కిరాతకంగా చంపేసి.. బాడీని ముక్కలు చేసి.. | Delhi: Mans body chopped, dumped at two spots | Sakshi
Sakshi News home page

కిరాతకంగా చంపేసి.. బాడీని ముక్కలు చేసి..

Published Sat, Apr 1 2017 9:19 AM | Last Updated on Tue, Oct 9 2018 5:43 PM

కిరాతకంగా చంపేసి.. బాడీని ముక్కలు చేసి.. - Sakshi

కిరాతకంగా చంపేసి.. బాడీని ముక్కలు చేసి..

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి రెండు చోట్ల పడేశారు. శుక్రవారం ఉత్తర ఢిల్లీలోని తిమర్‌పూర్ ప్రాంతంలో ఓ ఆటో డ్రైవర్‌ మృతుడి శరీర భాగాలను గుర్తించాడు. హంతకులు మృతుడి తల, చేతులు, కాళ్లు నరికి బెడ్‌ షీట్‌లో చుట్టి పడేశారు. అతను పోలీసులకు సమాచారం అందించడంతో ఫోరెన్సిక్ బృందాన్ని అక్కడికి పంపి వాటిని స్వాధీనం చేసుకున్నారు.

మృతుడి ఇతర శరీర భాగాల కోసం పోలీసులు చుట్టు పక్కల ప్రాంతాల్లో గాలించగా.. నిన్న మధ్యాహ్నం మంజు కర తిలాలోని సంజయ్ అఖాడ సమీపంలో మృతుడి మొండెం భాగాన్ని కనుగొన్నారు. మృతుడి వివరాలు తెలియరాలేదని పోలీసులు చెప్పారు. రెండు రోజుల క్రితం హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి శరీరంపై దుస్తులు ఉన్నాయని, తల వెనుక భాగంలో గాయాలున్నాయని, ముఖం ఛిద్రం కాలేదని చెప్పారు. హంతకులు వేరే చోట హత్య చేసి, మృతుడి ఆనవాళ్లు తెలియకుండా ఉండంటం కోసం శరీర భాగాలను ముక్కలు చేసి ఇక్కడి పడేశారని అనుమానిస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement