
చావు నుంచి తృటిలో తప్పించుకున్నామని చెబుతున్నారు హీరోయిన్ రష్మికా మందన్నా. అసలు విషయం ఏంటంటే... ఇటీవల ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చేందుకు రష్మికా మందన్నా ఓ విమానంలో ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఈ విమానంలోనే మరో హీరోయిన్ శ్రద్ధాదాస్ కూడా ఉన్నారు. అయితే విమానం టేకాఫ్ అయిన అరగంటలోపే ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో తిరిగి ముంబైలోనే అత్యవసర ల్యాండింగ్ చేశారు.
ఈ ఆందోళనకరమైన ఘటనను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు రష్మికా మందన్నా. ‘చావు నుంచి మేం తృటిలో తప్పించుకున్నాం’ అనే క్యాప్షన్‌తో శ్రద్ధాదాస్‌తో ఉన్న ఫోటోను షేర్ చేశారు రష్మికా మందన్నా. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతోంది. కాగా ఇదే ఘటనపై హీరోయిన్ శ్రద్ధాదాస్ కూడా స్పందించారు. ‘‘విమానంలో వందమందికిపైగా ప్రయాణికులున్నారు. మేం దాదాపు చనిపోతామనే భావన కలిగింది. కానీ, పైలెట్ సరైన నిర్ణయం తీసుకుని అత్యవసర ల్యాండింగ్ చేశారు’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు శ్రద్ధాదాస్.
Comments
Please login to add a commentAdd a comment