జపాన్‌లో ఇంత క్లీన్‌గా ఉంటుందా..! | Indian influencer Checks Whether Japan Is Really The Cleanest Country | Sakshi
Sakshi News home page

జపాన్‌లో ఇంత క్లీన్‌గా ఉంటుందా..!

Published Tue, Jan 14 2025 12:22 PM | Last Updated on Tue, Jan 14 2025 1:19 PM

Indian influencer Checks Whether Japan Is Really The Cleanest Country

ఏ దేశమైనా.. రోడ్లను ఎంత​ శుభ్రం చేసినా వాహనాలు, మనుషుల కారణంగా దుమ్ము లేకుండా ఉండదు. చెత్త లేకుండా చూడొచ్చు గానీ దుమ్ము లేకుండా అంటే కొంచెం కష్టమే. కానీ నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోని చూస్తే మాత్రం ఆ దేశంలో అంత క్లీన్‌గా ఉంటుందా అని నోరెళ్ల బెడతారు.

భారతదేశానికి చెందిన ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌(Indian Influencer) జపాన్‌(Japan) పరిశుభ్రత(Cleanest)ను టెస్ట్‌ చేసింది. ఎందుకంటే జపాన్‌ కూడా ప్రపంచంలోని అత్యంత పరిశుభ్రమైన దేశాల్లో ఒకటిగా పేరుగాంచింది. ఆ నేపథ్యంలోనే ఈ ఇన్‌ఫ్లుయెన్సర్‌ అది నిజమా..? కాదా..? అని స్వయంగా టెస్ట్‌ చేసింది. అందుకోసం ఒక షాపులోకి వెళ్లి తెల్లటి సాక్సులు కొత్తవి కొనుగోలు చేసింది. 

వాటిని వేసుకుని బూట్లు లేకుండా ఆ పరిసర ప్రాంతాల్లో నడిచింది. బూట్లను చేతితో పట్టుకుని సమీపంలో ఉన్న జీబ్రా క్రాసింగ్‌లు, ఫుట్‌పాత్‌లు వద్ద కలియతిరిగింది. ఆ తర్వాత కూల్‌గా సాక్స్‌ని విప్పి..చూస్తే ఒక్క మరక లేకుండా క్లీన్‌గా కనిపించాయి. అయితే ఈ వీడియోని చూసిన నెటిజన్లు మాత్రం ఇదస్సలు నమ్మశక్యంగా లేదు. అసాధ్యం అని కామెంట్‌ చేస్తున్నారు. 

అందులోకి తెల్లటి సాక్స్‌లు ఎంతలా పరిసరాలను క్లీన్‌గా ఉంచినా.. వినియోగిస్తే మాత్రం మాసినట్లు కనిపిస్తాయి. అలాంటిది ఈ సాక్సులు మాత్రం కొన్నప్పుడూ ఎలా ఉందో అలానే ఉంది. కాబట్టి ఇది నమ్మగిన వీడియో కాదంటూ తిట్టిపోస్తున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా ఆ వీడియోలో చైనా రోడ్లు క్లీన్‌గానే కనిపించాయి. డెస్ట్‌ కనిపించనంత క్లీన్‌గా అనేది కొంచెం నమ్మశక్యం కానిదే. కానీ వాళ్లు చెత్త అనేది కనిపించకుండా పరిసరాలను అంతలా శుభ్రంగా ఉండేలా మెయింటైన్‌ చేస్తున్నందుకుగానూ తప్పకుండా ప్రశంసించాల్సిందే కదూ..!.

 

(చదవండి: మహాకుంభ మేళలో యోగమాతగా తొలి విదేశీ మహిళ..!)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement