
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో యువతి సామూహిక అత్యాచారానికి గురైన ఘటన ఆలస్యంగా బయటపడింది. మూడేళ్ల క్రితం మండ్యకు చెందిన యువతిని ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ఆమె ప్రియుడు నగరానికి తీసుకువచ్చాడు. ఆమెను ఒక గదిలో ఉంచి ప్రియుడు, ఆపై మరికొందరు ఒకేసారి ఆమెపై ఘోరానికి పాల్పడ్డారు. శివానందసర్కిల్ వద్ద గల ఒక లాడ్జి యజమాని సంతోష్ కూడా ఇందులో ఉన్నాడు.
తరువాత యువతిని వ్యభిచార ముఠాకు విక్రయించారు. ఇటీవల పోలీసులు ఒక లాడ్జిలో జరుగుతున్న పడుపు దందాపై దాడి చేయగా పట్టుబడిన ఈ యువతి దీనగాథను వివరించింది. ఈ ఘటనపై హైగ్రౌండ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, మంజుల, బ్రహ్మేంద్ర, సంతోష్ కుమార్‌లను శనివారం అరెస్టు చేశారు. అలాగే మోసపోయిన యువతి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన అనంతరం గ్యాంగ్ రేపుపై మరో కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment