సస్పెన్స్‌ థ్రిల్లర్‌ | Chinna Tho premaga Movie Shooting updates | Sakshi
Sakshi News home page

సస్పెన్స్‌ థ్రిల్లర్‌

Published Sat, Sep 14 2019 3:24 AM | Last Updated on Sat, Sep 14 2019 3:24 AM

Chinna Tho premaga Movie Shooting updates - Sakshi

శివ శంకర్‌ మాస్టర్‌

ఎస్‌ఎన్‌ చిన్న, హేమంత్, శ్రద్ధ, చైత్ర, నందిని ముఖ్య తారలుగా నటిస్తున్న చిత్రం ‘చిన్నాతో ప్రేమగా’.  పీవీఆర్‌ దర్శకత్వంలో ఎస్‌.యన్‌. ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై బి. చండ్రాయుడు నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సందర్భంగా బి. చండ్రాయుడు మాట్లాడుతూ– ‘‘మంచి కథతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. సీనియర్‌ కొరియోగ్రాఫర్‌ శివ శంకర్‌ మాస్టర్‌ ఒక ముఖ్యమైన పాత్ర చేయడంతో పాటు మూడు పాటలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఫస్ట్‌ షెడ్యూల్‌ ఈ వారంలో పూర్తవుతుంది. మరో మూడు షెడ్యూల్స్‌లో సినిమా పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘లవ్‌ అండ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. చిట్టిబాబు కామెడీ, ప్రియాంక క్లాసికల్‌ డ్యాన్స్‌ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ’’అన్నారు పీవీఆర్‌. ఈ చిత్రానికి కెమెరా: రెబాల సుధాకర్‌ రెడ్డి, సంగీతం: రాజ్‌ కిరణ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement