ఉల్టా లవ్‌ జీహాద్‌ | Hindu girl wants told Muslim lover to convert for marriage | Sakshi
Sakshi News home page

ఉల్టా లవ్‌ జీహాద్‌

Published Thu, Nov 30 2017 12:17 PM | Last Updated on Thu, Nov 30 2017 12:17 PM

Hindu girl wants told Muslim lover to convert for marriage - Sakshi

సాక్షి, జోధ్‌పూర్‌ : రాజస్థాన్‌లో లవ్‌ జీహాద్‌ కాస్త వికటించింది. ముస్లిం అబ్బాయి హిందూ మతంలోకి మారితేనే పెళ్లి చేసుకుంటానని యువతి పూజా జోషి స్పష్టం చేసింది. పూజా జోషి నిర్ణయంతో ప్రియుడు మోహిసన్‌ ఖాన్‌.. పెళ్లికి నిరాకరించాడు.. ఈ ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జరిగింది.

ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్న మోహిసిన్‌ ఖాన్‌ను 20 ఏళ్ల పూజా జోషిని ప్రేమించాడు. అతని ప్రేమకు పూజా కూడా అంగీకరించింది. ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే ఇద్దరూ ఈ నెల 28న ఇంటి నుంచి బయటకు వెళ్లి వివాహం చేసుకోవాలనుకున్నారు. పూజా జోషి కనిపించకపోవడంతో.. ఆమె తల్లిదండ్రులు జోధ్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ మిస్సింగ్‌ కేసు పెట్టారు.

ఇదిలా ఉండగా.. ప్రేమికులిద్దరినీ పోలీసులు బికనీర్‌లో అదుపులోకి తీసుకుని జోధ్‌పూర్‌ తరలించారు. పోలీసుల వీరిద్దరిరని విచారిస్తున్న తరుణంలో లవ్‌ జీహాద్‌ గురించి పట్టణమంతా పాకిపోయింది. భారీగా హిందువులు పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు.

స్టేషన్‌ బయట పెద్ద వివాదం జరుగుతున్న సమయంలో.. మోహిసన్‌ ఖాన్‌ హిందూ మతంలోకి మారితేనే పెళ్లి చేసుకుంటానని పోలీసులకు తెలిపారు. ప్రియుడు మతం మార్చుకునేదాకా ఎదురు చూస్తానని లేదంటే వేరే వివాహం చేసుకుంటానని పూజా ప్రకటించడంతో వివాదం సద్దు మణిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement