Hindu Girl
-
పాక్‌లో పదేళ్ల చిన్నారి అపహరణ.. మతమార్పిడి.. 50 ఏళ్ల వ్యక్తితో బలవంతపు పెళ్లి
కరాచీ: పాకిస్తాన్లో హిందువుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. మత ఛాందసవాదులు ఒక చిన్నారిని కిడ్నాప్ చేసి, బలవంతంగా మతమార్పిడి చేయించి, పెళ్లి జరిపించిన ఉదంతం చోటుచేసుకుంది. ఇలాంటి అనేక కేసులు అనేకం వెలుగుచూస్తున్నప్పటికీ పోలీసులు ప్రేక్షక పాత్రలో కనిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో పదేళ్ల హిందూ బాలికను కిడ్నాప్ చేసి, బలవంతంగా ముస్లిం వ్యక్తితో వివాహం జరిపించిన ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.పాకిస్తాన్ దారావర్ ఇత్తెహాద్ (మైనారిటీల హక్కుల కోసం ఏర్పాటైన స్వచ్ఛంద సంస్థ) అధ్యక్షుడు శివకట్చి తెలిపిన వివరాల ప్రకారం సంఘర్ ప్రాంతానికి చెందిన 10 ఏళ్ల హిందూ బాలికను 50 ఏళ్ల ముస్లిం వ్యక్తి బలవంతంగా వివాహం చేసుకున్నాడు. అవినీతికి అలవాటు పడిన పోలీసు సిబ్బంది సహకారంతో ఈ వివాహం జరిగిదనే ఆరోపణలున్నాయి. బాధితురాలి తల్లిదండ్రులు న్యాయవాది సహకారంతో కోర్టులో కేసు వేయడంతో ఈ ఉదంతం వెలుగు చూసిందని శివకట్చి తెలిపారు.గ్రామంలోని తమ ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను మిర్పుర్ఖాస్కు చెందిన గులామ్ ముహమ్మద్ అపహరించి, సిర్హండి ఎయిర్ సమరో మదర్సాకు తీసుకెళ్లారని శివకచ్చి చెప్పారు. తరువాత ఆ బాలికకు బలవంతంగా మత మార్పిడి చేయించి షాహిద్ తల్పూర్ అనే వ్యక్తితో వివాహం జరిపించారని తెలిపారు. అయితే ఆ ప్రాంత న్యాయ అధికారుల చొరవతో పోలీసులు జోక్యం చేసుకుని ఆ బాలికను సురక్షితంగా ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారని శివకచ్చి తెలిపారు.ఇది కూడా చదవండి: సగం మంది ఇంటి నుంచే పనిచేయండి -
ఇతర మతస్థుడిని పెళ్లి చేసుకుందని కుమార్తెకు పిండ ప్రదానం..
మధ్యప్రదేశ్: బతికుండగానే కన్నకూతురికి అంతిమ సంస్కారాలు చేశారు తల్లిదండ్రులు. ఇతర మతస్థుడిని వివాహమాడిందనే కోపంతో కూతురికి పిండ ప్రదానం చేశారు. ఈ ఘటన మధ్యపదేశ్లోని జబల్పూర్లో జరిగింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురికి వివాహం చేసి అత్తారింటికి పంపించాలనుకున్నారు. కానీ వారి కలలేవీ ఆ కూతురు నెరవేర్చలేదు. ఇతర మతస్థుడిని వివాహమాడింది. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు బిడ్డ చనిపోయిందనుకున్నారు. నర్మదా నది ఒడ్డున ఏకంగా అంతమ సంస్కారాలు కూడా చేశారు. జబల్పూర్కు చెందిన అనామిక దూబె ఇతర మతస్థుడిని వివాహమాడింది. అడ్డగించిన బంధువులతో గొడవపడింది. న్యాయస్థానాన్ని సంప్రదించి జూన్ 7న ముస్లిం సంప్రదాయాల ప్రకారం ఆమె వివాహం జరిగింది. తల్లిదండ్రులు పెట్టిన పేరును మార్చి ఉజ్మ ఫాతిమాగా పేరు పెట్టుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు బిడ్డను వదిలేశారు. నర్మదా నది ఒడ్డున ఆదివారం రోజున గౌరీ ఘాట్‌లో కూతురుకి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. పిండప్రదానం చేసి నదిలో కలిపేశారు. ఇలాంటి రోజు చూడాల్సి వస్తుందని తాను అనుకోలేదని అనామిక సోదరుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదీ చదవండి:ప్రేమపెళ్లి చేసుకున్నారని.. ఆ గుడిలో ఏం చేశారంటే! -
షాకింగ్ ఘటన: ప్రియురాలిని చంపి.. ముక్కలుగా కోసి.. తలను పాలిథిన్ సంచిలో!
సెల్‌ఫోన్, సరదాలు, చెడు స్నేహాలతో కొంతమంది యువత పెడదోవ పడుతుంటే మరికొందరు వయస్సుతో సంబంధం లేకుండా ప్రేమ, సహజీవనం మోజులో పడి హద్దుమీరుతున్నారు. కొత్త అనుభూతి కోసం చెడు అలవాట్లకు బానిసలుగా మారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. తొందరపాటు నిర్ణయాలతో బంగారు భవిష్యత్తును చేజేతులా పేకమేడల్లా కూల్చేసుకుంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య చేసు ఇందుకు నిదర్శనంగా నిలిచిన విషయం తెలిసిందే. గంజాయి మత్తులో ప్రియురాలిని అత్యంత క్రూరంగా హత్య చేసిన నిందితుడు అఫ్తాబ్.. ఆమె శరీరాన్ని 35 భాగాలుగా కోశాడు. అనతంరం ఫ్రిజ్‌లో దాచి పెట్టి ఒక్కొక్క అవయమవాన్ని మెల్లగా ఢిల్లీ అంతటా పడేశాడు. గూగుల్, యూట్యూబ్ వంటి సాంకేతికతను ఉపయోగించి చేసిన తప్పును కప్పిపుచ్చకునే ప్రయత్నం చేశాడు. హత్య జరిగిన విషయం ఎక్కడా పొక్కకుండా హంతకుడు పన్నిన పన్నాగం యావత్ దేశాన్ని విస్మయానికి గురిచేస్తోంది. 5 రోజుల పరిచయం ఈ ఘటన నుంచి తేరుకోకముందే బంగ్లాదేశ్‌లో మరో ఘోరం వెలుగు చూసింది. ప్రియుడి చేతిలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. హత్య చేయడానికి కేవలం అయిదు రోజుల క్రితమే వీరిద్దరికి పరిచయం ఏర్పడటం గమనార్హం. వివరాలు.. అబు బాకర్ అనే యువకుడు సప్నా అనే యవతితో సహజీనం చేస్తున్నాడు. వీరిద్దరూ గత నాలుగు ఏళ్లుగా గోబర్‌చాకా ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని జీవిస్తున్నారు. చదవండి: అఫ్తాబ్ డ్రగ్ అడిక్ట్.. గంజాయి మత్తులోనే శ్రద్ధను హత్యచేసి.. రాత్రంతా శవం పక్కనే.. మరో యువతితో.. అబుకి కొన్ని రోజుల క్రితం కవితా రాణి అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఇది నెమ్మదిగా ప్రేమకు, వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈనెల 5న పని నిమిత్తం సప్నా వేరే ఊరికి వెళ్లిన సమయంలో కవితను అబూ బాకర్ తన ఇంటికి తీసుకొచ్చాడు. అయితే యువకుడికి ఇంతకుముందే మరో యువతితో సంబంధం ఉన్న విషయం కవితకు తెలియడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. దీంతో ఆవేశానికి లోనైన అబూ.. యువతిని గొంతు కోసి చంపాడు. అనంతరం ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేశాడు. ఆమె శరీరం నుంచి తలను వేరు చేసి, చేతులను నరికి కాలువలో పడేశాడు. తలను పాలిథిన్ సంచిలో చుట్టి ఉంచి మిగిలిన మృతదేహాన్ని బాక్సులో పడేసి ఇంటి నుంచి పారిపోయాడు. ఈనెల 6న అబూ బాకర్ పనికి రాకపోవడం. ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో అతను పనిచేస్తున్న రవాణా సంస్థ యజమాని బకర్ అద్దె ఇంటికి ఒక వ్యక్తిని పంపాడు. ఇంటికి తాళం వేసి ఉండటంతో అబూబకర్ అదృశ్యంపై అనుమానంతో యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు షాక్ పోలీసులు వచ్చి తలుపులు తీయగా.. ఇంట్లో చూసిన దృశ్యాలకు షాక్ అయ్యారు. ఓ పెట్టెలో తల లేని యువతి మృతదేహం కనిపించింది. పక్కనే తలను పాలిథిన్‌లో చుట్టి వేరుగా ఉండటాన్ని గుర్తించారు. చేతులు మాత్రం లభించలేదు. బాధితురాలిని కాళీపాడ్ బాచర్ల కుమార్తె కవితా రాణిగా గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలించడం ప్రారంభించారు. హత్య చేసిన రోజు రాత్రి అబూ బకర్ తన భాగస్వామి సప్నాతో కలిసి రూప్సా నది దాటి ఢాకాకు బయలుదేరినట్లు గుర్తించారు. నవంబర్ 6 రాత్రి నిందితుడి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. ఘాజీపూర్ జిల్లా బసాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అబు బాకర్, ప్రేయసి సప్నాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కస్టడీలో అబూ బకర్ నేరాన్ని అంగీకరించాడు. గోబర్‌చాకా ప్రాంతంలోని ఇరుకైన ప్రదేశంలో పాలిథిన్‌లో చుట్టిన కవిత తెగిపోయిన చేతులను స్వాధీనం చేసుకున్నారు. ఇదీ చదవండి: Shraddha Case: అమ్మాయిలే జాగ్రత్త పడాలి! -
గుడిలో పెళ్లి చేసిన ముస్లిం జంట!
తిరువనంతపురం: మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే అరుదైన ఉదంతానికి కేరళ వేదికగా నిలిచింది. ఓ ముస్లిం జంట హిందూ యువతికి వివాహం జరిపించి మతం కంటే మానవత్వమే గొప్పదని చాటి చెప్పారు. కాసరగడ్‌లోని భగవతి ఆలయంలో ఆదివారం ఈ వివాహం జరిగింది. (చదవండి: ఇన్ని లక్షణాలున్న వధువు దొరికేనా..!) తల్లిదండ్రులు మరణించడంతో రాజేశ్వరి అనే బాలికను అబ్దుల్లా, ఖదీజా దంపతులు పెంచుకున్నారు. రాజేశ్వరి తండ్రి వీరివద్ద పనిచేసేవాడు. రాజేశ్వరి చిన్నప్పుడే తల్లిదండ్రులు మరణించడంతో ఆమెను అబ్దుల్లా, ఖదీజా దంపతులు చేరదీశారు. తమ ముగ్గురు కుమారులు షమీమ్, నజీబ్, షరీఫ్‌లతో పాటు రాజేశ్వరిని పెంచి పెద్ద చేశారు. విష్ణుప్రసాద్ అనే యువకుడితో ఆదివారం వైభవంగా పెళ్లి జరిపించారు. ఈ వేడుకకు హిందూ, ముస్లిం మతాలకు చెందిన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హాజరుకావడం విశేషం. కాగా, మత సామరస్యానికి అద్దం పట్టే మరో ఘటన గత నెలలోనూ చోటుచేసుకుంది. మతపరమైన అడ్డంకులను అధిగమించి కాయంకుళంలోని మసీదు.. హిందూ వివాహ వేడుకకు వేదికగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. (చదవండి: కాశీ మహాల్ ఎక్స్‌ప్రెస్‌లో ఆశ్చర్యకర ఘటన) -
హిందూ విద్యార్ధిని మృతిపై పాక్‌లో భగ్గుమన్న నిరసనలు
ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లోని లర్కానా ప్రాంతంలో హిందూ వైద్య విద్యార్ధిని నమ్రితా చందాని అనుమానాస్పద మృతిపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఘటనను నిరసిస్తూ పెద్ద సంఖ్యలో ప్రజలు కరాచీ వీధుల్లో ఆందోళన చేపట్టారు.లర్కానాలోని బబీ అసిఫా డెంటల్ కాలేజీలోని తన హాస్టల్ గదిలో నమ్రితా అనుమానాస్పద స్ధితిలో విగతజీవిగా పడిఉన్నారు. తొలుత ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని అనుమానించినా పోలీసులు భిన్న కోణాల్లో విచారణ చేపట్టారు. మరోవైపు విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆమె బలవన్మరణానికి పాల్పడలేదని, ఆమెను హత్య చేశారని ఆరోపిస్తున్నారు. తన సోదరి ఆత్మహత్య చేసుకోలేదని, హత్యకు గురైందని బాధితురాలి సోదరుడు డాక్టర్ విశాల్ సుందర్ పేర్కొన్నారు. లోపలి నుంచి తాళం వేసిన తన గదిలో మంచంపై పడిఉన్న నమిత్రా చందాని మెడకు తాడు బిగించి ఉంది. ఆమె గదికి తాళం వేసి ఉండటంతో సహ విద్యార్ధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాకిస్తాన్లో ఇటీవల మైనారిటీలపై దాడులు పెరుగుతున్న క్రమంలో హిందూ విద్యార్ధిని అనుమానాస్పద మృతి చోటుచేసుకోవడం గమనార్హం. -
పాత వీడియోనే.. మళ్లీ వైరల్!
మధ్యప్రదేశ్‌లో ఓ హిందూ అమ్మాయి చర్చిలో ప్రార్ధన చేసిన కారణంగా నడిరోడ్డుపై సజీవ దహనం చేసిన వీడియో ఫేస్బుక్, ట్విట్టర్లో చక్కర్లు కొడుతుంది. సోషల్ మీడియాలో వైరలయిన ఈ వీడియోను పాకిస్తానీయులు సైతం షేర్ చేస్తున్నారు. ఇండియా టుడే యాంటీ ఫేక్‌న్యూస్ వార్ రూమ్ (తప్పుడు సమాచార కట్టడి) నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ వీడియో ప్రజలను మభ్యపెట్టేలా ఉందని తేలింది. అయితే ఈ ఘటన గ్వాటేమాల దేశంలోని 'రియో బ్రావో'లో నాలుగేళ్ల క్రితం (2015 మే) చోటుచేసుకొంది. ఓ ట్యాక్సీ డ్రైవర్ హత్యలో 16 ఏళ్ల అమ్మాయి ప్రమేయం ఉన్న కారణంగా కొంతమంది ఆమెను కొట్టి తగలబెట్టారు. -
‘ఇంట్లో చొరబడి.. నా కూతురిని లాక్కెళ్లిపోయారు’
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో ఇద్దరు హిందూ బాలికల కిడ్నాప్, మత మార్పిడి వివాదం కొనసాగుతుండగానే మరో హిందూ బాలిక అపహరణ కలకలం రేపుతోంది. పాక్‌లోని ఘోట్కికి చెందిన ఓ హిందూ వ్యక్తి తన కూతురుని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మార్చి 16న నలుగురు వ్యక్తులు అర్ధరాత్రి తమ ఇంట్లో చొరబడ్డారని, 16 ఏళ్ల తన కూతురిని లాక్కెళ్లిపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బయట పార్కు చేసి ఉన్న వాహనంలో ఆమెను ఎక్కించుకుని ఎక్కడికో తీసుకెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ విషయంపై స్పందించిన సింధ్ ప్రావిన్స్ మైనార్టీ వ్యవహారాల మంత్రి హరి రామ్ కిషోరి లాల్.. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని పేర్కొన్నారు. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. కాగా పాక్‌లోని ఘోట్కి జిల్లాలో హోలీ సందర్భంగా రవీనా (13), రీనా (15) అనే హిందు బాలికలను ఇంటి నుంచి అపహరించిన కొందరు.. తర్వాత వారికి ఓ ముస్లిం మత గురువు చేతుల మీదుగా మత మార్పిడి చేసి నిఖా నిర్వహించిన వీడియో ఆ దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో ఆందోళనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ నిర్వహించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఆదేశించారు. పూర్తి వివరాలను బయటపెట్టాల్సిందిగా సింధ్, పంజాబ్ ప్రభుత్వాలను ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ ఘటన గురించి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, పాక్ మంత్రి ఫవాద్ చౌద్రీల మధ్య ఆదివారం ట్విటర్లో మాటల యుద్ధం జరిగింది. ఫవాద్ చౌద్రీ స్పందిస్తూ.. ‘ఇది పాక్ అంతర్గత విషయం. మైనారిటీలను అణచివేయడానికి ఇదేం భారత్‌లోని మోదీ ప్రభుత్వం కాదు. ఇది ఇమ్రాన్‌ఖాన్ పాలనలోని కొత్త పాక్. మా జెండాలోని తెల్లరంగులా మేము వారిని సమానంగా చూసుకుంటాం. ఇదే శ్రద్ధని భారత్‌లోని మైనారిటీల విషయంలోనూ చూపిస్తారని ఆశిస్తున్నాం.’