![Hyderabad: Molestation On Minor Girl At Chandrayangutta - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/21/minor.jpg.webp?itok=6NzBJXTZ)
సాక్షి, హైదరాబాద్: మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. స్టేషన్ పరిధిలో నివాసం ఉండే 14 ఏళ్ల మైనర్ బాలిక ఈ నెల 17న రాత్రి తల్లితో గొడవపడి బయటికి వెళ్లింది. బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ముగ్గురు నలుగురు యువకులు మీ తల్లి దగ్గరకు తీసుకెళుతామంటూ నమ్మించారు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు.
తప్పించుకున్న బాలిక శనివారం సాయంత్రం ఇంటికి చేరుకుంది. ఎక్కడికి వెళ్లావని బాలికను నిలదీయడంతో అసలు విషయాన్ని తెలిపింది. బాధితురాలి తల్లి చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నేడు (మంగళవారం) రిమాండ్‌కు తరలించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
చదవండి: చుక్కలు చూపించింది! పెళ్లి చేసుకున్న నెలకే గెంటేసి....
Comments
Please login to add a commentAdd a comment