ఇన్‌కం ట్యాక్స్ అధికారులవుంటూ దోపిడీ
నాగలాపురం: ఇన్‌కం ట్యాక్స్ అధికారులమని పేర్కొని వడ్డీ వ్యాపారి ఇంట్లో దోపిడీ చేసిన సంఘటన గురువారం తెల్లవారుజామున నాగలాపురంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. స్థానిక బజారు వీధిలో జయరాం అనే వ్యక్తి వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. గురువారం తెల్లవారుజామున ఒక టాటా సుమో అతని ఇంటి వద్దకు వచ్చింది. సఫారీ, టై ధరించిన ఇద్దరు, పోలీసు యుూని ఫాం ధరించి చేతిలో బేడీలు పట్టుకున్న వ్యక్తి కిందకు దిగారు. మరో ఇద్దరు కూ డా వారితో వచ్చారు.
తాము హైదరాబాద్ నుంచి వచ్చిన ఇన్‌కం ట్యాక్స్ అధికారులవుని చెబుతూ దొరస్వామి అన్న పేరుతో ఉన్న ఐడీ కార్డును చూపారు. వడ్డీ వ్యాపారి నిర్వహిస్తున్న కావేరి పాన్ బ్రోకర్స్ పేరుతో సర్చ్ వారంట్ తెచ్చావుని కొన్ని కాగితాలను చూపారు. దీంతో జయరాం తలుపులు తెరిచాడు.
తలుపులకు గడియపెట్టి..
దుండగులు వడ్డీ వ్యాపారి జయరాం భార్య చంపా, కువూరుడు వినోద్‌ను బయుటకు రానీయుకుండా తలుపులకు గడియుపెట్టారు. ఫోన్లు లాక్కున్నారు. బీరువాలోని నాలుగు ఉంగరాలు, రెండు నెక్లెస్‌లు, జత కవ్ములు, ఒక నెత్తి చిట్టి, ఫ్రిడ్జ్‌పైనున్న పర్స్‌లోని రూ.5 వేలు తీసుకున్నారు. తవు సోదాలో ఏవీ దొరకలేదని పేర్కొంటూ కొన్ని కాగితాలపై జయురాం నుంచి సంతకాలు తీసుకున్నారు. అవసర మైతే హైదరాబాదుకు రావలసి ఉంటుందని తెలిపి వారు వచ్చిన వాహనంలో ఉడారుుంచారు. దీనిపై బాధితుడు జయరాం సత్యవేడు సీఐ నరసింహులుకు ఫిర్యాదు చేశాడు. సువూరు రూ.5 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను దోచుకు వెళ్లారని వారు వాపోయూరు.
క్లూస్ టీం పరిశీలన
సంఘటనా స్థలాన్ని చిత్తూరు నుంచి వచ్చిన క్లూస్‌టీం పరిశీలించింది. వేలివుుద్రలను సేకరించింది. వడ్డీ వ్యాపారి జయురాం కుటుంబ సభ్యులను విచారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న సీఐ నరసింహులు తెలిపారు. సుమో వాహనం ఏపీ రిజిష్ట్రేషన్ కలిగి ఉందని, అద్దం వెనుకవైపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియూ స్టిక్కర్ అతికించినట్టు స్థానికులు తెలిపారు. ఈ విచారణలో ఇంచార్జ్ ఎస్‌ఐ వెంకటేశులు, ఏఎస్‌ఐ వుల్లికార్జునయ్యు పాల్గొన్నారు.