Siddhanth
-
నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితుడినే: యానిమల్ నటుడు షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ నటుడు సిద్దాంత్ కర్నిక్ గతేడాది సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ చిత్రంలో కనిపించారు. 2023 డిసెంబర్లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ మూవీ రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించిన సిద్ధాంత్ కర్నిక్.. ప్రభాస్ ఆదిపురుష్‌లోనూ నటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హజరైన సిద్ధాంత్ తన కెరీర్లో ఎదురైన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తాను క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందని షాకింగ్ కామెంట్స్ చేశారు. అదేంటో తెలుసుకుందాం.సిద్ధాంత్ కర్నిక్ మాట్లాడుతూ.. " అప్పడప్పుడే నా కెరీర్ ప్రారంభించా. 2005లో కేవలం 22 ఏళ్ల వయసులోనే పరిశ్రమలోకి ప్రవేశించా. ఓ సినిమా ఛాన్స్ కోసం కోఆర్డినేటర్ని కలిశా. అతను నా పోర్ట్‌ఫోలియో తీసుకుని రాత్రి 10:30 గంటలకు ఇంటికి రమ్మన్నాడు. ఆ టైమ్‌లో పిలవడం నాకు కాస్తా వింతగా అనిపించింది. అయినా అవకాశం కోసం వెళ్లక తప్పలేదు. ' అని అన్నారు. అనంతరం మాట్లాడుతూ..' అవకాశాల కోసం కొన్ని విషయాల్లో రాజీపడక తప్పదు. లేకపోతే నీకు ఎలాంటి పని ఉండదని అన్నాడు. దీంతో అతని మాటలను నేను వెంటనే గ్రహించా. ఆ సమయంలో అతను నాకు చాలా దగ్గరగా వచ్చాడు. నేను వెంటనే ఇంట్రెస్ట్ లేదని చెప్పి బయటకొచ్చేశా' అని తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత అతను నా సినిమా అవకాశాలను దెబ్బతీస్తాడేమోనని భయపడినట్లు వెల్లడించారు. కానీ కొన్నేళ్ల తర్వాత ఓ ఈవెంట్లో అతనే నన్ను అభినందించాడని తెలిపారు. కాగా.. సిద్ధాంత్ కర్నిక్ యానిమల్, ఆదిపురుష్ వంటి చిత్రాలతో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాకుండా ఫేమస్ వెబ్ సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ సీజన్- 2 కీలక పాత్ర పోషించాడు. 2004లో టీవీ షో రీమిక్స్‌తో కర్నిక్ తన కెరీర్ ప్రారంభించాడు. -
బే విండోకు.. డిజైన్ ఎక్స్‌లెన్స్!
నగరంతో పాటు పలుచోట్ల అందుబాటులోని ఫ్యాషన్ ప్రీమియర్ మిడ్–లగ్జరీ బ్రాండ్ బే విండోకు ప్రతిష్టాత్మక డిజైన్ ఎక్సలెన్స్ అవార్డ్ లభించింది. ఈ విషయాన్ని సంస్థకు చెందిన డిజైన్ లీడ్ సిద్ధాంత్ ఆనంద్ తెలిపారు.బ్రాండ్‌ను ప్రారంభించిన సంవత్సరంలోనే ఈ ప్రశంసలు లభించడం తమ డిజైన్ల వైవిధ్యానికి నిదర్శనమని, భారతీయతను ప్రతిబింబించే దాదాపు 1000కిపైగా అత్యాధునిక డిజైన్ల రూపకల్పన ద్వారా ఈ అవార్డుకు అర్హత పొందామని సంతోషం వ్యక్తం చేశారు.ఇవి చదవండి: ‘తాన్సేన్’ మొఘల్ వైభవం.. -
యానిమల్ హీరోయిన్‌తో డేటింగ్ చేయాలనుంది: నటుడు షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన చిత్రం యానిమల్. రణ్‌బీర్‌కపూర్, రష్మిక జంటగా నటించిన బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. పలువురు ప్రముఖుల నుంచి విమర్శలు ఎదురైనప్పటికీ భారీ వసూళ్లు సాధించింది. అయితే ఈ చిత్రంలో రష్మిక లీడ్ రోల్లో కనిపించగా.. బాలీవుడ్ భామ త్రిప్తి డిమ్రీ తన అందాలతో అభిమానులను ఆకట్టుకుంది. రణ్‌బీర్ కపూర్ ప్రియురాలిగా జోయా పాత్రలో మెప్పించింది. వీరిద్దరి కెమిస్ట్రీకి అభిమానులు సైతం ఫిదా అయ్యారు. యానిమల్తో త్రిప్తి డిమ్రీకి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకుంది. అయితే ఈ సినిమాలో మరో నటుడు సిద్ధాంత్ కర్నిక్ కీలక పాత్ర పోషించారు. రణబీర్ కపూర్ బావగా వరుణ్ ప్రతాప్ మల్హోత్రా అనే పాత్రను పోషించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సిద్ధాంత్.. త్రిప్తి డిమ్మీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆమెతో డేటింగ్ చేయాలనుకుంటున్నట్లు తన మనసులో మాటను సిద్ధాంత్ వెల్లడించారు. రీల్ లైఫ్ నుంచి నిజ జీవితాన్ని వేరుగా చూడాల్సిన అవసరముందని పేర్కొన్నారు. కాగా.. సిద్ధాంత్ కర్నిక్ యానిమల్తో పాటు మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2, అమయా, తప్పడ్, ఆదిపురుష్ లాంటి చిత్రాల్లో కనిపించారు. మాహి వే, యే హై ఆషికి, ఏక్ థా రాజా ఏక్ థీ రాణి లాంటి సీరియల్స్‌లో నటించారు. -
ఆటతో...
చైతన్య పసుపులేటి, హీనా రాయ్ జంటగా నటించిన చిత్రం ‘జీటీఏ’. దీపక్ సిద్ధాంత్ దర్శకత్వంలో డా. సుశీల నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 6న విడుదల కానుంది. ఈ చిత్రం విడుదల తేదీ పోస్టర్‌ను రచయిత–దర్శకుడు కృష్ణ చైతన్య రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘కొత్త కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ సినిమా హిట్ అవ్వాలి’’ అన్నారు. ‘‘క్రైమ్ యాక్షన్ డ్రామాగా జీటీఏ అనే ఆట ఆధారంగా ఈ చిత్రకథ సాగుతుంది’’ అన్నారు దీపక్ సిద్ధాంత్. ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కె. రాబిన్, కామెరా: కేవీ ప్రసాద్. -
దమ్ముంటే ఇలా మూత తీయండి..!
-
దమ్ముంటే ఇలా బాటిల్ మూత తీయండి..
మొన్న ఐస్ బకెట్, నిన్న కికి చాలెంజ్... నేడు బాటిల్ క్యాప్ చాలెంజ్. సామాజిక మాధ్యమాల్లో కొత్త చాలెంజ్ రావడానికి ఎంత సమయం పడుతుందో కానీ అది ట్రెండ్ అవడానికి అర క్షణం చాలు..! ఇంటర్నెట్లో ప్రస్తుతం బాటిల్ క్యాప్ చాలెంజ్ హవా నడుస్తోంది. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరూ దీని వెంటపడుతున్నారు. ఇది హాలీవుడ్‌ను ఒక ఊపు ఊపేసి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే ఎందరో నటులు ఈ చాలెంజ్‌కు సై అంటూ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారు. ప్రస్తుతం గల్లీబాయ్ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సిద్ధాంత్ చతుర్వేది ఈ సవాలును స్వీకరించి దాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన మొదటి బాలీవుడ్ నటుడిగా నిలిచారు. ఇక యూట్యూబ్ స్టార్ భువన్ బామ్ కూడా తనదైన స్టైల్లో కాసింత హాస్యాన్ని జోడించి మరీ బాటిల్ క్యాప్ తీశాడు. స్లో మోషన్లో ఉన్న ఈ వీడియోలో భువన్ కాలితో తన్నకుండా చివర్లో నోటితో తీస్తాడు. భువన్ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేసిన ఈ వీడియో నవ్వుల్ని పూయిస్తోంది. ‘నీలా ఎవరూ చేయలేరు.. నీకు నువ్వే సాటి’ అంటూ బాలీవుడ్ నటులు జాన్వీకపూర్-ఇషాన్ ఖట్టర్, సిద్ధాంత్లు ప్రశంసలు కురిపించారు. భువన్. బాటిల్ క్యాప్ చాలెంజ్ పూర్తి చేయాలంటూ హార్దిక్ పాండ్యా, విక్కీ కