మధ్యప్రదేశ్: బతికుండగానే కన్నకూతురికి అంతిమ సంస్కారాలు చేశారు తల్లిదండ్రులు. ఇతర మతస్థుడిని వివాహమాడిందనే కోపంతో కూతురికి పిండ ప్రదానం చేశారు. ఈ ఘటన మధ్యపదేశ్‌లోని జబల్‌పూర్‌లో జరిగింది.
అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురికి వివాహం చేసి అత్తారింటికి పంపించాలనుకున్నారు. కానీ వారి కలలేవీ ఆ కూతురు నెరవేర్చలేదు. ఇతర మతస్థుడిని వివాహమాడింది. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు బిడ్డ చనిపోయిందనుకున్నారు. నర్మదా నది ఒడ్డున ఏకంగా అంతమ సంస్కారాలు కూడా చేశారు.
జబల్‌పూర్‌కు చెందిన అనామిక దూబె ఇతర మతస్థుడిని వివాహమాడింది. అడ్డగించిన బంధువులతో గొడవపడింది. న్యాయస్థానాన్ని సంప్రదించి జూన్ 7న ముస్లిం సంప్రదాయాల ప్రకారం ఆమె వివాహం జరిగింది. తల్లిదండ్రులు పెట్టిన పేరును మార్చి ఉజ్మ ఫాతిమాగా పేరు పెట్టుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు బిడ్డను వదిలేశారు. నర్మదా నది ఒడ్డున ఆదివారం రోజున గౌరీ ఘాట్‌లో కూతురుకి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. పిండప్రదానం చేసి నదిలో కలిపేశారు. ఇలాంటి రోజు చూడాల్సి వస్తుందని తాను అనుకోలేదని అనామిక సోదరుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇదీ చదవండి:ప్రేమపెళ్లి చేసుకున్నారని.. ఆ గుడిలో ఏం చేశారంటే!
Comments
Please login to add a commentAdd a comment