జపాన్‌కి చెందిన వ్యక్తి కుక్కలా మారాలనుకున్న వెర్రి ఆలోచన సంగతి గురించి తెలిసిందే. అతడు గతేడాది ఈ విషయాన్ని ఓ ప్రముఖ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు కూడా. అందుకోసం తాను దాదాపు రూ. 12 లక్షల దాక ఖర్చు పెడుతున్నట్లు కూడా చెప్పాడు. తనను కుక్కలా మార్చేందుకు ఓ జపాన్ కంపెనీ ముందుకొచ్చిందన్నాడు. ఆ కంపెనీ కుక్కలా కనిపించేలా దుస్తులు తయారు చేస్తుందని, అవి వేసుకుంటే తాను అచ్చం కుక్కలానే కనిపిస్తానని చెప్పుకొచ్చాడు.
ఆ దుస్తుల తయారీకి కొంత టైం పడుతుందని కూడా అన్నాడు. ఔనా! అప్పుడు అందరూ ఏంటీ పిచ్చి? అంటూ చివాట్లు పెట్టారు. అక్కడితో కథ అయిపోయిందనుకున్నాం. కానీ ఆ వ్యక్తి అన్నంత పని చేశాడు. అతడు చెప్పినట్లుగానే కుక్కలా మారిపోయాడు. అది కూడా ఏదో వేషం వేసినట్లు లేదు..నిజమైన కుక్కని తలపించేలా ఉంది. అతని రూపు, ఆహార్యం అన్ని కూడా కుక్కలానే ఉంది.
ఏకంగా వీధుల్లో మానవ కుక్కలా సంచరిస్తున్నాడు కూడా. చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు, వీడియోలు, ఫోటోలు తీసుకుంటున్నారు. ఆ వ్యక్తి తాను పూర్తి స్థాయిలో కోలీ అనే డాగ్‌గా మారిపోయానోచ్చ్! అని సంబరపడిపోతున్నాడు. అతగాడి కుక్క రూపాన్ని చూస్తూన్న వీధి కుక్కలు, పెంపుడు కుక్కలు భయంతో దూరంగా వెళ్లిపోతున్నాయి.
అందుకు సంబంధించిన వీడియోని 'ఐ వాంట్ టు బీ ఏ యానిమల్' అనే పేరుతో సోషల్‌మీడియాలో అప్ప్‌లోడ్ చేశాడు కూడా. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అంతేకాదండోయ్ ఆ జపనీస్ కంపెనీ జీపెట్‌కి నిజమైన కుక్కలా కనిపించేలా ఆ దుస్తులు తయారు చేసేందుకు చాలా రోజులే పట్టిందట.
(చదవండి: పామే కదా ! అని పరాగ్గా ఉంటే..స్పేక్ క్యాచర్ అయినే అంతే సంగతి!)
Comments
Please login to add a commentAdd a comment