రుష్యశృంగుని కొండపై క్లూస్‌టీం
Published Tue, Jan 24 2017 12:28 AM | Last Updated on Mon, Jul 30 2018 9:15 PM
శింగనమల: మండల కేంద్రానికి సమీపంలోని రుష్యశృంగుని కొండపై ఈ నెల 19వ తేదీ గురువారం రాత్రి చోటుచేసుకున్న దుర్ఘటనకు సంబంధించి సోమవారం క్లూస్‌టీం రుష్యశృంగుని ఆలయాన్ని, పరిసర ప్రాంతాలను పరిశీలించింది. ఇద్దరు హత్యకు గురైన ఈ కేసు మిస్టరీగా మారడంతో పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి అన్ని కోణాలలో విచారణ చేస్తున్నారు. ఆ రాత్రి హత్యకు గురైన పెద్దన్న, ఈశ్వరయ్యలతో పాటు సావిత్రి అనే మహిళ, మరికొందరు ఉన్నట్లు నిర్ధారించుకున్న పోలీసులు ఆ దిశగా బత్తలపల్లి, ధర్మవరం ప్రాంతాల్లోనూ విచారిస్తున్నట్లు తెలిసింది.
Advertisement
Advertisement