
సాక్షి, న్యూఢిల్లీ : రాహుల్ ధరించిన జాకెట్‌పై కాంగ్రెస్, బీజేపీల వాగ్వాదం కొనసాగుతుంటే ఈ వివాదంపై పంజాబ్ కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ రాహుల్‌ను వెనుకేసుకొచ్చారు. కీలకమైన పదవిలో ఉన్నా సాధారణ జీవితం గడిపేందుకే రాహుల్ ఇష్టపడతారని తమ పార్టీ చీఫ్‌ను సిద్ధూ సమర్ధించారు. రాహుల్ గాంధీ రూ 70,000 విలువైన జాకెట్ ధరించారని బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను సిద్ధూ తోసిపుచ్చుతూ రాహుల్ జాకెట్ కొంటున్నప్పుడు వారు బిల్లును చెక్ చేశారా అని ప్రశ్నించారు.
బిల్లును చూడకుండా దాని ధర వారికెలా తెలిసిందని నిలదీశారు. మరోవైపు రాహుల్ జాకెట్ రూ 70,000 విలువైనదన్న బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి తోసిపుచ్చారు. రూ 700కే ఇలాంటి జాకెట్స్‌ను తాను చూపిస్తానని ఆమె సవాల్ విసిరారు. మేఘాలయాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ ధరించిన జాకెట్‌పై బీజేపీ నేతలు సెటైర్లు వేశారు. రాహుల్ ధరించిన బ్రిటిష్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ బుర్‌బెరీ జాకెట్ ఖరీదు బ్లూమింగ్‌డేల్స్ వెబ్‌సైట్‌లో రూ 68,145గా ఉండటంతో బీజేపీ నేతలు ఈ ప్రచారం చేపట్టారని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment