శ్రద్ధా వాకర్.. ఎక్కడ చూసినా, చదివినా ప్రియుడి చేతిలో అన్యాయంగా బలైన ఈ యువతి వార్తలే కనిపిస్తున్నాయి. ఘటన వెలుగులోకి వచ్చి నేటికి వారం అవతున్నా(నవంబర్11న నిందితుడు అఫ్తాబ్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు) నిత్యం సంచలన విషయాలు తెరమీదకు వస్తున్నాయి. యావత్ దేశాన్ని ఉలిక్కి పడేలా చేసిన ఈ ఘోర ఈ దారుణ ఘటనలో నిందితుడి ఆఫ్తాబ్‌ను పోలీసులు ఇంకా విచారిస్తున్నారు. పోలీస్ కస్టడీలో అఫ్తాబ్ గంటకో కొత్త విషయాలను చెప్పి షాక్‌లా మీద షాక్‌లు ఇస్తున్నాడు.
తాజాగా శ్రద్ధా వాకర్‌కు సంబంధించిన ఓ పాత ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2020లో తీసిన ఫోటో ఇది. దీనిని చూస్తుంటే అఫ్తాబ్ అమిన్ పునావాలాతో ఆమె రిలేషన్ ఎంత భయంకరంగా ఉందనే దానికి అద్దం పడుతోంది. ఈ ఫోటోలో శ్రద్ధా కళ్లు, ముక్కు, చెంప చుట్టూ గాయాల గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో అఫ్తాబ్ శ్రద్ధతో నిత్యం గొడవపడేవాడేవాడని తెలుస్తోంది. అయితే తనకు ఎన్ని దెబ్బలు తగిలినా ఈ చిత్రంలో ఆమె నవ్వుతూ ఉండటం విశేషం.
చదవండి: షాకింగ్ ఘటన: ప్రియురాలిని చంపి.. ముక్కలుగా కోసి.. తలను పాలిథిన్ సంచిలో!
అంతేగాక ఆమె 2020లో క్రితం 4 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్లు ఓ ఆసుపత్రి అందించిన నివేదిక ద్వారా తెలిసింది. ‘2020 డిసెంబర్ 3న ప్రియుడు అఫ్తాబ్‌తో కలిసి ముంబై పరిధిలోని ఓజోన్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో చేరింది. భుజం నొప్పితో వచ్చింది. కానీ తన గాయాలకు కారణాలు వెల్లడించలేదు.’ అని ఆమెకు వైద్యం అందించిన డాక్టర్ శివ ప్రసాద్ షిండే తెలిపారు.
మరోవైపు శ్రద్ధా స్నేహితులు కూడా అఫ్తాబ్ ఆమెను ఎంత క్రూరంగా హింసించేవాడో ఒక్కొక్కరుగా బయటకొచ్చి చెబుతున్నారు. శ్రద్ధా వాకర్‌ను తన బాయ్‌ఫ్రెండ్ మానసికంగా హింసించడంతో పాటు శారీరకంగా వేధించేవాడని ఆమె స్నేహితురాలు తెలిపింది. అతనితో సంబంధాన్ని ముగించుకోవాలని ఆమె కోరుకున్నట్లు వెల్లడించింది. కానీ అఫ్తాబ్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడంతో శ్రద్ధకు ఎలాంటి అవకాశం లేకుండా పోయిందని వాపోయింది. ఆమె అతన్ని విడిచిపెడితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడని గుర్తు చేసుకుంది.
చదవండి: శ్రద్ధ హత్య కేసు విచారణలో షాకింగ్ నిజాలు.. గంజాయి మత్తులో క్రూరంగా
శ్రద్ధ తన జీవితంపై భయపడేదని, వారిద్దరి మధ్య చాలా గొడవలు జరిగాయని మరో స్నేహితుడు రజత్ తెలిపారు. రాత్రి సమయంలో తనకు వాట్సాప్ మెసెజ్ చేసి ఎక్కడికైనా తీసుకెళ్లమని కోరేంత వరకు గొడవలు జరిగేవని చెప్పారు. ఒకవేళ ఆఫ్తాబ్‌తోనే కలిసి ఉంటే తనను చంపేస్తాడని భయపడేదని వెల్లడించాడు. 2021లోనూ అఫ్తాబ్ శ్రద్ధాపై దాడి చేశాడని, తాము రక్షించినట్లు తెలిపారు. ఆమె మెడ, ఛాతీపై భాగంలో గాయాలు చూసినట్లు, ముక్కు కూడా దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అప్పట్లోనే హెచ్చరించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment