బంధువుపై తండ్రికొడుకుల లైంగిక దాడి | Father-son duo, associate held for raping relative | Sakshi
Sakshi News home page

బంధువుపై తండ్రికొడుకుల లైంగిక దాడి

Published Thu, Jan 9 2014 9:24 AM | Last Updated on Wed, Aug 1 2018 4:24 PM

బంధువుపై తండ్రికొడుకుల లైంగిక దాడి - Sakshi

బంధువుపై తండ్రికొడుకుల లైంగిక దాడి

నిర్భయ సంఘటనతో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చట్టాలు చేస్తుంది. అయిన ఆ చట్టాలు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అపలేకపోతున్నాయి. పైగా మహిళలపై లైంగిక దాడులు రోజురోజూకు పెచ్చురిల్లుతునే ఉన్నాయి. అందుకు దేశరాజధాని హస్తినలో చోటు చేసుకున్న సంఘటన ప్రత్యక్ష ఉదాహరణ.

 

దగ్గర బంధువు అయిన మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో అదను చూసి తండ్రికొడుకులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన దక్షిణ ఢిల్లీలోని మోహరౌలి ప్రాంతంలో చోటు చేసుకుంది. సామూహిక అత్యాచార ఘటనపై పోలీసులకు, బంధువులుకు వెల్లడిస్తే చంపేస్తామంటూ నిందితులు బెదిరించారు.

 

దాంతో బాధితురాలు మోహరౌలి పోలీసులకు ఆదివారం అర్థరాత్రి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి తండ్రి, ఇద్దరు కొడుకులను సోమవారం అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మోహరౌలి పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement