తండ్రీకొడుకుల మృతదేహాలు లభ్యం | Available in the bodies of the father | Sakshi
Sakshi News home page

తండ్రీకొడుకుల మృతదేహాలు లభ్యం

Published Sat, Aug 23 2014 1:32 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

తండ్రీకొడుకుల మృతదేహాలు లభ్యం - Sakshi

తండ్రీకొడుకుల మృతదేహాలు లభ్యం

  •   పోస్టుమార్టం అనంతరం స్వగ్రామం తరలింపు
  •   కేసు దర్యాప్తు ప్రారంభం
  •   జుజ్జూరులో విషాదం
  • ఇబ్రహీంపట్నం : స్థానిక ఎన్టీటీపీఎస్ కూలింగ్ కెనాల్లో గురువారం దూకి గల్లంతైన తండ్రీకొడుకుల మృతదేహాలను ఇబ్రహీంపట్నం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామానికి చెందిన మహేశ్వర హనుమాన్‌ప్రసాద్ (35)కు భార్య శ్రీలక్ష్మితో విభేదా లు ఏర్పడ్డాయి.

    ఈ నేపథ్యంలో కుమారులు శివభార్గవ్(9), గోపీచంద్(7)తో కలిసి గురువారం ఇబ్రహీంపట్నం వచ్చి కూలింగ్ కెనాల్లో దూకి గల్లంతయ్యారు. వీరితో పాటు దూకిన హనుమాన్‌ప్రసాద్ అమ్మమ్మ పులిపాటి పుష్పావతి (70)ని స్థానికులు కాపాడి 108లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె కోలుకుం టోంది. శివభార్గవ్, గోపిచంద్‌ల మృతదేహాలు గురువారం అర్ధరాత్రి ఎన్టీటీపీఎస్‌లోకి కొట్టుకు రాగా పోలీసులు గుర్తించారు.

    శుక్రవారం ఉద యం హనుమాన్ ప్రసాద్ మృతదేహం కూడా అక్కడ కనిపించింది. ఎన్టీటీపీఎస్ అధికారుల ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై లక్ష్మీనారాయణ సిబ్బందితో వచ్చి ముగ్గురి మృతదేహాలను పరిశీలించారు. అనంతరం వాటిని స్వాధీనం చేసుకుని, విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలిం చారు.   పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు.
     
    మృతులకు స్వగ్రామంలో అంత్యక్రియలు

    జుజ్జూరు(వీరులపాడు) : కుటుంబ కలహాల నేపథ్యంలో గురువారం ఎన్‌టీటీపీఎస్ కూలింగ్ కెనాల్‌లో దూకి ఆత్మహత్య చేసుకు న్న మహేశ్వర వెంకట్ హనుమాన్ ప్రసాద్, కుమారులు శివభార్గవ్, గోపిచంద్ మృతదేహాను శుక్రవారం స్వగ్రామం జుజ్జూరు తీసుకువచ్చారు.  మృతదేహాలను ఇంటి కి తీసుకురాగానే బంధువులు తీవ్రంగా రో దిం చారు.

    హనుమాన్ ప్రసాద్‌తోపాటు ఇద్దరు పిల్లలను కడసారి చూసేందుకు గ్రామస్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.  హనుమాన్ ప్రసాద్ తండ్రి వెంకటరత్నం ముగ్గురి మృతదేహాలకు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రీకొడుకుల ఆత్మహత్య ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఘటన జరిగిందని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement