మహా కుంభమేళా హిందువులకు పెద్ద పండుగలాంటిది. కుంభమేళా సమయంలో హిందువులు త్రివేణీ సంగమంలో స్నానం చేయాలని అనుకుంటారు. తద్వారా తాము చేసిన పాపాలు తొలగిపోతాయని భావిస్తారు. ఈ మహాకుంభ మేళని 144 ఏళ్ల కోసారి నిర్వహిస్తారు. ఇది 12 పూర్ణకుంభమేళాలతో సమానం. దీనిని ప్రయాగ్‌రాజ్‌లోనే నిర్వహించడం ఆనవాయితీ. అలాంటి మహా కుంభమేళలో ఎందరెందరో ప్రముఖుల, నాగసాధువులు, యోగగురువులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. తాజాగా ఈ కుంభ మేళలో ప్రధాన ఆకర్షణగా యోగ మాతగా తొలి విదేశీ మహిళ నిలిచింది. ఆమె ఏ దేశస్తురాలు..మన హిందూ ఆచారాలను అనసరించడానికి రీజన్ తదితరాల గురించి తెలుసుకుందామా..!.
యోగమాతా(Yogmata) కైకో ఐకావా(Keiko Aikawa) సిద్ధ గురువు లేదా హిమాలయ సమాధి యోగి హోదాను పొందిన తొలి భారతీయేతర మహిళగా చరిత్ర సృష్టించారు. ఆమె ప్రపంచ ప్రఖ్యాత ధ్యాన నిపుణురాలు. అంతేగాదు మహామండలేశ్వర్ బిరుదుతో సత్కరించబడిన తొలి విదేశీ మహిళ కూడా ఆమెనే. ఈ మహామండలేశ్వర్ అనేది ఆది శంకరాచార్య స్థాపించిన దశనామి క్రమంలో హిందు సన్యాసులకు ఇచ్చే బిరుదు. ఈ బిరుదు ప్రకారం వారిని గొప్ప ఆధ్యాత్మిక నాయకుడిగా పరిగణిస్తారు. ఆమె ప్రస్తుతం జరగుతున్న మహాకుంభ మేళలో పాల్గొననున్నది.
నేపథ్యం..
1945లో జపాన్‌లో జన్మించిన యోగమాత కైకో ప్రకృతి వైద్యంలో మంచి ఆసక్తిని పెంచుకున్నారు. ఈ అభిరుచి పశ్చిమ దేశాలలో హిప్పీ ఉద్యమం ద్వారా సంక్రమించింది. అలాగే కైకో జపాన్‌లో యోగాను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఎంతగానో కృషి చేసింది.
ఆ నేపథ్యంలోనే టిబెట, చైనా, భారతదేశం గుండా పర్యటనలు చేసింది. 1972లో జపాన్ జనరల్ హెల్త్ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించింది. అక్కడ యోగా నృత్యం, ప్రాణ యోగాను నేర్చుకుంది.
ఆధ్యాత్మిక గురువుగా ఎలా మారిందంటే..
1984లో జపాన్‌లో పైలట్ బాబాను కలిసినప్పుడు పరివర్తన చెందింది. ఎత్తైన హిమాలయాలలో సిద్ధ మాస్టర్స్‌తో కలిసి యోగాను నేర్చుకోవడానికి పైలెట్ బాబా ఆమెను ఆహ్వానించారు. అక్కడ ఆమె "సమాధి" పొందడానికి కఠినమైన శిక్షణ పొందింది. హిందూ, బౌద్ధ మతాల ప్రకారం సమాధి అనేది శరీరానికి కట్టుబడి ఉండగానే సాధించగల అత్యున్నత మానసిక ఏకాగ్రత స్థితి.
ఇది వ్యక్తిని అత్యున్నత వాస్తవికతతో ఏకం చేస్తుంది. 1991లో తన తొలి బహిరంగ సమాధిని ప్రదర్శించింది. ఇది ఒక అసాధారణ యోగ సాధన. ఇందులో ఆమె ఆహారం, నీరు లేకుండా 72 గంటలకు పైగా గాలి చొరబడి భూగర్భ ఆవరణలో ఉండటం జరిగింది. ఈ ఘనతను కొద్దిమంది మాత్రమే సాధించగలరు.
ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉన్న ఇద్దరు సిద్ధ మాస్టర్లలో ఒకరు. 2024లో పైలట్ బాబా మరణానంతరం అతని వారసురాలిగా యోగా మాత కేవలానంద్‌గా పేరుపొందింది. ఆమె తరుచుగా హిమాలయ రహస్య ధ్యానం"ను బోధిస్తుంది, సాధన చేస్తుంది. ఆమె అంతర్గత పరివర్తన శక్తిని విశ్వసిస్తుంది. ప్రతి ఒక్కరిలోనూ విశ్వ ప్రేమ ఉంటుంది. దానిని గుర్తించి, సమతుల్యత, ప్రశాంతతను సాధించడమే ధ్యానం లక్ష్యం. అని చెబుతుంటుంది యోగమాత కైకో.
(చదవండి: పల్లవించిన ప్రజ్ఞ! తమిళులైనా.. తెలుగులో..)
Comments
Please login to add a commentAdd a comment