Chopped body
-
ఎంత చెప్పినా ఆమె వినలేదు.. ఆ సమయంలో ఆఫ్తాబ్‌ని కలిశా: శ్రద్ధా తండ్రి
న్యూఢిల్లీ: యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఢిల్లీ శ్రద్ధా వాకర్ హత్యోదంతం ఎన్నో మలుపులు తిరుగుతూ పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రద్ధా వాకర్ హత్య తర్వాత తొలిసారి ఆమె తండ్రి వికాస్ వాకర్ శుక్రవారం మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా పలు విషయాలపై ఆయన నోరు విప్పారు. తన కూతుర్ని ఎలాగైతే చంపాడో అలాగే అఫ్తాబ్‌కీ పనిష్మెంట్ ఇవ్వాలని వికాస్ వాకర్ డిమాండ్ చేశారు. సరైన పద్ధతిలో విచారణ చేసి అఫ్తాబ్‌ని ఉరితీయాలని డిమాండ్ చేశారు. అఫ్తాబ్ కుటుంబ సభ్యులు, ఈ హత్యతో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తులపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. మహారాష్ట్ర పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే శ్రద్ధా వాకర్ బతికి ఉండేదని అభిప్రాయపడ్డారు ఆమె తండ్రి వికాస్ వాకర్. పోలీసుల దర్యాప్తు విషయంలో తాను సంతృప్తిగానే ఉన్నానని చెప్పారు. కూతురు మరణం తనను కుంగిపోయేలా చేసిందని, దీంతో అనారోగ్యానికి గురయ్యానని వెల్లడించారు. అందువల్లే మీడియాతో మాట్లాడలేకపోయానని తెలిపారు. సమాజంలో ఇబ్బందులు సృష్టిస్తున్న పలు మొబైల్ అప్లికేషన్లపై కూడా చర్యలు తీసుకోవాలని శ్రద్ధా తండ్రి డిమాండ్ చేశారు. డేటింగ్ యాప్స్‌పై నిషేధం విధించాలన్నారు. 18 ఏళ్లు నిండిన పిల్లలపై తప్పనిసరిగా కౌన్సిలింగ్ నియంత్రణ ఉండాలన్నారు. రెండేళ్లుగా శ్రద్ధాను సంప్రదించేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించానని, కానీ తాను పెద్దగా స్పందించలేదని తెలిపారు. శ్రద్ధా శరీర భాగాలు ఆ హంతకుడి ఇంట్లో ఉన్న సమయంలో అఫ్తాబ్‌ని కలిశానని ఆవేదన వ్యక్తం చేశారు. అఫ్తాబ్‌తో వెళ్లిన తర్వాత కూతుర్ని ఇంటికి రాకుండా అన్ని దారులు మూసేశారా? అని మీడియా ప్రశ్నించగా.. కూతురు హత్య అనంతరం తమపై అందరూ అనేక నిందలు వేశారని శ్రద్ధా తండ్రి వాపోయారు. కొందరు గొడవ పడి మరీ ఇంట్లోంచి వెళ్లింది మళ్లీ ఎలా రానిస్తారంటూ ప్రశ్నలు వేశారని తెలిపారు. అయితే తన కూతురు ఇంట్లోంచి వెళ్లే ముందు ఎన్నో రకాలుగా ప్రశ్నించినా ఆమె దేనికి సమాధానమివ్వకుండా వెళ్లిపోయిందని కన్నీటిపర్యంతమయ్యారు. తమకు ఈ కేసులో న్యాయం చేస్తామని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ పోలీసు అధికారులు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హామీ ఇచ్చారని శ్రద్ధా తండ్రి వికాస్ వాకర్ చెప్పారు. కాగా, అఫ్తాబ్ అమీన్ పూనావాలా జ్యుడీషియల్ కస్టడీని 14 రోజులు పొడిగించినట్లు పోలీసుల వర్గాలు తెలిపాయి. చదవండి: 15 ఏళ్ల నుంచి పరారీలో నిందితుడు.. హోటల్లో మేనేజర్‌గా అవతారం ఎత్తి.. -
