తల్లులు పిల్లలకు అన్నం కలిపి గోరుముద్దలు తినిపిస్తారు. కాలేజీ, ఆఫీస్ క్యాంటిన్‌లో పలువురు తమ మిత్రులకు ప్రేమగా అన్నం కలిపి తినిపించటం కూడా చూశాం. ప్రియమైనవారికి ప్రేమతో అన్నం తినిపించటంలో కూడా కొంతమంది ఆనందాన్ని పొందుతారు. చిలిపిగా మారాం చేసినా.. ఇంకొంచం తినూ రా.. అంటూ గద్దించి మరీ ప్రేమతో నోటికి అన్నం ముద్దలు అందిస్తారు. అటువంటి కల్మషం లేని ప్రేమ.. ముఖ్యంగా బాల్యంలో అధికంగా కనిపిస్తుందనటంలో సందేహం లేదు! తాజాగా అటువంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ పాఠశాలలో విద్యార్థులంతా లైన్‌లో కూర్చొని భోజనం చేస్తుంటారు.
అయితే అందులో ఓ ఇద్దరు విద్యార్థుల ముందు అన్నం ప్లేట్ ఉంటుంది. అయితే అందులో ఒక విద్యార్థి మాత్రమే అన్నం తింటూ.. తన స్నేహితుడైన మరో విద్యార్థికి అన్నం కలిపి నోటికి అందిస్తాడు. ఎందుకంటే రెండో విద్యార్థికి కళ్లు కనిపించవు.. ఆ బాలుడు మారాం చేస్తున్నా తను తింటూ స్నేహితుడికి అన్నం తినిపిస్తాడు. ఈ వీడియోను ఓ ట్విటర్ యూజర్ ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ‘సంస్కారం అనేది ప్రవర్తనలో కనిపిస్తుంది!’ అని కామెంట్ చేశాడు.
ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు అన్నం తినిపించే బాలుడి స్నేహాన్ని అభినందిస్తున్నారు. ‘ఆ బాలుడిని హత్తుకొని ఓ ముద్దు ఇవ్వాలని ఉంది’.. ఇదే స్వచ్ఛమైన స్నేహం.. బాలుడికి ఉన్న సంస్కారం అందరిలో ఉండాలి’.. ‘అద్భుతం! అలా పెంచిన పిల్లాడి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు’.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
If you get right Sanskars,it shows up in your behaviour ❤️🙏 pic.twitter.com/ruvH780YWb
— Vikas Chopra (@Pronamotweets) November 28, 2021
Comments
Please login to add a commentAdd a comment