సెల్‌ఫోన్, సరదాలు, చెడు స్నేహాలతో కొంతమంది యువత పెడదోవ పడుతుంటే మరికొందరు వయస్సుతో సంబంధం లేకుండా ప్రేమ, సహజీవనం మోజులో పడి హద్దుమీరుతున్నారు. కొత్త అనుభూతి కోసం చెడు అలవాట్లకు బానిసలుగా మారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. తొందరపాటు నిర్ణయాలతో బంగారు భవిష్యత్తును చేజేతులా పేకమేడల్లా కూల్చేసుకుంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య చేసు ఇందుకు నిదర్శనంగా నిలిచిన విషయం తెలిసిందే.
గంజాయి మత్తులో ప్రియురాలిని అత్యంత క్రూరంగా హత్య చేసిన నిందితుడు అఫ్తాబ్.. ఆమె శరీరాన్ని 35 భాగాలుగా కోశాడు. అనతంరం ఫ్రిజ్‌లో దాచి పెట్టి ఒక్కొక్క అవయమవాన్ని మెల్లగా ఢిల్లీ అంతటా పడేశాడు. గూగుల్, యూట్యూబ్ వంటి సాంకేతికతను ఉపయోగించి చేసిన తప్పును కప్పిపుచ్చకునే ప్రయత్నం చేశాడు. హత్య జరిగిన విషయం ఎక్కడా పొక్కకుండా హంతకుడు పన్నిన పన్నాగం యావత్ దేశాన్ని విస్మయానికి గురిచేస్తోంది.
5 రోజుల పరిచయం
ఈ ఘటన నుంచి తేరుకోకముందే బంగ్లాదేశ్‌లో మరో ఘోరం వెలుగు చూసింది. ప్రియుడి చేతిలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. హత్య చేయడానికి కేవలం అయిదు రోజుల క్రితమే వీరిద్దరికి పరిచయం ఏర్పడటం గమనార్హం. వివరాలు.. అబు బాకర్ అనే యువకుడు సప్నా అనే యవతితో సహజీనం చేస్తున్నాడు. వీరిద్దరూ గత నాలుగు ఏళ్లుగా గోబర్‌చాకా ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని జీవిస్తున్నారు.
చదవండి: అఫ్తాబ్ డ్రగ్ అడిక్ట్.. గంజాయి మత్తులోనే శ్రద్ధను హత్యచేసి.. రాత్రంతా శవం పక్కనే..
మరో యువతితో..
అబుకి కొన్ని రోజుల క్రితం కవితా రాణి అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఇది నెమ్మదిగా ప్రేమకు, వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈనెల 5న పని నిమిత్తం సప్నా వేరే ఊరికి వెళ్లిన సమయంలో కవితను అబూ బాకర్ తన ఇంటికి తీసుకొచ్చాడు. అయితే యువకుడికి ఇంతకుముందే మరో యువతితో సంబంధం ఉన్న విషయం కవితకు తెలియడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. దీంతో ఆవేశానికి లోనైన అబూ.. యువతిని గొంతు కోసి చంపాడు.
అనంతరం ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేశాడు. ఆమె శరీరం నుంచి తలను వేరు చేసి, చేతులను నరికి కాలువలో పడేశాడు. తలను పాలిథిన్ సంచిలో చుట్టి ఉంచి మిగిలిన మృతదేహాన్ని బాక్సులో పడేసి ఇంటి నుంచి పారిపోయాడు. ఈనెల 6న అబూ బాకర్ పనికి రాకపోవడం. ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో అతను పనిచేస్తున్న రవాణా సంస్థ యజమాని బకర్ అద్దె ఇంటికి ఒక వ్యక్తిని పంపాడు. ఇంటికి తాళం వేసి ఉండటంతో అబూబకర్ అదృశ్యంపై అనుమానంతో యజమాని పోలీసులకు సమాచారం అందించాడు.
పోలీసులు షాక్
పోలీసులు వచ్చి తలుపులు తీయగా.. ఇంట్లో చూసిన దృశ్యాలకు షాక్ అయ్యారు. ఓ పెట్టెలో తల లేని యువతి మృతదేహం కనిపించింది. పక్కనే తలను పాలిథిన్‌లో చుట్టి వేరుగా ఉండటాన్ని గుర్తించారు. చేతులు మాత్రం లభించలేదు. బాధితురాలిని కాళీపాడ్ బాచర్ల కుమార్తె కవితా రాణిగా గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలించడం ప్రారంభించారు. హత్య చేసిన రోజు రాత్రి అబూ బకర్ తన భాగస్వామి సప్నాతో కలిసి రూప్సా నది దాటి ఢాకాకు బయలుదేరినట్లు గుర్తించారు.
నవంబర్ 6 రాత్రి నిందితుడి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. ఘాజీపూర్ జిల్లా బసాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అబు బాకర్, ప్రేయసి సప్నాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కస్టడీలో అబూ బకర్ నేరాన్ని అంగీకరించాడు. గోబర్‌చాకా ప్రాంతంలోని ఇరుకైన ప్రదేశంలో పాలిథిన్‌లో చుట్టిన కవిత తెగిపోయిన చేతులను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: Shraddha Case: అమ్మాయిలే జాగ్రత్త పడాలి!
Comments
Please login to add a commentAdd a comment