ప్రధానికి 56 అంగుళాల జాకెట్‌! | 56 inch jacket for prime minister | Sakshi
Sakshi News home page

ప్రధానికి 56 అంగుళాల జాకెట్‌!

Published Sat, May 13 2017 2:10 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

ప్రధానికి 56 అంగుళాల జాకెట్‌! - Sakshi

ప్రధానికి 56 అంగుళాల జాకెట్‌!

జవాన్లపై దురాగతాలకు నిరసనగా పంపిన మాజీ జవాన్‌ భార్య
ఫతేహాబాద్‌: భారత సైనికులపై దాడుల పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మాజీ సైనికుడి భార్య ప్రధాని మోదీకి లేఖ రాస్తూ దానితో పాటు మహిళలు ధరించే 56 అంగుళాల జాకెట్‌ను పంపారు. తనకు 56 అంగుళాల ఛాతీ ఉందని ప్రధాని పలుమార్లు చెప్పడం తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే భారత సైనికులపై దాడి చేయడానికి పాక్‌ జంకుతుందన్న 2014 ఎన్నికల నాటి బీజేపీ హామీనీ ఆ మహిళ ప్రస్తావించారు. తన భార్య సుమన్‌రాసిన ఆ లేఖను, జాకెట్‌ను మాజీ సైనికుడు ధరమ్‌వీర్‌ సింగ్‌ ఫతేహాబాద్‌ జిల్లా సైనిక్‌ బోర్డుకు అందజేశారు.

‘మన సైనికులను కొడుతున్న, రాళ్ల దాడికి గురవుతున్నట్లు చూపుతున్న వీడియోలు వెలుగుచూశాయి. 2014 ఎన్నికల సమయంలో.. .హేమరాజ్‌ లాగా మరో సైనికుడు శిరచ్ఛేదానికి గురికాడని అనుకున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారింది. మహిళలు తమ పిల్లలు, సోదరులను దేశాన్ని కాపాడటానికి సరిహద్దుల్లోకి పంపుతున్నారు. రాళ్ల దాడికి గురవడానికో,  శిరచ్ఛేదనానికో కాదు. ఆ 56 అంగుళాల ఛాతీ ఎక్కడికి పోయింది?’ అని లేఖలో ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement