నేను కూడా క్యాస్టింగ్‌ కౌచ్‌ బాధితుడినే: యానిమల్ నటుడు షాకింగ్ కామెంట్స్ | Animal actor Siddhant Karnick recalls on his casting couch incident | Sakshi
Sakshi News home page

Siddhant Karnick: ఆ టైమ్‌లో ఇంటికి రమ్మని పిలిచాడు: యానిమల్ నటుడు

Published Tue, Jul 16 2024 4:28 PM | Last Updated on Tue, Jul 16 2024 4:38 PM

Animal actor Siddhant Karnick recalls His casting couch incident In Career

బాలీవుడ్ నటుడు సిద్దాంత్ కర్నిక్ గతేడాది సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ చిత్రంలో కనిపించారు. 2023 డిసెంబర్‌లో రిలీజైన ఈ  చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ మూవీ రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించిన సిద్ధాంత్ కర్నిక్.. ప్రభాస్ ఆదిపురుష్‌లోనూ నటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హజరైన సిద్ధాంత్ తన కెరీర్‌లో ఎదురైన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తాను క్యాస్టింగ్ కౌచ్‌ అనుభవం ఎదురైందని షాకింగ్ కామెంట్స్‌ చేశారు. అదేంటో తెలుసుకుందాం.

సిద్ధాంత్ కర్నిక్ మాట్లాడుతూ.. " అ‍ప్పడప్పుడే నా కెరీర్‌ ప్రారంభించా. 2005లో కేవలం 22 ఏళ్ల వయసులోనే పరిశ్రమలోకి ప్రవేశించా. ఓ సినిమా ఛాన్స్ కోసం కోఆర్డినేటర్‌ని కలిశా. అతను నా పోర్ట్‌ఫోలియో తీసుకుని రాత్రి 10:30 గంటలకు  ఇంటికి రమ్మన్నాడు. ఆ టైమ్‌లో పిలవడం నాకు కాస్తా వింతగా అనిపించింది. అయినా అవకాశం కోసం వెళ్లక తప్పలేదు. ' అని అన్నారు.  

‍అనంతరం మాట్లాడుతూ..' అవకాశాల కోసం కొన్ని విషయాల్లో రాజీపడక తప్పదు. లేకపోతే నీకు ఎలాంటి పని ఉండదని అన్నాడు. దీంతో అతని మాటలను నేను వెంటనే గ్రహించా. ఆ సమయంలో అతను నాకు చాలా దగ్గరగా వచ్చాడు. నేను వెంటనే ఇంట్రెస్ట్‌ లేదని చెప్పి బయటకొచ్చేశా' అని తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత అతను నా సినిమా అవకాశాలను దెబ్బతీస్తాడేమోనని భయపడినట్లు వెల్లడించారు. కానీ కొన్నేళ్ల తర్వాత ఓ ఈవెంట్‌లో అతనే నన్ను అభినందించాడని తెలిపారు. 

కాగా.. సిద్ధాంత్‌ కర్నిక్ యానిమల్, ఆదిపురుష్ వంటి చిత్రాలతో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాకుండా ఫేమస్ వెబ్ సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ సీజన్- 2 కీలక పాత్ర పోషించాడు.  2004లో టీవీ షో రీమిక్స్‌తో కర్నిక్ తన కెరీర్‌ ప్రారంభించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement