ఔరంగాబాద్: 2014 ఎన్నికల సందర్భంగా విశేషంగా ప్రాచుర్యంలోకి వచ్చిన మోదీ జాకెట్లకు ప్రస్తుతం గిరాకీ పూర్తిగా తగ్గిపోయిందని పలువురు వస్త్ర వ్యాపారులు అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ధరించే ఈ జాకెట్ హాఫ్ స్లీవ్‌తో ఉంటుంది. ‘మా దుకాణంలో ఒకప్పుడు రోజుకు సుమారు 35 జాకెట్లు అమ్ముడుపోయేవి. కానీ ఇప్పుడు వారానికి ఒకటి మాత్రమే అమ్ముతున్నామ’ని స్థానిక వస్త్ర వ్యాపారి ఒకరు చెప్పారు.
మరో వ్యాపారి గుర్విందర్ సింగ్ మాట్లాడుతూ జీఎస్టీ, నోట్లరద్దు ప్రభావం ఇతర దుస్తులపై చూపిన విధంగానే ఈ జాకెట్ల అమ్మకాలపై కూడా పడిందని అన్నారు. గుల్మండి, తిలక్ పాత్, ఔరంగ్‌పురా, సరఫా, ఉస్మాపురా, సిడ్కో ప్రాంతాల్లోని పలువురు వస్త్ర వ్యాపారులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ‘మా దుకాణంలో రెడీమేడ్ వస్త్రాలతోపాటు ఈ జాకెట్లకు సంబంధించిన వస్త్రాన్ని కూడా నిల్వగా పెట్టుకున్నాం. గతేడాది నుంచి 10 జాకెట్ల కంటే ఎక్కువ అమ్మలేదు. దీనిపై నేను పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టాను. కానీ ఎటువంటి లాభం లేద’ని వస్త్ర దుకాణ వ్యాపారి రాజేంద్ర భాస్కర్ చెప్పారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ప్రజలు ఎక్కువగా ఖాదీ, లెనిన్, కాటన్ షర్టులపై ఎక్కువ మక్కువ చూపుతున్నారని, ఇలాంటి జాకెట్లు ఎవరూ కుట్టించుకోవడం లేదని స్థానికంగా టైలర్ దిలీప్ లోఖండే అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment