భర్తను చంపి.. ముక్కలుగా కోసి | Goa Woman Killed Husband And Chop Up Body | Sakshi
Sakshi News home page

భర్తను చంపి.. ముక్కలుగా కోసి

Published Wed, May 9 2018 6:43 PM | Last Updated on Thu, Oct 4 2018 5:51 PM

Goa Woman Killed Husband And Chop Up Body - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

పనాజి : కట్టుకున్న భర్తను కడతేర్చిందో భార్య. పోలీసులకు అనుమానం రాకూడదనే ఉద్దేశంతో శవాన్ని అటవీ ప్రాంతంలో పడేసింది. ఈ దారుణ సంఘటన దక్షిణ గోవాలోని కరోచీరాం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బసౌరాజ్‌ బసు, కల్పనా బసు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. బసౌరాజ్‌ దినసరి కూలీగా పనిచేసేవాడు.

నెలరోజుల క్రితం భార్యాభర్తల మధ్య చిన్న గొడవ తలెత్తింది. దీంతో కోపోద్రిక్తురాలైన కల్పన ఆవేశంలో తన భర్తను గొంతు నులిమి హత్య చేసింది. తర్వాత భయంతో ఈ విషయాన్ని భర్త స్నేహితులకు చెప్పి, వారి సాయం కోరింది. అనంతరం ముగ్గురు వ్యక్తులతో కలిసి భర్త శవాన్ని మూడు ముక్కలుగా కోసి, గోనె సంచిలో కుక్కి  నిర్మానుష్య ప్రదేశంలో పడేసింది.

అనుమానం వచ్చిందిలా..
నిందితుల్లో ఒకరైన వ్యక్తి భార్యకు అతడి ప్రవర్తన పట్ల అనుమానం కలిగింది. విషయమేమిటని నిలదీయగా అతడు నిజం చెప్పేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితులు కల్పనా బసు, సురేశ్‌ కుమార్‌, అబ్దుల్‌ కరీం, పంకజ్‌ పవార్‌లను అరెస్టు చేశారు. తమదైన శైలిలో నిందితులను విచారించగా నిజాలు వెల్లడించారని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. వారు చెప్పిన అంశాల ఆధారంగా నిర్మానుష్య ప్రదేశంలో, కుళ్లిపోయిన స్థితిలో ఉన్నశవాన్ని కనుగొన్నామని.. అయితే ఆ శవం బసౌరాజ్‌దేనని తేల్చేందుకు ఆధారాలు లేకపోవడంతో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించామన్నారు. ఈ ఘటనపై లోతుగా విచారణ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement