జార్ఖండ్‌లో దారుణం: ముస్లిం యువకుడి హత్య | Muslim Man Killed In Jharkhand Allegedly Over 'Affair' With Hindu Girl | Sakshi
Sakshi News home page

జార్ఖండ్‌లో దారుణం: ముస్లిం యువకుడి హత్య

Published Sat, Apr 8 2017 9:49 AM | Last Updated on Tue, Sep 5 2017 8:17 AM

జార్ఖండ్‌లో దారుణం: ముస్లిం యువకుడి హత్య

జార్ఖండ్‌లో దారుణం: ముస్లిం యువకుడి హత్య

జార‍్ఖండ్‌:  జార్ఖండ్‌ లో దారుణం  జరిగింది. హిందూ అమ్మాయిని ప్రేమించాడన్నకారణంతో  ముస్లిం యువకుడ్ని(20)  అమానుషంగా  కొట్టి చంపిన ఘటన ఆందోళన రేపింది. గుమ్లా జిల్లాలో ఈ ఉదంతం చోటు చేసుకుంది.  

పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ముస్లిం యువకుడు మహమ్మద్‌ షకీల్‌, హిందూ యువతి సోసో  గత ఏడాదికాలంగా  ప్రేమించుకుంటున్నారు.  ఈ వ్యవహారాన్ని గమనించిన అమ్మాయి కుటుంబ సభ్యులు  ఆమెనుండి దూరంగా ఉండాలని  హెచ్చరించారు. అయితే శ్రీరామనవమి సందర్భంగా వీరిద్దరు  కలుసుకున్నారు. అనంతరం అమ్మాయిని ఇంటి దగ్గర దించడానికి వెళ్లినపుడు బంధువుల కట్టపడ్డాడు షకీల్‌  అంతే  ఆగ్రహంతో ఊగిపోయిన  కుటుంబ  సభ్యులు,  స్థానికులు  సామూహికంగా అతనిపై దాడికి  దిగారు. అమ్మాయి కళ్లముందే అతణ్ని  చెట్టుకు కట్టేసి   తీవ్రంగా కొట్టారు.  గంటల తరబడి హింసించారు.

అయితే షాలిక్‌ ఇంటికి రాకపోవడంతో ఆరా తీసిన కుటుంబ సభ్యులు  తీవ్ర గాయాలతో పడివుండడం గమనించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి షాలిక్‌ కన్నుమూశాడు.. ఈ ఘటనలో ముగ్గుర్ని  పోలీసులు అదుపులోకి తీసుకొన్నామని ఎస్‌పీ  చందన్‌ కుమార్‌ ఝా తెలిపారు. విచారణలో అమ్మాయి అందించిన సమాచారం ఆధారంగా ముగ్గుర్ని అరెస్టు చేసి జైలుకు పంపామని  చెప్పారు.  దర్యాప్తు  కొనసాగుతోందని తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement