
యావత్తు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన శ్రద్ధా హత్య కేసులో ఆరు వేల పేజీల భారీ ముసాయిదా చార్జిషీట్‌ను తయారు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ చార్జిషీట్‌లో నిందితుడు అఫ్తాబ్ పూనావాలా శ్రద్ధా తన బాయ్‌ఫ్రెండ్‌ని కలిసినందుకే హతమార్చడని పోలీసులు చార్జిషీట్‌లో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు సుమారు 6,629 పేజీల చార్జీషీట్‌లో శ్రద్ధా తన స్నేహితుడిని కలుసుకోవడానికి వెళ్లిందన్న కోపంలోనే అఫ్తాబ్ ఈ దారుమైన ఘటనకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.
అప్తాబ్‌కి శ్రద్ధా తన స్నేహితుడిని కలవడం నచ్చలేదని, పైగా ఆ విషయమై తీవ్ర ఆందోళన చెందినట్లు నివేదికలో తెలిపారు. దీంతోనే ఆమెను అంత క్రూరంగా చంపేశాడని చార్టిషీట్‌లో పేర్కొనట్లు జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ మీను చౌదరి వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఢిల్లీలోని మెహ్రౌలీలో ఉండే అఫ్తాబ్ తన భాగస్వామి శ్రద్ధావాకర్‌ని హత్య చేసి, 36 ముక్కలుగా నరికి వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు. ఆ తదనంతరం శ్రద్ధా కనపడకపోవడం, ఆ విషయాన్ని స్నేహితులు శ్రద్ధా తండ్రికి చెప్పడంతో.. ఆయన ఫిర్యాదు మేరకు అఫ్తాబ్‌ని అరెస్టు చేసి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
(చదవండి: శ్రద్ధా వాకర్ హత్య కేసు.. 3,000 పేజీల చార్జిషీట్)
Comments
Please login to add a commentAdd a comment