అందరి దృష్టిని ఆకర్షించేలా స్పెషల్ బ్లూ జాకెట్‌ని ధరించి పార్లమెంట్‌కి వచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. మోదీ ధరించిన జాకెట్‌ని రీసైకిల్ చేసిన పీఈటీ బాటిళ్లతో తయారుచేసింది. బెంగళూరులో సోమవారం జరిగి ఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రధాని మోదీకి ఈ స్పెషల్ జాకెట్‌ని బహుకరించింది. ఈ ఎనర్జీ వీక్ అనేది శక్తి పరివర్తన హౌస్‌గా ఎదుగుతున్న భారత్ సామర్థ్యాన్ని ప్రదర్శించేందకు ఉద్దేశించింది.
ఈ మేరకు మోదీ రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి సమాధానం ఇచ్చే అవకాశం ఉన్నందున బుధవారం పార్లమెంట్‌లో ఆయన ఈ జాకెట్‌లో కనిపించారు. కాగా ఇండియా ఆయిల్ ఉద్యోగులు సాయుధ దళాల కోసం ఇలాంటి దుస్తులను తయారు చేసేలా దాదాపు 10 కోట్ల పీఈటీ బాటిళ్లను రీసైకిల్ చేయనున్నారు. అదీగాక ఇటీవల ప్రభుత్వం సుమారు రూ. 19 వేల కోట్లతో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌ని ప్రారంభించింది.
శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించేలా, కార్బన్ తీవ్రతను కూడా తగ్గించే దిశగా ఈ మిషన్‌ని ఏర్పాటు చేసింది. అలాగే బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇంధన పరివర్తన నికర సున్నా లక్ష్యాలను సాధించడానికి రూ. 35 వేల కోట్లను అందించారు. అంతేగాదు ఆ బడ్జెట్‌లో దాదాపు ఏడు ప్రాధాన్యతల్లో హరిత వృద్ధికి స్థానం కల్పించారు కూడా.
(చదవండి: సిగ్నల్ వద్ద బ్రేక్ బదులు ఎక్స్‌లేటర్ తొక్కడంతో..ఇద్దరు మృతి)
Comments
Please login to add a commentAdd a comment