అని ట్వీట్ చేశారు. దీనికి ప్రతిగా సుష్మ స్పందిస్తూ.. ‘ఈ విషాదకర ఘటనపై మీ స్పందన చూస్తుంటే మీలోని దోషపూరిత మనస్తత్వాన్ని బయటపెడుతోంది..’అని ట్వీట్లో బదులిచ్చారు. Forced conversion of Hindu girls in Pakistan : The age of the girls is not disputed. Raveena is only 13 and Reena is 15 years old. /1 — Chowkidar Sushma Swaraj (@SushmaSwaraj) March 26, 2019 Even the Prime Minister on Naya Pakistan will not believe that girls of this tender age can voluntarily decide about their conversion to another religion and marriage. /2 — Chowkidar Sushma Swaraj (@SushmaSwaraj) March 26, 2019 Justice demands that both these girls should be restored to their family immediately. /3 — Chowkidar Sushma Swaraj (@SushmaSwaraj) March 26, 2019 -
మత మార్పిడికి విముఖత: కోడలిపై ఘాతుకం
సాక్షి, రాంచీ: జార్ఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇస్లాం మతం స్వీకరించేందుకు నిరాకరించిన హిందూ యువతిపై స్వయాన మామ, బంధువులు లైంగికదాడి చేసి హతమార్చారు.రామ్‌గర్ జిల్లాలో దాదాపు నెలరోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నవంబర్ 6 నుంచి అదృశ్యమైన బాధితురాలి మృతదేహాన్ని గర్నా నది ఒడ్డున కనుగొన్నారు. పోస్ట్‌మార్టమ్ నివేదికలో బాధితురాలిని హత్య చేసే ముందు ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని వెల్లడైంది. యువతి ప్రేమికుడు అదిల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడి నుంచి పలు వివరాలు రాబట్టారు. గత నెలలో తల్లితండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా బాధిత యువతి అదిల్‌ను వివాహం చేసుకుంది. అనంతరం బొకారోలోని అదిల్ అంకుల్ ఇంటికి కొత్త దంపతులు చేరుకున్నారు. దీంతో ఆయన అదిల్ తండ్రికి సమాచారం అందించి అక్కడికి రప్పించారు. యువతి వేరే మతస్థురాలు కావడంతో తొలుత ఇస్లాం మతం స్వీకరించాలని వారు ఆమెకు నచ్చచెప్పారు. అయితే వారి డిమాండ్‌ను ఆమె తోసిపుచ్చింది. దీంతో వారిద్దరినీ రాంచీలో కలిసిఉండేలా చూస్తామని దగ్గరలోని రైల్వే స్టేషనకు తీసుకువెళతామంటూ అదిల్ తండ్రి, అంకుల్ నమ్మబలికి సమీప అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. అక్కడి నిర్మానుష్య ప్రాంతంలో బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడి, హత్య చేసి పొదల్లో పడవేశారు. ఈ దారుణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తనను చెట్టుకు కట్టేశారని అదిల్ చెప్పాడు. ఈ ఘటనపై హిందూ సంస్థలు భగ్గుమన్నాయి. ఇది లవ్‌జిహాద్ కేసుగా పేర్కొంటూ నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశాయి. -
