Bengali girl
-
రెండు అద్దె కంప్యూటర్లతో రూ.100 కోట్ల వ్యాపారం!
ఆమె ఐఐటీ, ఐఐఎంలలో చదువుకోలేదు.. ఉన్నత స్థాయి సంపన్న కుటుంబం నుంచి రాలేదు.. తండ్రి పేద్ద వ్యాపారవేత్తేమీ కాదు.. అయినా ఆమె ఓ కంపెనీ స్థాపించి విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగింది. ఆ యువతి స్ఫూర్తివంతమైన కథ మీ కోసం... ఇదీ చదవండి: Kresha Gupta: రూ.100 కోట్ల ఫండ్.. స్టాక్ మార్కెట్ యువ సంచలనం ఈమె! అంకితా నంది.. కోల్‌కతాకు చెందిన కంపెనీ టయర్ 5 టెక్నాలజీ సొల్యూషన్స్ వ్యవస్థాపకురాలు, మేనేజింగ్ డైరెక్టర్. తన భర్తతో కలిసి 2015లో ఈ కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ వ్యాపార సంస్థల కోసం కావాల్సిన సాంకేతిక ఆవిష్కరణలు, ఉత్పత్తులు అందిస్తుంది. ఈ కంపెనీకి ప్రస్తుతం కోల్‌కతాలోని సాల్ట్ లేక్‌లో వందలాది మంది ఉద్యోగులతో కార్యాలయం ఉంది. ఆసక్తికర నేపథ్యం అంకితా నంది బెంగాల్‌లోని బుర్ద్వాన్ జిల్లాకు చెందినవారు. ఆమెది మధ్యతరగతి కుటుంబం. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. పాఠశాల విద్యాభ్యాసం బెంగాలీ మీడియంలోనే పూర్తయింది. చిన్నతనం నుంచే సొంతంగా కంపెనీ పెట్టాలని కలలు కన్న ఆమె కాలేజీలో చదువుతున్నప్పడే సాఫ్ట్వేర్ తయారు చేయడం ప్రారంభించింది. ఆమె చదివింది స్థానికంగా ఉన్న ఇంజినీరింగ్ కళాశాలలోనే. ఆమె తన స్నేహితులతో కలిసి ఆండ్రాయిడ్ అప్లికేషన్లను తయారు చేసి విక్రయించేవారు. వ్యాపారవేత్త కావాలనే ఆలోచన ఆమెకు అలా వచ్చిందే. అంకితా నందికి ఓ డేటింగ్ యాప్ ద్వారా అమెరికాకు చెందిన జోన్ వాన్తో పరిచయం ఏర్పడింది. ఆయన ఫ్లోరిడాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇద్దరూ 2021లో వివాహం చేసుకున్నారు. అయితే 2015లోనే వీరిద్దరూ కలిసి టయర్ 5 టెక్నాలజీ సొల్యూషన్స్ కంపెనీని స్థాపించారు. 2021లో ఈ కంపెనీ విలువ 12 మిలియన్ డాలర్లు. అది ఇప్పుడు దాదాపు రూ. 100 కోట్లు. రెండు అద్దె కంప్యూటర్లు, ఇద్దరు ఉద్యోగులు అంకితా నంది కేవలం రెండు కంప్యూటర్లతో కంపెనీని ప్రారంభించారు. అవి కూడా అద్దె కంప్యూటర్లు. ప్రారంభంలో కంపెనీలో ఉన్నది ఇద్దరు ఉద్యోగులు మాత్రమే. ఒక డెవలపర్, ఒక హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్. ఈ కంపెనీలో ఇప్పుడు 100 మందికి పైగా ఉద్యోగులు, 1500 మంది కస్టమర్లు ఉన్నారు. కంపెనీ ప్రధాన కార్యాలయం యూఎస్ఏలోని ఇండియానాలో ఉండగా భారత్‌లోని కోల్‌కతాలోనూ కార్యాలయం ఉంది. దాదాపు 25 సాఫ్ట్వేర్ ఉత్పత్తులను కంపెనీ అందిస్తోంది. కంపెనీ కార్పొరేట్ సామాజిక బాధ్యత విభాగానికి అంకితా నంది నాయకత్వం వహిస్తున్నారు. తన ఎనిమిదేళ్ల కెరీర్లో అనేక ప్రశంసలు అందుకున్నారు. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
బెంగాల్ బాలిక కేసులో 9మంది అరెస్టు
విజయవాడ సిటీ : బెంగాలీ బాలికపై లైంగిక దాడి కేసులో తొమ్మిది మంది నిందితులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు కమిషనరేట్ అధికారులు ఓ ప్రకటన జారీ చేశారు. అరెస్టు చేసిన వారిలో హైదరాబాద్ యూసఫ్‌గూడకు చెందిన తిర్నాతి సురేష్, గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన ఆత్కూరి రామకృష్ణ, జుజ్జులూరి ప్రభాకర రెడ్డి, గుంటూరు జిల్లా రొంపిచర్లకు చెందిన బండి సుబ్బారావు, నర్సరావుపేటకు చెందిన కందుకూరి వీర శంకరాచారి, హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన ఈమని కృష్ణమూర్తి, విజయవాడ వెంకటేశ్వరనగర్ కాలనీకి చెందిన పట్లూరి కృష్ణకిషోర్, శింగరాయకొండకు చెందిన పసుపులేటి రవితేజ, దూడల సాయి శ్రవణ్ ఉన్నారు. నిందితులపై పెనమలూరు పోలీసు స్టేషన్లో సెక్షన్ 376(2)(ఎన్), 376(డి), 366(ఎ), 343 ఐపీసీ, ఫోక్సో 2012 చట్టంలోని సెక్షన్ 6, ఐటిపీ 1956 చట్టంలోని సెక్షన్ 3,4,5,6 క్లాజుల కింద కేసు నమోదు చేశారు. ఇదీ జరిగింది పశ్చిమ బెంగాల్‌కు చెందిన మైనరు బాలిక కుటుంబ ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పోషణ నిమిత్తం స్నేహితురాలితో కలిసి ముంబై వెళ్లింది. ఆమె స్నేహితురాలు గత నెల 14న ముంబై నుంచి విజయవాడకు తీసుకొచ్చి రాంబాబు అనే వ్యక్తికి అప్పగించింది. ఆమెను మురళీనగర్కి చెందిన సురేష్, మరో యువతికి రాంబాబు అప్పగించాడు. ఆమెను వ్యభిచారం చేయమంటూ ఒత్తిడి తేవడంతో పాటు కొందరు విటులతో కలిసి లైంగిక దాడి చేశారు. వీరి హింసలు భరించలేని స్థితిలో ఆమె డయల్ 100కి ఫోన్ చేసింది. దీంతో సురేష్ ఆమెను బస్టాండ్‌కు తీసుకెళ్లి బస్సెక్కించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు వెంబడించడంతో పరారయ్యాడు. బాలిక ద్వారా విషయాలు తెలుసుకున్న పోలీసులు మహిళా పోలీసు స్టేషన్ ఏసీపీ టీఎస్ఆర్కె ప్రసాద్ నేతృత్వంలో విచారణ నిర్వహించి అరెస్టు చేశారు. పోక్సో చట్టం ప్రకారం పోక్సో చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం మైనరు బాలికపై ఏ విధమైన బలవంతపు లైంగిక చర్యలు, దాడులకు పాల్పడినా తీవ్రమైన నేరంగా పరగణించి పదేళ్ల వరకు జైలు శిక్ష లేదా యవజ్జీవ శిక్ష వేసే అవకాశాలు ఉన్నాయి. -
శ్రద్ధా FROM బెంగాల్
శ్రద్ధాదాస్. ఎంతో శ్రద్ధగా చేసిన బొమ్మలా ఉంటుందీ ముద్దుగుమ్మ. నటించిన సినిమాలు తక్కువే అయినా వచ్చిన గుర్తింపు ఎక్కువ. ముంబైలో పుట్టిన ఈ బెంగాలీ అమ్మాయి హైదరాబాదే తన హోం సిటీ అని చెబుతుంది. సోమాజిగూడ హరిత ప్లాజాలో ఫ్రీడమ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ నిర్వహించిన ‘బయ్ జార్ గెట్ కార్’ కార్యక్రమంలో పాల్గొని విజేతకు కారును అందించింది. ఈ సందర్భంగా సిటీప్లస్‌తో ముచ్చటించింది. ఆ వివరాలు... ..:: శిరీష చల్లపల్లి నేను బెంగాలీ... కానీ పుట్టి పెరిగిందంతా ముంబైలోనే. నా చదువంతా అక్కడే కొనసాగింది. యూనివర్సిటీ ఆఫ్ ముంబైలో మాస్ మీడియా అండ్ జర్నలిజం చేశాను. అయితే సీరియస్ జర్నలిజం కంటే లైఫ్‌స్టైల్, ఫ్యాషన్ రిలేటెడ్ అంశాలపైనే నాకు ఎక్కువ ఆసక్తి ఉండేది. అదే మోడలింగ్ వైపు దృష్టి సారించేలా చేసింది. డిగ్రీ చదివేటప్పుడు థియేటర్ వర్క్‌షాప్స్‌లో పాల్గొనేదాన్ని. ఆ అనుభవం నేను మోడలింగ్‌లో రాణించేందుకు ఉపయోగపడింది. అలా యాడ్ ఫిల్మ్స్ అవకాశాలు రావడం మొదలైంది. మూడు భాషలతో బిజీ... ‘సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం’ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టాను. ఆ సినిమా పెద్ద గుర్తింపు తెచ్చిపెట్టకపోయినా.. సంవత్సరంలోపే ఐదు సినిమాల ఆఫర్లు వచ్చాయి. ఇక ఆర్య-2, డార్లింగ్, నాగవల్లి, మొగుడు సినిమాల్లో నేను చేసిన రోల్స్ నాకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం తెలుగు, కన్నడ, హిందీ సినిమాలతో బిజీగా ఉన్నా. ఐ లవ్ దిస్... నా మొదటి సినిమా షూటింగ్ కోసమే మొట్టమొదటిసారి హైదరాబాద్‌లో అడుగుపెట్టాను. ఇక్కడి స్టూడియోస్‌లో చాలా నెలలు గడిపాను. అందుకే సొంత రాష్ట్రం బెంగాల్, పుట్టి పెరిగిన ముంబై కంటే నాకు కెరీర్ ఇచ్చిన హైదరాబాద్ అంటే నాకు చెప్పలేనంత ఇష్టం. సీఫుడ్ ప్రత్యేకించి రొయ్యలు అంటే ఇష్టపడే నేను ఇక్కడి బిర్యానీ రుచి చూశాక దానికి ఫిదా అయిపోయాను. హైదరాబాదేనా ఫస్ట్హోం. ఈ నగరానికి నేను రుణపడి ఉంటాను. వేరే నగరాలతో పోలిస్తే ఇక్కడ జెన్యూన్‌నెస్ ఎక్కువ. మోసాలు తక్కువ. హైదరాబాద్‌కో ప్రత్యేక కల్చర్ ఉంది. ఐలవ్ దిస్! -
కత్తులూ కఠార్లూ నూరుతున్న మిఠాయి!
ఏప్రిల్ 25న దేశం ఒక కొత్త అమ్మాయిని చూడబోతోంది. 21 ఏళ్ల ఆ అందమైన బెంగాలీ అమ్మాయి ‘మిష్తీ’ని వెండితెరపై ‘కాంచీ’గా చూపించబోతున్నది సుప్రసిద్ధ దర్శకుడు సుభాష్ ఘాయ్. అయితే కాంచీని ఆయన అందంగా మాత్రమే చూపించబోవడం లేదు! పరిస్థితులతో పోరాడి గెలిచిన ఒక యువతిగా తీర్చిదిద్దుతున్నారు. షూటింగ్ ఫిబ్రవరి 18న మొదలైంది. ఉత్తరాఖండ్‌లో ఓ కుటుంబం. ఆ కుటుంబంలోని అమ్మాయి కాంచీ. మాజీ సైనికోద్యోగి అయిన ఆమె తండ్రిని దుండగులు కాల్చి చంపుతారు. దాంతో కాంచీ జీవితం తలకిందులవుతుంది. ఒక దశలో ఆమె ధైర్యం సన్నగిల్లుతుంది. తిరిగి ఆత్మవిశ్వాసంతో నిలబడుతుంది. సమాజంలో స్త్రీలపై జరుగుతున్న దౌర్జన్యాలకు, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధిస్తుంది. ఇదీ కథ. దాదాపు 35 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ‘కాంచీ’ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం ఘాయ్ ఏడాది పాటు దేశమంతా గాలించారు. 350 మందికి పైగా అమ్మాయిల్ని ఇంటర్వ్యూ చేశారు. చివరికి కోల్‌కతా అమ్మాయి మిష్తీని ఎంపిక చేసుకున్నారు. ఇది ఘాయ్ అదృష్టమా? మిష్తీ అదృష్టమా అనేది చెప్పడం కష్టం. ఒకటి మాత్రం వాస్తవం. కొత్త ముఖాలను కోరుకుంటున్న ప్రేక్షకులకు మిష్తీ విపరీతంగా నచ్చుతుంది అని ఘాయ్ అంటున్నారు. మిష్తీ ప్రస్తుతం సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. నిజానికి దీనిని కఠోర శిక్షణ అని అనాలి. ‘‘స్త్రీలోని అంతశ్శక్తికి ప్రతీకగా కాంచీ పాత్రను మలిచేందుకే ఈ కాఠిన్యం’’ అని ఘాయ్ అంటారు. ‘ప్యార్ కా పంచ్‌నామా’ చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమైన కార్తీక్ తివారీ ‘కాంచీ’లో మిష్తీ పక్కన నటిస్తున్నారు. మిష్తీ అసలు పేరు ఇంద్రాణీ చక్రవర్తి. మిష్తీ అన్నది ఆమె ముద్దుపేరు. బెంగాలీలో మిష్తీ అంటే ‘మిఠాయి’ అని అర్థమట. ఈ మిఠాయి చేత సుభాష్ ఘాయ్ కత్తులూ కటార్లూ నూరిస్తున్నారన్నమాట!