మరో వ్యక్తితో శ్రద్ధా డేటింగ్.. అందుకే చంపి ముక్కలుగా చేశా: అఫ్తాబ్
న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య ఘటన వెలుగులోకి వచ్చిన నెల రోజులు సమీపిస్తున్నా నిత్యం సంచలన విషయాలు తెరమీదకు వస్తున్నాయి. యావత్ దేశాన్ని ఉలిక్కి పడేలా చేసిన ఈ ఘోర ఈ దారుణ ఘటనలో నిందితుడి ఆఫ్తాబ్ను పోలీసులు ఇంకా విచారిస్తున్నారు. పోలీస్ కస్టడీలో ఉన్న అఫ్తాబ్ రోజుకో కొత్త విషయాలను చెప్పి షాక్‌లా మీద షాక్‌లు ఇస్తున్నాడు. తాజాగా మరో షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తిని శ్రద్ధా కలిసినందుకే తనను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు. బంబుల్ డేటింగ్ యాప్ ద్వారా శ్రద్ధాకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడిందని, మే 17న అతన్ని గురుగ్రామ్‌లో కలవడానికి వెళ్లిందని తెలిపాడు. ఆరోజంతా అతనితోనే గడిపి మరుసటి రోజు(మే 18న) మధ్యాహ్నం మెహహ్రోలీలో ఉంటున్న తన ఫ్లాట్‌కు తిరిగి వచ్చిందని పేర్కొన్నాడు. ఈ విషయంపై ఆరోజు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని.. గొడవ పెద్దదవడంతోనే ఆమెను చంపినట్లు పేర్కొన్నాడు. అఫ్తాబ్ చెబుతుంది నిజమా? కాదా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాల కోసం బంబుల్ యాప్‌కు పోలీసులు లేఖ రాశారు. అలాగే శ్రద్దా వాకర్ ఫోన్ కాల్స్, లొకేషన్ టవర్ డేటాను పరిశీలిస్తున్నారు. చదవండి: ‘ఇండియాలోని అత్తమామలు ఐఫోన్లు గిఫ్ట్ ఇవ్వాలని ఇబ్బంది పెడుతున్నారు’ అంతకుముందే విచారణలో శ్రద్ధాతో బ్రేకప్ చేసుకున్నట్లు, ఆమెతో సహజీవనం చేయడంలేదని అఫ్తాబ్ పోలీసులకు తెలిపాడు. అప్పటి నుంచి వారు కేవలం ఫ్లాట్మెట్స్లా కలిసి ఉంటున్నట్లు చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం ఆఫ్తాబ్ తీహార్ జైలులో ఉన్నాడు. మరో రెండు రోజుల్లో అతని జ్యూడిషియల్ కస్టడీ ముగియనుంది. ఇప్పటి వరకు అఫ్తాబ్ కుటుంబ సభ్యులెవరూ అతన్ని కలవడానికి జైలుకు రాలేదని అధికారులు తెలిపారు. ఇన్ని రోజులు సెల్లో ఒంటరిగానే ఉండేవాడని, లేదంటే పుస్తకాలు చదవడం, కొన్నిసార్లు తోటి ఖైదీలతో చెస్ ఆట ఆడేవారని పేర్కొన్నారు. మరోవైపు డీఎన్ఐ అనాలసిస్, పాలిగ్రాఫ్, నార్కో టెస్ట్ రిపోర్ట్స్ కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. త్వరలోనే అవన్నీ ఢిల్లీ పోలీసులకు అందిచనున్నట్లు ఫోరెన్సిక్ అధికారి ఒకరు తెలిపారు. చదవండి: పిల్లలే దూరమైతే నా బతుకెందుకు..! -
శ్రద్ధా వాకర్ కంటే భయానకమైన కేసు ఇది!
