హీరో భార్యపై ప్రెగ్నెన్సీ రూమర్స్.. స్పందించిన నటి! | Rajkummar Rao wife Patralekhaa reacts to her pregnancy rumours | Sakshi
Sakshi News home page

Patralekhaa: 'నాపై ప్రెగ్నెన్సీ రూమర్స్‌.. అందుకే చదవడం మానేశా'

Published Thu, Aug 22 2024 6:27 PM | Last Updated on Thu, Aug 22 2024 6:33 PM

Rajkummar Rao wife Patralekhaa reacts to her pregnancy rumours

సెలబ్రిటీలపై రూమర్స్ రావడమనేది సహజం. వారిపై ఏదో ఒక రూమర్ రావడం.. దానికి మళ్లీ క్లారిటీ ఇవ్వడం ఇలా సర్వసాధారణంగా మారింది. తాజాగా బాలీవుడ్ హీరో భార్య, నటి  పాత్రలేఖపై పలు ఊహగానాలు మొదలయ్యాయి. 2021లో రాజ్‌ కుమార్‌ రావును పెళ్లాడిన ఆమె ప్రస్తుతం గర్భంతో ఉందంటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న వార్తలపై ఆమె స్పందించింది.

పాత్రలేఖ మాట్లాడుతూ..' నా కడుపులో ఉబ్బినట్లుగా కనిపించినప్పుడల్లా గర్భవతిని అయిపోతానా? నేను కూడా ఒక అమ్మాయినే కదా? నా జీవితంలో సంతోషంగా లేని రోజులు కూడా ఉన్నాయి. కానీ నా లైఫ్‌ కోరుకున్న విధంగా ఉండాలనుకున్నా. అయితే మొదటి నుంచి నాపై వస్తున్న రూమర్లను నేను పట్టించుకోను. అందుకే కామెంట్స్ కూడా చదవటం మానేశా. కేవలం ఫోటోలు మాత్రమే చూస్తున్నా. నేను ఎలాంటి దుస్తులు ధరించినా మీరు ఇలానే ఊహించుకుంటారా?' అని ఘాటుగానే ప్రశ్నించింది.

తనపై వస్తున్న ప్రెగ్నెన్సీ వార్తలు అవాస్తమని పాత్రలేఖ కొట్టిపారేసింది. కాగా.. రాజ్‌ కుమార్‌ రావు ఇటీవలే స్త్రీ-2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. 15 ఏళ్ల డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు 2021లో వివాహం చేసుకున్నారు. మరోవైపు పాత్రలేఖ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'ఐసీ 814: ది కాందహార్ హైజాక్'లో కనిపించనుంది. ఈ సిరీస్‌లో విజయ్ వర్మ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement