శ్రద్ధాదాస్. ఎంతో శ్రద్ధగా చేసిన బొమ్మలా ఉంటుందీ ముద్దుగుమ్మ. నటించిన సినిమాలు తక్కువే అయినా వచ్చిన గుర్తింపు ఎక్కువ. ముంబైలో పుట్టిన ఈ బెంగాలీ అమ్మాయి హైదరాబాదే తన హోం సిటీ అని చెబుతుంది. సోమాజిగూడ హరిత ప్లాజాలో ఫ్రీడమ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ నిర్వహించిన ‘బయ్ జార్ గెట్ కార్’ కార్యక్రమంలో పాల్గొని విజేతకు కారును అందించింది. ఈ సందర్భంగా సిటీప్లస్‌తో ముచ్చటించింది. ఆ వివరాలు...
..:: శిరీష చల్లపల్లి
నేను బెంగాలీ... కానీ పుట్టి పెరిగిందంతా ముంబైలోనే. నా చదువంతా అక్కడే కొనసాగింది. యూనివర్సిటీ ఆఫ్ ముంబైలో మాస్ మీడియా అండ్ జర్నలిజం చేశాను. అయితే సీరియస్ జర్నలిజం కంటే లైఫ్‌స్టైల్, ఫ్యాషన్ రిలేటెడ్ అంశాలపైనే నాకు ఎక్కువ ఆసక్తి ఉండేది. అదే మోడలింగ్ వైపు దృష్టి సారించేలా చేసింది. డిగ్రీ చదివేటప్పుడు థియేటర్ వర్క్‌షాప్స్‌లో పాల్గొనేదాన్ని. ఆ అనుభవం నేను మోడలింగ్‌లో రాణించేందుకు ఉపయోగపడింది. అలా యాడ్ ఫిల్మ్స్ అవకాశాలు రావడం మొదలైంది.
మూడు భాషలతో బిజీ...
‘సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టాను. ఆ సినిమా పెద్ద గుర్తింపు తెచ్చిపెట్టకపోయినా.. సంవత్సరంలోపే ఐదు సినిమాల ఆఫర్లు వచ్చాయి. ఇక ఆర్య-2, డార్లింగ్, నాగవల్లి, మొగుడు సినిమాల్లో నేను చేసిన రోల్స్ నాకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం తెలుగు, కన్నడ, హిందీ సినిమాలతో బిజీగా ఉన్నా.
ఐ లవ్ దిస్...
నా మొదటి సినిమా షూటింగ్ కోసమే మొట్టమొదటిసారి హైదరాబాద్‌లో అడుగుపెట్టాను. ఇక్కడి స్టూడియోస్‌లో చాలా నెలలు గడిపాను. అందుకే సొంత రాష్ట్రం బెంగాల్, పుట్టి పెరిగిన ముంబై కంటే నాకు కెరీర్ ఇచ్చిన హైదరాబాద్ అంటే నాకు చెప్పలేనంత ఇష్టం. సీఫుడ్ ప్రత్యేకించి రొయ్యలు అంటే ఇష్టపడే నేను ఇక్కడి బిర్యానీ రుచి చూశాక దానికి ఫిదా అయిపోయాను. హైదరాబాదేనా ఫస్ట్‌హోం. ఈ నగరానికి నేను రుణపడి ఉంటాను. వేరే నగరాలతో పోలిస్తే ఇక్కడ జెన్యూన్‌నెస్ ఎక్కువ. మోసాలు తక్కువ. హైదరాబాద్‌కో ప్రత్యేక కల్చర్ ఉంది. ఐలవ్ దిస్!
శ్రద్ధా FROM బెంగాల్
Published Thu, Feb 12 2015 12:08 AM | Last Updated on Thu, Aug 9 2018 7:28 PM
Advertisement