పాక్‌లో హిందూ బాలికపై దారుణం
కరాచీ : పాకిస్తాన్‌లోని హిందువులపై అకృత్యాలు మరింత పెరుగుతున్నాయి. తాజాగా సింధ్ ప్రావిన్స్‌లోని థార్‌లో గ్రామంలో నివాసముంటున్న ఒక హిందూ బాలికను ముగ్గురు సాయుధులైన ముస్లింలు అపహరించారు. అనంతరం బలవంతపు మత మార్పిడి చేసి.. వివాహం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పాకిస్తాన్‌లోని డాన్ పత్రిక ఈ వార్తను ప్రచురించింది. ఈ ఘటనపై బాలిక తండ్రి హీరో మేఘవార్.. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని డాన్ తెలిపింది. రెండు రోజులు కిందట ముగ్గురు సాయుధలైన వ్యక్తులు తమ ఇంటిలోని ప్రవేశించి.. అందరినీ బంధించినట్లు మేఘవార్ చెప్పారు. అనంతరం మైనర్ కుమార్తె (14 సంవత్సరాలు)ను వారు ఎత్తుకెళ్లినట్లు ఆయన తెలిపారు. ఈ విషయంపై స్థానిక నేతలను, పోలీసులను సంప్రదించినా ఎవరినుంచి స్పందన రాలేదని ఆయన చెప్పారు. చివరగా నసీర్ లుంజో అంనే వ్యక్తి.. తమ కుమార్తెను బలవంతపు మతమార్పిడి చేసి వివాహం చేసుకున్నట్లు తెలిసిందని అన్నారు. స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడంతో.. మేఘవార్ సింథ్ ఎస్ఎస్పీ అధికారిని కలిశారు. ఈ ఘటనపై వెంటనే ఆయన స్పందించి.. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు.. బాలికను వెతికించే ప్రయత్నం మొదలు పెట్టారు. ఇదిలా ఉండగా.. బాలిక మతమార్పిడికి సంబంధించిన సర్టిఫికెట్ ఒకటి పోలీసులకు అందిందని తెలిసింది. దీనిపై మేఘవార్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పెళ్లిని వ్యతిరేకిస్తూ సింధ్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును సింధ్ హైకోర్టు జనవరి17న విచారించనుంది. -
ఉల్టా లవ్ జీహాద్
సాక్షి, జోధ్‌పూర్ : రాజస్థాన్‌లో లవ్ జీహాద్ కాస్త వికటించింది. ముస్లిం అబ్బాయి హిందూ మతంలోకి మారితేనే పెళ్లి చేసుకుంటానని యువతి పూజా జోషి స్పష్టం చేసింది. పూజా జోషి నిర్ణయంతో ప్రియుడు మోహిసన్ ఖాన్.. పెళ్లికి నిరాకరించాడు.. ఈ ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జరిగింది. ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్న మోహిసిన్ ఖాన్‌ను 20 ఏళ్ల పూజా జోషిని ప్రేమించాడు. అతని ప్రేమకు పూజా కూడా అంగీకరించింది. ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే ఇద్దరూ ఈ నెల 28న ఇంటి నుంచి బయటకు వెళ్లి వివాహం చేసుకోవాలనుకున్నారు. పూజా జోషి కనిపించకపోవడంతో.. ఆమె తల్లిదండ్రులు జోధ్‌పూర్ పోలీస్ స్టేషన్ మిస్సింగ్ కేసు పెట్టారు. ఇదిలా ఉండగా.. ప్రేమికులిద్దరినీ పోలీసులు బికనీర్‌లో అదుపులోకి తీసుకుని జోధ్‌పూర్ తరలించారు. పోలీసుల వీరిద్దరిరని విచారిస్తున్న తరుణంలో లవ్ జీహాద్ గురించి పట్టణమంతా పాకిపోయింది. భారీగా హిందువులు పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. స్టేషన్ బయట పెద్ద వివాదం జరుగుతున్న సమయంలో.. మోహిసన్ ఖాన్ హిందూ మతంలోకి మారితేనే పెళ్లి చేసుకుంటానని పోలీసులకు తెలిపారు. ప్రియుడు మతం మార్చుకునేదాకా ఎదురు చూస్తానని లేదంటే వేరే వివాహం చేసుకుంటానని పూజా ప్రకటించడంతో వివాదం సద్దు మణిగింది. -
జార్ఖండ్‌లో దారుణం: ముస్లిం యువకుడి హత్య
జార్ఖండ్: జార్ఖండ్ లో దారుణం జరిగింది. హిందూ అమ్మాయిని ప్రేమించాడన్నకారణంతో ముస్లిం యువకుడ్ని(20) అమానుషంగా కొట్టి చంపిన ఘటన ఆందోళన రేపింది. గుమ్లా జిల్లాలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ముస్లిం యువకుడు మహమ్మద్ షకీల్, హిందూ యువతి సోసో గత ఏడాదికాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ వ్యవహారాన్ని గమనించిన అమ్మాయి కుటుంబ సభ్యులు ఆమెనుండి దూరంగా ఉండాలని హెచ్చరించారు. అయితే శ్రీరామనవమి సందర్భంగా వీరిద్దరు కలుసుకున్నారు. అనంతరం అమ్మాయిని ఇంటి దగ్గర దించడానికి వెళ్లినపుడు బంధువుల కట్టపడ్డాడు షకీల్ అంతే ఆగ్రహంతో ఊగిపోయిన కుటుంబ సభ్యులు, స్థానికులు సామూహికంగా అతనిపై దాడికి దిగారు. అమ్మాయి కళ్లముందే అతణ్ని చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. గంటల తరబడి హింసించారు. అయితే షాలిక్ ఇంటికి రాకపోవడంతో ఆరా తీసిన కుటుంబ సభ్యులు తీవ్ర గాయాలతో పడివుండడం గమనించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి షాలిక్ కన్నుమూశాడు.. ఈ ఘటనలో ముగ్గుర్ని పోలీసులు అదుపులోకి తీసుకొన్నామని ఎస్పీ చందన్ కుమార్ ఝా తెలిపారు. విచారణలో అమ్మాయి అందించిన సమాచారం ఆధారంగా ముగ్గుర్ని అరెస్టు చేసి జైలుకు పంపామని చెప్పారు. దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. -
యువతితో మాట్లాడాడని స్తంభానికి కట్టేసి..
మంగళూరు: సహచర ఉద్యోగినితో మాట్లాడాడనే కారణంతో ఓ ముస్లిం వ్యక్తిని చితకబాదిన ఘటన కర్ణాటకలోని మంగళూరులో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి మొత్తం 13మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కొంతమంది భజరంగ్ దళ్ కార్యకర్తలు ఉన్నారు. పోలీసుల వివరాల ప్రకారం 29 ఏళ్ల ముస్లిం వ్యక్తి ఓ హిందూ యువతితో కారులో ఉండగా ఒక్కసారిగా ఓ గుంపు అతడిపై దాడి చేసింది. బట్టలూడదీసి కొట్టడమే కాకుండా వీధుల వెంట పరుగెత్తించారు. అనంతరం ఓ విద్యుత్ స్తంభానికి కట్టేసి దాదాపు గంట సేపు పిడిగుద్దులు గుప్పించారు. దీనికి సంబంధించిన ఫొటోలు స్థానిక టీవీ చానెల్లలో, వాట్సాప్‌లో హల్ చల్ రేపడంతో పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. అయితే, బాధితుడు మాత్రం తాను.. ఆ యువతి ఒక మాల్ లో పనిచేస్తున్నామని, ఆమె లోన్ కట్టేందుకు డబ్బులు అవసరం ఉన్నాయని అడగడంతో ఇచ్చేందుకు ఏటీఎం వద్దకు కారులో వెళ్లానని ఇంతలోనే వారు వచ్చి దాడి చేశారని తెలిపాడు. ఈ విషయంలో ఆ అమ్మాయి జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించినా ఆమెను కూడా తిట్టారని, ఆమె మాటలు పట్టించుకోలేదని వివరించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.