దేశ రాజధానిలో మరో ఘోర హత్యోదంతం కలకలం సృష్టించింది. తూర్పు ఢిల్లీలో ఓ మహిళ తన కొడుకుతో కలిసి భర్తను ఘోరంగా కడతేర్చిన ఉదంతం ఐదు నెలల తర్వాత వెలుగు చూసింది. అదృశ్యమై నెలలు గడుస్తున్నా ఆ వ్యక్తి ఆచూకీ గురించి కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడం, అప్పటికే దొరికిన ఓ శరీరపు విడిభాగాల కేసు మిస్టరీ వీడకపోవడం.. ఈ క్రమంలో జరిగిన దర్యాప్తు ద్వారా కేసు చిక్కుముడి వీడింది. శ్రద్ధా వాకర్ తరహా హత్యోదంతంగా రికార్డు అయిన ఈ కేసు వివరాలను పోలీసులు సోమవారం వెల్లడించారు. పాండవ్ నగర్ త్రిలోక్‌పురి ఏరియాకు చెందిన అంజన్ దాస్‌ను అతని కుటుంబ సభ్యులే ఘోరంగా హతమార్చారు. గొంతు కోసి చంపి.. ఆపై శరీరాన్ని ముక్కలు చేసి ఫ్రిడ్జ్‌లో దాచేసి.. ఆ విడి భాగాలను రాత్రి సమయంలో స్థానికంగా అక్కడక్కడ పడేశారు. దాస్ తీరుతో విసిగిపోయిన అతని భార్య, ఆమె కొడుకు ఈ ఘాతుకానికి పాల్పడడం గమనార్హం. ఢిల్లీ మెహ్రౌలీ శ్రద్ధా వాకర్ హత్యోదంతం కంటే భయానకంగా ఉంది పాండవ్ నగర్ హత్య కేసు. కూతుళ్లపై కన్ను! అంజన్ దాస్ మొదటి భార్య అతన్ని వదిలేసి వెళ్లిపోయింది. దీంతో అప్పటికే విడాకులైన పూనమ్‌ను రెండో భార్యగా చేసుకున్నాడు. మొదటి భర్త ద్వారా కలిగిన కొడుకు కూతుళ్లతో దాస్ ఇంట్లోనే ఉంటూ వచ్చింది పూనమ్. ఈ క్రమంలో.. దాస్ ఏ పని చేయకుండా డబ్బు కోసం పూనమ్ కొడుకు దీపక్‌ను వేధిస్తూ వచ్చాడు. అదే సమయంలో దీపక్‌కు వివాహం జరిగింది. దీపక్ భార్యతో పాటు పూనమ్ కూతుళ్లపైనా అంజన్ దాస్ కన్నేశాడు. వాళ్లను లైంగికంగా వేధిస్తూ వచ్చాడు. ఈ విషయాన్ని పూనమ్ దృష్టికి తీసుకెళ్లారు వాళ్లు. సరిగ్గా అదే సమయంలో.. పూనమ్ నగలను అమ్మేసిన దాస్.. ఆ డబ్బును మొదటి భార్యకు పంపించాడు. అప్పటికే దాస్ తీరుతో విసిగిపోయిన పూనమ్.. తన కొడుకు దీపక్ దగ్గర గోడు వెల్లబోసుకుంది. దాస్‌ను హతమార్చాలని నిర్ణయించుకుంది. అప్పటికే దాస్ తీరు దారుణంగా తయారు కావడం, తన తల్లిని సరిగా చూసుకోకుండా వేధిస్తున్నాడనే కారణంతో ఈ దారుణంలో దీపక్ అందుకు సరేనన్నాడు. రాత్రంతా రక్తం పోయాక.. మే 30వ తేదీన మద్యం అలవాటు ఉన్న అంజన్ దాస్‌కు.. ఆ తల్లీకొడుకులు మత్తుమందు గోళీలు కలిపి ఇచ్చారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న దాస్‌ను బాకుతో హతమార్చాడు దీపక్. ఆ రాత్రంతా దాస్ మృతదేహం నుంచి రక్తం మొత్తం బయటకు పోయేలా చూసుకున్నారు. డ్రైనేజీ గుండా దానిని బయటకు పంపించేశారు. ఇక ఉదయం కల్లా.. రక్తం మొత్తం శరీరం నుంచి బయటకు వచ్చేయడంతో బాడీని పది ముక్కలు చేశారు. వాటిని పాలిథీన్ సంచుల్లో ప్యాక్ చేసి.. ఫ్రిడ్జ్‌లో భద్రపరిచారు. ఆపై కొన్నాళ్లకు ఆ ముక్కలను అక్కడక్కడ పడేశారు. జూన్ 5వ తేదీన రామ్‌లీలా మైదాన్ వద్ద కొన్ని శరీర భాగాలు పోలీసులకు దొరికాయి. ఆ తర్వాతి మూడు రోజులు రెండు కాల్లు, తొడ భాగాలు, ఒక పుర్రె, ఓ మోచేయి.. ఇలా విడివిడిగా దొరకడంతో ఢిల్లీ క్రైమ్ విభాగం అనానిమస్ బాడీగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలో పాండవ్నగర్లో ఇంటి ఇంటికి దర్యాప్తు చేపట్టింది. అంజన్ దాస్ ఇంటి నుంచి వెళ్లిపోయి ఐదారు నెలలు గడుస్తున్నా కుటుంబ ఫిర్యాదు చేయలేదన్న విషయం.. పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో.. సీసీటీవీ ఫుటేజీలపై దృష్టిసారించారు పోలీసులు. చివరికి.. బ్యాగులతో దీపక్, అతని వెంట పూనమ్ వెంట ఉన్న దృశ్యాలు బయటపడ్డాయి. అలా ఈ కేసు వీడింది. అంజన్ దాస్ తీరును భరించలేకే ఇలా ఘోర హత్యకు పాల్పడినట్లు ఆ తల్లీకొడుకులు ఒప్పుకున్నారు. శవాన్ని ముక్కలు చేసి.. విడిభాగాలను దూరంగా పడేశాక ఎలాంటి దుర్వాసన రాకుండా ఇంటిని, ఫ్రిజ్‌ను శుభ్రం చేశామని తెలిపారు. ఎవరికీ చెప్పకుండా దాస్ ఇంటి నుంచి వెళ్లిపోయాడని వారు ఇరుగుపొరుగు వారికి చెప్పి నమ్మించే యత్నమూ చేశారు. ఇదీ చదవండి: మరొకరికి శ్రద్ధా వాకర్ రింగ్ తొడిగి మరీ.. -
తండ్రిని చంపి ముక్కలుగా.. సాయం చేసిన తల్లి
దేశాన్నే ఉలిక్కిపడేలా చేసిన శ్రద్ధా హత్య కేసు మరువక మునుపే అచ్చం అలాంటి ఉదంతమే పశ్చిమ బెంగాల్ చోటు చేసుకుంది. కాకపోతే అక్కడ నిందితుడు ప్రియురాలిని 35 ముక్కలుగా చేస్తే....ఇక్కడొక ఒక కొడుకు కన్న తండ్రేని హతమార్చి ఆరు ముక్కలుగా కోసేశాడు. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....కోల్కతలాని బరుయ్‌పూర్ ఉంటున్న రిటైర్డ్ నేవీ ఆఫీసర్ 55 ఏళ్ల చక్రవర్తి కన్న కొడుకు చేతిలో హతమయ్యాడు. అతను 2000లో రిటైర్ అయ్యారు. ఒక ఎగ్జామ్ ఫీజు విషయమై తలెత్తిన వివాదం హత్య చేసేందుకు దారితీసింది. ఆ అధికారి కుటుంబ సభ్యల మధ్య ఎగ్జామ్ ఫీజు చెల్లింపు విషయమై వాగ్వాదం తలెత్తింది. దీంతో ఆగ్రహించిన కొడుకు కోపంతో తండ్రి గొంతుకోసి చంపేశాడు. ఆ తర్వాత అతన్ని ఆరు ముక్కలుగా కోసి తమ ఇంటికి సమీపంలో వేరు వేరు చోట్ల పడేశాడని చెప్పారు. అందుకు అతడి తల్లి సహకరించింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఏమి ఎరుగనట్లుగా పోలీసులకు నవంబర్ 15న మిస్సింగ్ కేసుగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న తాము ఆ తల్లి కొడుకులను గట్టిగా విచారించగా...అసలు విషయం తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అయ్యామని పోలీసులు చెబుతున్నారు. తామే హత్య చేసి ముక్కలుగా కోసి పడేసినట్లు తల్లి కొడుకులు ఒప్పుకున్నారు. పరీక్ష ఫీజు చెల్లించే విషయమై తీవ్ర వాగ్వాదానికి దిగాడని..తట్టుకోలేక ఈ దారుణానికి నిందితుడు ఒడిగట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. విచారణలో నిందితుడు ఆ భాగాలను ప్లాస్టిక్ కవర్‌తో చుట్టి సైకిల్‌పై తీసుకువెళ్లి పడేసినట్లు తెలిపాడు. బాధితుడి శరీర భాగాలను చెరువు సమీపంలో చెత్త డంప్ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసలు తెలిపారు. మృతదేహాన్ని కోయడానికి ఉపయోగించిన కత్తి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఐతే విచారణలో బాధితుడు తరచు తాగొచ్చి కుటుంబ సభ్యులతో గొడవపడుతూ ఉండేవాడని స్థానికులు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఆ తల్లి కొడుకులిద్దర్నీ అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ పుష్ప తెలిపారు. (చదవండి: చెప్పకుండా పెళ్లి చేసుకుందని...కన్న తండ్రే కాలయముడిలా...) -
పాపం శ్రద్ధా వాకర్.. అప్పుడు కూడా అదే టార్చర్.. 2020 ఫోటో వైరల్
శ్రద్ధా వాకర్.. ఎక్కడ చూసినా, చదివినా ప్రియుడి చేతిలో అన్యాయంగా బలైన ఈ యువతి వార్తలే కనిపిస్తున్నాయి. ఘటన వెలుగులోకి వచ్చి నేటికి వారం అవతున్నా(నవంబర్11న నిందితుడు అఫ్తాబ్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు) నిత్యం సంచలన విషయాలు తెరమీదకు వస్తున్నాయి. యావత్ దేశాన్ని ఉలిక్కి పడేలా చేసిన ఈ ఘోర ఈ దారుణ ఘటనలో నిందితుడి ఆఫ్తాబ్ను పోలీసులు ఇంకా విచారిస్తున్నారు. పోలీస్ కస్టడీలో అఫ్తాబ్ గంటకో కొత్త విషయాలను చెప్పి షాక్‌లా మీద షాక్‌లు ఇస్తున్నాడు. తాజాగా శ్రద్ధా వాకర్‌కు సంబంధించిన ఓ పాత ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2020లో తీసిన ఫోటో ఇది. దీనిని చూస్తుంటే అఫ్తాబ్ అమిన్ పునావాలాతో ఆమె రిలేషన్ ఎంత భయంకరంగా ఉందనే దానికి అద్దం పడుతోంది. ఈ ఫోటోలో శ్రద్ధా కళ్లు, ముక్కు, చెంప చుట్టూ గాయాల గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో అఫ్తాబ్ శ్రద్ధతో నిత్యం గొడవపడేవాడేవాడని తెలుస్తోంది. అయితే తనకు ఎన్ని దెబ్బలు తగిలినా ఈ చిత్రంలో ఆమె నవ్వుతూ ఉండటం విశేషం. చదవండి: షాకింగ్ ఘటన: ప్రియురాలిని చంపి.. ముక్కలుగా కోసి.. తలను పాలిథిన్ సంచిలో! అంతేగాక ఆమె 2020లో క్రితం 4 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్లు ఓ ఆసుపత్రి అందించిన నివేదిక ద్వారా తెలిసింది. ‘2020 డిసెంబర్ 3న ప్రియుడు అఫ్తాబ్‌తో కలిసి ముంబై పరిధిలోని ఓజోన్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో చేరింది. భుజం నొప్పితో వచ్చింది. కానీ తన గాయాలకు కారణాలు వెల్లడించలేదు.’ అని ఆమెకు వైద్యం అందించిన డాక్టర్ శివ ప్రసాద్ షిండే తెలిపారు. మరోవైపు శ్రద్ధా స్నేహితులు కూడా అఫ్తాబ్ ఆమెను ఎంత క్రూరంగా హింసించేవాడో ఒక్కొక్కరుగా బయటకొచ్చి చెబుతున్నారు. శ్రద్ధా వాకర్‌ను తన బాయ్‌ఫ్రెండ్ మానసికంగా హింసించడంతో పాటు శారీరకంగా వేధించేవాడని ఆమె స్నేహితురాలు తెలిపింది. అతనితో సంబంధాన్ని ముగించుకోవాలని ఆమె కోరుకున్నట్లు వెల్లడించింది. కానీ అఫ్తాబ్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడంతో శ్రద్ధకు ఎలాంటి అవకాశం లేకుండా పోయిందని వాపోయింది. ఆమె అతన్ని విడిచిపెడితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడని గుర్తు చేసుకుంది. చదవండి: శ్రద్ధ హత్య కేసు విచారణలో షాకింగ్ నిజాలు.. గంజాయి మత్తులో క్రూరంగా శ్రద్ధ తన జీవితంపై భయపడేదని, వారిద్దరి మధ్య చాలా గొడవలు జరిగాయని మరో స్నేహితుడు రజత్ తెలిపారు. రాత్రి సమయంలో తనకు వాట్సాప్ మెసెజ్ చేసి ఎక్కడికైనా తీసుకెళ్లమని కోరేంత వరకు గొడవలు జరిగేవని చెప్పారు. ఒకవేళ ఆఫ్తాబ్‌తోనే కలిసి ఉంటే తనను చంపేస్తాడని భయపడేదని వెల్లడించాడు. 2021లోనూ అఫ్తాబ్ శ్రద్ధాపై దాడి చేశాడని, తాము రక్షించినట్లు తెలిపారు. ఆమె మెడ, ఛాతీపై భాగంలో గాయాలు చూసినట్లు, ముక్కు కూడా దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అప్పట్లోనే హెచ్చరించామన్నారు. -
షాకింగ్ ఘటన: ప్రియురాలిని చంపి.. ముక్కలుగా కోసి.. తలను పాలిథిన్ సంచిలో!
సెల్‌ఫోన్, సరదాలు, చెడు స్నేహాలతో కొంతమంది యువత పెడదోవ పడుతుంటే మరికొందరు వయస్సుతో సంబంధం లేకుండా ప్రేమ, సహజీవనం మోజులో పడి హద్దుమీరుతున్నారు. కొత్త అనుభూతి కోసం చెడు అలవాట్లకు బానిసలుగా మారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. తొందరపాటు నిర్ణయాలతో బంగారు భవిష్యత్తును చేజేతులా పేకమేడల్లా కూల్చేసుకుంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య చేసు ఇందుకు నిదర్శనంగా నిలిచిన విషయం తెలిసిందే. గంజాయి మత్తులో ప్రియురాలిని అత్యంత క్రూరంగా హత్య చేసిన నిందితుడు అఫ్తాబ్.. ఆమె శరీరాన్ని 35 భాగాలుగా కోశాడు. అనతంరం ఫ్రిజ్‌లో దాచి పెట్టి ఒక్కొక్క అవయమవాన్ని మెల్లగా ఢిల్లీ అంతటా పడేశాడు. గూగుల్, యూట్యూబ్ వంటి సాంకేతికతను ఉపయోగించి చేసిన తప్పును కప్పిపుచ్చకునే ప్రయత్నం చేశాడు. హత్య జరిగిన విషయం ఎక్కడా పొక్కకుండా హంతకుడు పన్నిన పన్నాగం యావత్ దేశాన్ని విస్మయానికి గురిచేస్తోంది. 5 రోజుల పరిచయం ఈ ఘటన నుంచి తేరుకోకముందే బంగ్లాదేశ్‌లో మరో ఘోరం వెలుగు చూసింది. ప్రియుడి చేతిలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. హత్య చేయడానికి కేవలం అయిదు రోజుల క్రితమే వీరిద్దరికి పరిచయం ఏర్పడటం గమనార్హం. వివరాలు.. అబు బాకర్ అనే యువకుడు సప్నా అనే యవతితో సహజీనం చేస్తున్నాడు. వీరిద్దరూ గత నాలుగు ఏళ్లుగా గోబర్‌చాకా ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని జీవిస్తున్నారు. చదవండి: అఫ్తాబ్ డ్రగ్ అడిక్ట్.. గంజాయి మత్తులోనే శ్రద్ధను హత్యచేసి.. రాత్రంతా శవం పక్కనే.. మరో యువతితో.. అబుకి కొన్ని రోజుల క్రితం కవితా రాణి అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఇది నెమ్మదిగా ప్రేమకు, వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈనెల 5న పని నిమిత్తం సప్నా వేరే ఊరికి వెళ్లిన సమయంలో కవితను అబూ బాకర్ తన ఇంటికి తీసుకొచ్చాడు. అయితే యువకుడికి ఇంతకుముందే మరో యువతితో సంబంధం ఉన్న విషయం కవితకు తెలియడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. దీంతో ఆవేశానికి లోనైన అబూ.. యువతిని గొంతు కోసి చంపాడు. అనంతరం ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేశాడు. ఆమె శరీరం నుంచి తలను వేరు చేసి, చేతులను నరికి కాలువలో పడేశాడు. తలను పాలిథిన్ సంచిలో చుట్టి ఉంచి మిగిలిన మృతదేహాన్ని బాక్సులో పడేసి ఇంటి నుంచి పారిపోయాడు. ఈనెల 6న అబూ బాకర్ పనికి రాకపోవడం. ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో అతను పనిచేస్తున్న రవాణా సంస్థ యజమాని బకర్ అద్దె ఇంటికి ఒక వ్యక్తిని పంపాడు. ఇంటికి తాళం వేసి ఉండటంతో అబూబకర్ అదృశ్యంపై అనుమానంతో యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు షాక్ పోలీసులు వచ్చి తలుపులు తీయగా.. ఇంట్లో చూసిన దృశ్యాలకు షాక్ అయ్యారు. ఓ పెట్టెలో తల లేని యువతి మృతదేహం కనిపించింది. పక్కనే తలను పాలిథిన్‌లో చుట్టి వేరుగా ఉండటాన్ని గుర్తించారు. చేతులు మాత్రం లభించలేదు. బాధితురాలిని కాళీపాడ్ బాచర్ల కుమార్తె కవితా రాణిగా గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలించడం ప్రారంభించారు. హత్య చేసిన రోజు రాత్రి అబూ బకర్ తన భాగస్వామి సప్నాతో కలిసి రూప్సా నది దాటి ఢాకాకు బయలుదేరినట్లు గుర్తించారు. నవంబర్ 6 రాత్రి నిందితుడి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. ఘాజీపూర్ జిల్లా బసాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అబు బాకర్, ప్రేయసి సప్నాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కస్టడీలో అబూ బకర్ నేరాన్ని అంగీకరించాడు. గోబర్‌చాకా ప్రాంతంలోని ఇరుకైన ప్రదేశంలో పాలిథిన్‌లో చుట్టిన కవిత తెగిపోయిన చేతులను స్వాధీనం చేసుకున్నారు. ఇదీ చదవండి: Shraddha Case: అమ్మాయిలే జాగ్రత్త పడాలి! -
లక్ష అప్పు: చంపి, ముక్కలు చేసి కాలువలో విసిరేసిన జంట
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో మరో దారుణం వెలుగు చూసింది. తీసుకున్న అప్పు చెల్లించమన్నందుకు ఒక వృద్ధురాలిని నిర్దాక్షిణ్యంగా హత్య చేశారు ఒక జంట. కేవలం లక్ష రూపాయల కోసం 75 ఏళ్ల మహిళను హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి స్థానిక కాలువలో విసిరి పారేశారు. తమ అఘాయిత్యం ఎవరికి తెలియదులే అనుకున్నారు. చివరికి పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించి, కటాకటాల వెనక్కి వెళ్లకి తప్పలేదు. సీనియర్ పోలీసు అధికారి సంతోష్ మీనా అందించిన సమాచారం ప్రకారం అనిల్ ఆర్య, అతని భార్య తన్నూ ఆర్య ఢిల్లీలోని నజాఫ్‌నగర్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈవెంట్ మేనేజ్మెంట్ అధికారిగా పనిచేస్తున్న అనిల్, మృతురాలి వద్ద లక్ష రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అవసరాల నిమిత్తం తీసుకున్న సొమ్మును చెల్లించమంటే మాత్రం నిర్లక్క్ష్యంగా వ్యవహరించేవారు. అయితే తన అప్పు తీర్చాల్సిందిగా పదే పదే నిలదీసేది. అది జీర్ణించుకోలేని అనిల్ దంపతులు ఆమెను ఎలాగైనా మట్టు బెట్టాలని ప్లాన్ వేశారు. ఈ క్రమంలో మరోసారి డబ్బులకోసం ఒత్తిడి చేయడంతో ఆమెపై దాడి చేసి వాటర్ పైప్‌తో గొంతుకు ఉరిబిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని మూడు ముక్కలుగా చేసిన స్థానిక కాలువలో పడేశారు. నిందితుల సమాచారం మేరకు మృతదేహ భాగాలను కాలువ నుంచి వెలికి తీశారు పోలీసులు. కేసు నమోదు చేసి అనిల్ దంపతులను అరెస్ట్ చేశారు. మృతురాలిని కవితా గ్రోవర్‌గా గుర్తించారు. కవిత కుమారుడు, స్థానిక రియల్టీ వ్యాపారి మనీష్ గ్రోవర్ ఫిర్యాదు మేరకు విచారణ పట్టిన పోలీసులు కేసును ఛేదించారు. -
పక్కా ప్లాన్‌తో ఊబర్ డ్రైవర్ దారుణ హత్య
సాక్షి, న్యూఢిల్లీ : కారును దొంగిలించాలనే కుట్రలో భాగంగా ఊబర్ క్యాబ్‌ను బుక్ చేసుకున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన భార్యాభర్తలు ఓ డ్రైవర్‌ను దారుణంగా హతమార్చారు. అనంతరం ముక్కలుగా కోసి మురికి కాలువలో పడేశారు. వివరాలు.. తూర్పు ఢిల్లీలోని శాఖార్‌పూర్‌లో నివాసముండే రామ్‌గోవింద్ ఊబర్‌లో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత మంగళవారం ఢిల్లీలోని ఎంజీ రోడ్డు నుంచి ఘజియాబాద్‌కు ఫర్హాత్ అలీ (35, సీమా శర్మ (30) దంపతులు క్యాబ్ బుక్ చేసుకున్నారు. ఘజియాబాద్‌కు చేరుకోగానే గోవింద్‌ను తమ ఇంటికి ఆహ్వానించారు. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం గోవింద్‌కు టీలో మత్తుమందు కలిపి ఇచ్చారు. అనంతరం అతన్ని గొంతు నులిమి హత్య చేశారు. మరునాడు మృతదేహాన్ని ముక్కలుగా కోసి మూడు సంచుల్లో ప్యాక్ చేసి నొయిడాలోని మురికి కాలువలో పడేశారు. తప్పుదారి పట్టించారు.. జనవరి 29న డ్యూటీ నిమిత్తం వెళ్లిన తన భర్త ఇంటికి తిరిగి రాకపోవడంతో గోవింద్ భార్య శాఖార్‌పూర్ పోలిస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, గోవింద్‌ను హత్య చేసిన అనతరం నిందితులు తెలివిగా వ్యవహరించారు. మృత దేహాన్ని పడేసిన తర్వాత క్యాబ్‌ను యథావిధిగా నడిపించారు. పోలీసులకు దర్యాప్తు సవాల్‌గా మారింది. మదాంగిర్ నుంచి కాపాషిరాలో కారు చివరగా బుక్ అయినట్టుగా పోలీసులు తెలుసుకున్నారు. అక్కడి నుంచి కారులోని జీపీఎస్ పరికరం పనిచేయడం ఆగిపోయింది. దీంతో ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు ఫర్హాత్ దంపతులను మెహ్రౌలి-గురుగ్రామ్ రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో నిందితులు ఫర్హాత్ అలీ, సీమా శర్మ నేరాన్ని అంగీకరించారని తూర్పు ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ వైజయంత ఆర్యా వెల్లడించారు. సాంకేతిక సహాయంతో గోవింద్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. -
భర్తను చంపి.. ముక్కలుగా కోసి
పనాజి : కట్టుకున్న భర్తను కడతేర్చిందో భార్య. పోలీసులకు అనుమానం రాకూడదనే ఉద్దేశంతో శవాన్ని అటవీ ప్రాంతంలో పడేసింది. ఈ దారుణ సంఘటన దక్షిణ గోవాలోని కరోచీరాం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బసౌరాజ్ బసు, కల్పనా బసు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. బసౌరాజ్ దినసరి కూలీగా పనిచేసేవాడు. నెలరోజుల క్రితం భార్యాభర్తల మధ్య చిన్న గొడవ తలెత్తింది. దీంతో కోపోద్రిక్తురాలైన కల్పన ఆవేశంలో తన భర్తను గొంతు నులిమి హత్య చేసింది. తర్వాత భయంతో ఈ విషయాన్ని భర్త స్నేహితులకు చెప్పి, వారి సాయం కోరింది. అనంతరం ముగ్గురు వ్యక్తులతో కలిసి భర్త శవాన్ని మూడు ముక్కలుగా కోసి, గోనె సంచిలో కుక్కి నిర్మానుష్య ప్రదేశంలో పడేసింది. అనుమానం వచ్చిందిలా.. నిందితుల్లో ఒకరైన వ్యక్తి భార్యకు అతడి ప్రవర్తన పట్ల అనుమానం కలిగింది. విషయమేమిటని నిలదీయగా అతడు నిజం చెప్పేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితులు కల్పనా బసు, సురేశ్ కుమార్, అబ్దుల్ కరీం, పంకజ్ పవార్లను అరెస్టు చేశారు. తమదైన శైలిలో నిందితులను విచారించగా నిజాలు వెల్లడించారని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. వారు చెప్పిన అంశాల ఆధారంగా నిర్మానుష్య ప్రదేశంలో, కుళ్లిపోయిన స్థితిలో ఉన్నశవాన్ని కనుగొన్నామని.. అయితే ఆ శవం బసౌరాజ్దేనని తేల్చేందుకు ఆధారాలు లేకపోవడంతో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామన్నారు. ఈ ఘటనపై లోతుగా విచారణ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. -
కిరాతకంగా చంపేసి.. బాడీని ముక్కలు చేసి..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి రెండు చోట్ల పడేశారు. శుక్రవారం ఉత్తర ఢిల్లీలోని తిమర్పూర్ ప్రాంతంలో ఓ ఆటో డ్రైవర్ మృతుడి శరీర భాగాలను గుర్తించాడు. హంతకులు మృతుడి తల, చేతులు, కాళ్లు నరికి బెడ్ షీట్లో చుట్టి పడేశారు. అతను పోలీసులకు సమాచారం అందించడంతో ఫోరెన్సిక్ బృందాన్ని అక్కడికి పంపి వాటిని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి ఇతర శరీర భాగాల కోసం పోలీసులు చుట్టు పక్కల ప్రాంతాల్లో గాలించగా.. నిన్న మధ్యాహ్నం మంజు కర తిలాలోని సంజయ్ అఖాడ సమీపంలో మృతుడి మొండెం భాగాన్ని కనుగొన్నారు. మృతుడి వివరాలు తెలియరాలేదని పోలీసులు చెప్పారు. రెండు రోజుల క్రితం హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి శరీరంపై దుస్తులు ఉన్నాయని, తల వెనుక భాగంలో గాయాలున్నాయని, ముఖం ఛిద్రం కాలేదని చెప్పారు. హంతకులు వేరే చోట హత్య చేసి, మృతుడి ఆనవాళ్లు తెలియకుండా ఉండంటం కోసం శరీర భాగాలను ముక్కలు చేసి ఇక్కడి పడేశారని అనుమానిస్తున్నారు.