converts
-
మీ పాత టీవీని స్మార్ట్‌టీవీగా ఇలా మార్చేయండి....!
ప్రస్తుత కాలంలో టీవీలు లేని ఇళ్లు ఉన్నాయంటే చాలా అరుదు. పెరుగుతున్న సాంకేతికతో పాటుగా టీవీల పరిణామ క్రమంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. పిక్చర్‌ట్యూబ్ టీవీల నుంచి స్మార్ట్‌టీవీల వరకు టీవీల పరిణామ క్రమం ఎదిగింది. ప్రస్తుతం స్మార్ట్‌టీవీల రాకతో అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫాంలో వచ్చే వీడియోలను నేరుగా టీవీల్లో పెద్ద స్క్రీన్‌పై చూడవచ్చును. ఈ ఫీచర్ కేవలం స్మార్ట్ టీవీలకు మాత్రమే వర్తిస్తుంది. ఓటీటీ ప్లాట్‌ఫాం వీడియోలను కేవలం స్మార్ట్ టీవీల్లో చూడగల్గుతాం అనుకుంటే మీరు పొరపడినట్లే..! మీ ఇంట్లోని పాత ఎల్ఈడీ లేదా ఎల్సీడీ టీవీలను కొన్ని ప్రత్యేకమైన గాడ్జెట్లను ఉపయోగించి స్మార్ట్‌టీవీగా తయారుచేయవచ్చును. ప్రస్తుతం మీ ఇంట్లోని టీవీలకు హెచ్డీఎమ్ఐ పోర్ట్ ఉన్నట్లయితే స్మార్ట్ టీవీలుగా ఇట్టే మార్చేయచ్చు. దాంతో పాటుగా ఇంట్లో వై-ఫై కనెక్టివీటి కూడా అవసరం. మీ పాత టీవీని స్మార్ట్ టీవీగా మార్చేందుకు మార్కెట్లో పలు రకాల గాడ్జెట్స్ అందుబాటులో ఉన్నాయి. 1. అమెజాన్ ఫైర్ స్టిక్ అమెజాన్ ఫైర్ స్టిక్‌తో మీ పాత టీవీలను స్మార్ట్ టీవీలుగా మార్చవచ్చును. అలెక్సానుపయోగించి వాయిస్ కంట్రోల్ ద్వారా ఓటీటీ యాప్‌లను ఇట్టే పొందవచ్చును. ఫైర్ స్టిక్‌ను హెచ్డీఎమ్ఐ పోర్ట్‌లో ఉంచి వైఫైకు కనెక్ట్ చేయాలి. దీని ధర రూ. 3,999. 2. టాటా స్కై బింజీ+ టాటా స్కై బింజీ సెటప్ బాక్స్‌తో పాత టీవీను స్మార్ట్ టీవీలుగా మార్చవచ్చును. టాటా స్కై బింజీ+ తో వినియోగదారులు తమ ల్యాప్‌టాప్, టాబ్లెట్ లేదా మొబైల్ ఫోన్లో ప్లే చేసే వీడియోలను టీవీలో చూడవచ్చును. టాటా స్కై బింజీ+లో క్రోమ్‌కాస్ట్ ఫీచరును ఏర్పాటు చేశారు. హెచ్డీఎమ్ఐ పోర్ట్‌తో స్మార్ట్ టీవీగా చేయవచ్చును. దీని ధర రూ. 3,999. 3. షావోమీ ఎమ్ఐ బాక్స్ 4కే షావోమీ ఎమ్ఐ బాక్స్ 4కే బాక్స్‌తో మీ పాత టీవీని స్మార్ట్‌టీవీగా మార్చవచ్చు. అంతేకాకుండా ఈ గాడ్జెట్‌తో గూగుల్ ప్లే స్టోర్ యాప్‌లను కూడా యాక్సెస్ చేయవచ్చును. డాల్బీ అట్మోస్‌ను సపోర్ట్ చేస్తుంది. వాయిస్ ఆదేశాలను ఉపయోగించి ఎమ్ఐ బాక్స్ 4కే ను నియంత్రించవచ్చు. ఈ పరికరం హెచ్డీఎమ్ఐ, యూఎస్బీ 2.0, బ్లూటూత్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని ధర రూ. 3,499. 4.యాక్ట్ స్ట్రీమ్ టీవీ 4 కే బాక్స్ యాక్ట్ ఫైబర్‌నెట్‌కు చెందిన యాక్ట్ స్ట్రీమ్ టీవీ 4కే బాక్స్‌తో ఏ రకమైన ఎల్ఈడీ టీవీలను స్మార్ట్ టీవీగా చేయవచ్చును. ఈ గాడ్జెట్‌లో సుమారు 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందిస్తోంది. దీని ధర రూ. 4,499. 5. ఎయిర్ టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ఎయిర్ టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టమ్‌ను కల్గి ఉంది. గూగుల్ అసిస్టెంట్ ఉండడటంతో వాయిస్ కమాండ్స్‌తో కంట్రోల్ చేయవచ్చును దీని ధర రూ. 3,999. -
ఉల్టా లవ్ జీహాద్
సాక్షి, జోధ్‌పూర్ : రాజస్థాన్‌లో లవ్ జీహాద్ కాస్త వికటించింది. ముస్లిం అబ్బాయి హిందూ మతంలోకి మారితేనే పెళ్లి చేసుకుంటానని యువతి పూజా జోషి స్పష్టం చేసింది. పూజా జోషి నిర్ణయంతో ప్రియుడు మోహిసన్ ఖాన్.. పెళ్లికి నిరాకరించాడు.. ఈ ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జరిగింది. ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్న మోహిసిన్ ఖాన్‌ను 20 ఏళ్ల పూజా జోషిని ప్రేమించాడు. అతని ప్రేమకు పూజా కూడా అంగీకరించింది. ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే ఇద్దరూ ఈ నెల 28న ఇంటి నుంచి బయటకు వెళ్లి వివాహం చేసుకోవాలనుకున్నారు. పూజా జోషి కనిపించకపోవడంతో.. ఆమె తల్లిదండ్రులు జోధ్‌పూర్ పోలీస్ స్టేషన్ మిస్సింగ్ కేసు పెట్టారు. ఇదిలా ఉండగా.. ప్రేమికులిద్దరినీ పోలీసులు బికనీర్‌లో అదుపులోకి తీసుకుని జోధ్‌పూర్ తరలించారు. పోలీసుల వీరిద్దరిరని విచారిస్తున్న తరుణంలో లవ్ జీహాద్ గురించి పట్టణమంతా పాకిపోయింది. భారీగా హిందువులు పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. స్టేషన్ బయట పెద్ద వివాదం జరుగుతున్న సమయంలో.. మోహిసన్ ఖాన్ హిందూ మతంలోకి మారితేనే పెళ్లి చేసుకుంటానని పోలీసులకు తెలిపారు. ప్రియుడు మతం మార్చుకునేదాకా ఎదురు చూస్తానని లేదంటే వేరే వివాహం చేసుకుంటానని పూజా ప్రకటించడంతో వివాదం సద్దు మణిగింది. -
ఇండియాలో పదిహేను వందలే... చైనాలో పదివేలు!
టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో సినిమాను తీయడం ముఖ్యం కాదు... హై స్టాండర్డ్ టెక్నికల్ మూవీని ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా విడుదల చేయడం ఇంపార్టెంట్! రజనీకాంత్ ‘2.0’ (‘రోబో’ సీక్వెల్) టీమ్ దీనిపైనే దృష్టి పెట్టింది. శంకర్ దర్శకత్వంలో సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. కంప్లీట్ సిన్మాను త్రీడీలో తీశారు. ప్రేక్షకులు కూడా త్రీడీలో సిన్మాను చూసినప్పుడే అసలైన మజా. కానీ, ఇండియాలో త్రీడీ స్క్రీన్లు (థియేటర్లు) పదిహేను వందలలోపే ఉన్నాయి. అందుకే వచ్చే ఏడాది జనవరి 25న ‘2.0’ రిలీ జయ్యే టైమ్‌కి వీలైనన్ని థియేటర్లను త్రీడీ స్క్రీన్లుగా కన్వర్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం చెన్నైలో తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లతో ‘2.0 త్రీడీ డిజిటల్ మీట్’ ఏర్పాటు చేశారు. లైకా ప్రొడక్షన్స్ క్రియేటివ్ హెడ్ రాజు మహాలింగం మాట్లాడుతూ – ‘‘మన దేశంలో 1500 త్రీడీ స్క్రీన్లు మాత్రమే ఉన్నాయి. చైనాలో పదివేలు ఉన్నాయి. ‘2.0’ రిలీజ్ టైమ్‌కి వీలైనన్ని థియేటర్లను త్రీడీ ప్రొజెక్షన్‌కు అనువుగా మార్చాలనుకుంటున్నాం. చైనాలోనూ సినిమాను రిలీజ్ చేయడానికి అక్కడ డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడుతున్నాం’’ అన్నారు. ‘‘తమిళనాడులో 300 థియేటర్లను ‘2.0’ టైమ్‌కి త్రీడీలోకి కన్వర్ట్ చేస్తాం’’ అన్నారు డిస్ట్రిబ్యూటర్ సుబ్రమణియమ్.