
Rajkummar Rao Shared His Back Wife Patralekhaa Impressed: బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు ఇటీవల 'బదాయి దో' చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. హర్షవర్ధన్ కులకర్ణి దర్శకత్వంలో భూమి పెడ్నేకర్‌తో తొసారిగా స్క్రీన్ షేర్ చేసుకున్నాడు రాజ్ కుమార్. ఈ మూవీ జాతియ అవార్డు గెలుచుకున్న కామెడీ డ్రామా చిత్రం 'బదాయి హో'కి సీక్వెల్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. రాజ్ కుమార్ రావు సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు. రాజ్ కుమార్ రావుకు ఇన్‌స్టాగ్రామ్‌లో 6.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. తన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు, సినిమా అప్‌డేట్ వంటి విషయాలతో సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటాడు. తాజాగా తను జిమ్ చేస్తున్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు రాజ్ కుమార్.
చదవండి: బాలీవుడ్ కొత్త జంట ఎంగేజ్‌మెంట్.. డ్యాన్స్ చేసిన వీడియో వైరల్
ఈ పోస్ట్ చూసిన రాజ్ కుమార్ రావు అభిమానులు అమెజింగ్, అద్భుతం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ పోస్ట్ రాజ్ కుమార్ రావు సతీమణి, నటి పత్రలేఖ దృష్టిని ఆకర్షించింది. ఈ జిమ్ ఫొటోకు తను స్పందిస్తూ 'హాయ్' అని రాస్తూ రెండు ఫైర్ ఎమోజీస్‌ను రిప్లైగా ఇచ్చింది. ఈ ఫొటోలో రెసిస్టాన్స్ బ్యాండ్‌తో రాజ్ కుమార్ చేస్తున్న వర్క్ అవుట్‌కు అతని బ్యాక్ కర్వ్ తిరిగి ఉండటం మనం చూడొచ్చు. కాగా బదాయి దో చిత్రంలో రాజ్ కుమార్ రావు బాడీ బిల్డర్‌గా మారాలనే పోలీస్ ఆఫిసర్ పాత్రలో నటించాడు. అలాగే తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఫొటోలను కొల్లేజ్ రూపంలో పోస్ట్ చేశాడు రాజ్ కుమార్.
చదవండి: రాజ్ కుమార్ రావు, పత్రలేఖ వివాహం.. వెడ్డింగ్ కార్డ్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment