
యావత్తు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసి ఢిల్లీ శ్రద్ధా హత్య కేసులో ఇప్పటి వరకు పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఐతే పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆమె శరీర భాగాలకు ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్)లో పోస్ట్‌మార్టం నిర్వహించడం జరిగింది. ఈ మేరకు పోస్ట్‌మార్టం నివేదికలో పలు కీలక విషయాలు వెలుగులో వచ్చాయి.
నిందితుడు అఫ్తాబ్ పూనావాలా శ్రద్ధా వాకర్ మృతదేహాన్ని రంపంతో ముక్కలు చేసినట్లు నివేదిక వెల్లడించింది. గత నెలలో నిర్వహించిన డీఎన్‌ఏ పరీక్షల్లో ఆ శరీర భాగాలు శ్రద్ధావేనని నిర్ధారించగా.. తదనంతరం వాటిని శవపరీక్షలకు పంపించారు. అలాగే ఆ ఫ్లాట్‌లో కనిపించిన రక్తపు మరకలు ఆమె రక్తంతో సరిపోలినట్లు నివేదికలో పేర్కొంది.
ఈ మేరకు శ్రద్ధా తండ్రి నుంచి సేకరించిన డీఎన్‌ఏ నమునాను ఉపయోగించి ఈ పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. కాగా, నిందితుడు అఫ్తాబ్ పూనావాలా గతేడాది నవంబర్ నుంచి కస్టడీలోనే ఉన్నాడు. ఈ నెలాఖారులోపు ఢిల్లీ పోలీసులు ఈ కేసులో చార్జీషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది.
(చదవండి: శ్రద్ధా హత్య కేసు: అఫ్తాబ్‌ని తరలిస్తున్న వ్యాన్‌పై దాడి... రక్షణగా ఉన్న పోలీసులకు రివార్డు)
Comments
Please login to add a commentAdd a comment