ప్రతీకాత్మక చిత్రం (ఏఎన్‌ఐ ఫొటో)
తిరువనంతపురం: మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే అరుదైన ఉదంతానికి కేరళ వేదికగా నిలిచింది. ఓ ముస్లిం జంట హిందూ యువతికి వివాహం జరిపించి మతం కంటే మానవత్వమే గొప్పదని చాటి చెప్పారు. కాసరగడ్‌లోని భగవతి ఆలయంలో ఆదివారం ఈ వివాహం జరిగింది. (చదవండి: ఇన్ని లక్షణాలున్న వధువు దొరికేనా..!)
తల్లిదండ్రులు మరణించడంతో రాజేశ్వరి అనే బాలికను అబ్దుల్లా, ఖదీజా దంపతులు పెంచుకున్నారు. రాజేశ్వరి తండ్రి వీరివద్ద పనిచేసేవాడు. రాజేశ్వరి చిన్నప్పుడే తల్లిదండ్రులు మరణించడంతో ఆమెను అబ్దుల్లా, ఖదీజా దంపతులు చేరదీశారు. తమ ముగ్గురు కుమారులు షమీమ్, నజీబ్, షరీఫ్‌లతో పాటు రాజేశ్వరిని పెంచి పెద్ద చేశారు. విష్ణుప్రసాద్ అనే యువకుడితో ఆదివారం వైభవంగా పెళ్లి జరిపించారు. ఈ వేడుకకు హిందూ, ముస్లిం మతాలకు చెందిన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హాజరుకావడం విశేషం.
కాగా, మత సామరస్యానికి అద్దం పట్టే మరో ఘటన గత నెలలోనూ చోటుచేసుకుంది. మతపరమైన అడ్డంకులను అధిగమించి కాయంకుళంలోని మసీదు.. హిందూ వివాహ వేడుకకు వేదికగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. (చదవండి: కాశీ మహాల్ ఎక్స్‌ప్రెస్‌లో ఆశ్చర్యకర ఘటన)
Comments
Please login to add a commentAdd a comment