కంటెయినర్, డీసీఎం వ్యాన్ ఢీ: ఇద్దరి మృతి | two died of container and dcm van accident | Sakshi
Sakshi News home page

కంటెయినర్, డీసీఎం వ్యాన్ ఢీ: ఇద్దరి మృతి

Published Thu, Jun 4 2015 8:30 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

two died of container and dcm van accident

తూప్రాన్ (మెదక్): తూప్రాన్ మండల కేంద్రానికి సమీపంలోని బైపాస్ మార్గం వద్ద ఆగి ఉన్న కంటెయినర్‌ను స్నేహ చికెన్ సెంటర్‌కు చెందిన డీసీఎం వాహనం ఢీకొట్టింది. గురువారం ఉదయం 5 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో సైదులు (30), ఎల్లయ్య (28) అనే ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతిచెందారు. డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. డీసీఎం, కంటెయినర్‌ను ఢీకొట్టడంతో భయపడ్డ కంటెయినర్ డ్రైవర్ తన కంటెయినర్‌తో అక్కడి నుంచి వెళ్లి పోయేందుకు ప్రయత్నించాడు. అలా రెండు కిలోమీటర్లు వెళ్లిన తర్వాత కంటెయినర్‌కు డీసీఎం అతుక్కుపోయిన విషయం తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement