మల్లాపురంలో దొంగల హల్‌చల్ | thieves hulchul in yadadri mandal | Sakshi
Sakshi News home page

మల్లాపురంలో దొంగల హల్‌చల్

Published Fri, Jul 29 2016 10:07 AM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM

thieves hulchul in yadadri mandal

నల్లగొండ: నల్గొండ జిల్లా యాదాద్రి మండలం మల్లాపురం గ్రామంలో గురువారం అర్థరాత్రి దొంగలు హల్చల్ చేశారు. స్థానికంగా నివాసముంటున్న వెంకట్‌రెడ్డి ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లాడు. శుక్రవారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే ఇంటి తలుపులు పగలగొట్టి ఉండటంతో.. పోలీసులకు సమాచారం అందించాడు.

పోలీసులు రంగంలోకి దిగి... వెంకట్‌రెడ్డి ఇల్లు, పక్కనే ఉన్న యాదగిరిరెడ్డి ఇంటితో పాటు సమీపంలోని ఓ దుకాణంలో కూడా దొంగలు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాంతో క్లూస్ టీం సాయంతో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement