్రానికి సమీపంలోని బైపాస్ మార్గం వద్ద ఆగి ఉన్న కంటెయినర్‌ను స్నేహ చికెన్ సెంటర్‌కు చెందిన డీసీఎం వాహనం ఢీకొట్టింది. గురువారం ఉదయం 5 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో సైదులు (30), ఎల్లయ్య (28) అనే ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతిచెందారు. డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. డీసీఎం, కంటెయినర్‌ను ఢీకొట్టడంతో భయపడ్డ కంటెయినర్ డ్రైవర్ తన కంటెయినర్‌తో అక్కడి నుంచి వెళ్లి పోయేందుకు ప్రయత్నించాడు. అలా రెండు కిలోమీటర్లు వెళ్లిన తర్వాత కంటెయినర్‌కు డీసీఎం అతుక్కుపోయిన విషయం తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లిళ్ల ఎల్లయ్య
ఓ అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకుంటారు. కుల మతాలు వేరుకావడంతో ఇరు కుటుంబాల పెద్దలు ఆ పెళ్లికి అడ్డు చెబుతారు. ఇది కామన్! దీంతో విడిచి ఉండలేక.. వేరేవాళ్లను పెళ్లి చేసుకోలేక ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్న జంటలనేకం. ఇలాంటి వారికి పెద్దన్నగా మారాడు రేణుకుంట్ల ఎల్లయ్య. వరకట్న నిషేధం, కుల నిర్మూలన ధ్యేయంగా కొన్ని వేల జంటలకు వివాహాలు చేసిన ఆయన... ఆదివారం మరో వంద జంటలను ఒక్కటి చేసేందుకు సిద్ధమవుతున్నాడు. రేణుకుంట్ల ఎల్లయ్య... హిందుస్తాన్ కేబుల్ లిమిటెడ్‌లో కొంతకాలం పనిచేశాడు 2001లో వీఆర్ఎస్ తీసుకున్నాడు. డాక్టర్ బిఆర్.అంబేద్కర్, కాన్షీరాం ఆశయాలను, సిద్ధాంతాలను న మ్మిన ఎల్లయ్య.. కుల నిర్మూలన, వరకట్న నిషేధం లక్ష్యంగా 24 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. 1991 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా దళిత ఐక్య వేదిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కులాంతర, మతాంతరం వివాహలను ప్రోత్సహిస్తూ వచ్చాడు. కులాంతర వివాహాలు చేసుకుని పెద్దల నుంచి సహాయ సహకారాలు లేక ఇబ్బంది పడుతున్న జంటలకు.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లభించే ఆర్థిక సహాయం అందేలా చేస్తున్నాడు. వారికి ఉపాధి అవకాశాలనూ కల్పించి చేయూతనందిస్తున్నాడు. ఇప్పటివరకు రెండువేలకుపైగా జంటలకు వివాహాలు చేశాడు. అంతేకాదు... తల్లిదండ్రుల్లో ఎవరైనా జైల్లో ఉంటే ప్రభుత్వ అనుమతితో పెరోల్‌పై బయటికి రప్పించి.. వాళ్ల పిల్లలకు వివాహాలు చేయిస్తున్నాడు. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్‌కి, అంధులు, అనాథలకు అన్నీ తానై పెళ్లిళ్లు జరిపిస్తున్నాడు. ఈ నెల 5న.. మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రాం జయంతి సందర్భంగా ఈనెల 5న మరో వంద జంటలకు పెళ్లిళ్లు చే యబోతున్నారు. వివాహం చేసుకున్న జంటలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.50 వేలు అందచేయనున్నారు. దళితులను వివాహం చేసుకున్నవారికి అంబేద్కర్ ఫౌండేషన్ న్యూ ఢిల్లీ నుంచి రూ.2 లక్షల 50 వేలు అందేలా చేస్తున్నారు. ఇలాంటి వివాహాలకు ప్రభుత్వాల నుంచి మరింత ప్రోత్సాహమందాల్సి ఉందంటున్నాడు ఎల్లయ్య. ‘కులాంతర, మతాంతర పెళ్లిళ్లు చేసుకున్నవారు ఇరు కుటుంబాల నుంచి ఇబ్బందులెదుర్కొంటున్నారు. అలాంటివారికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరుతున్నాడు. ..:: కాసుల సాంబశివుడు/మల్లాపూర్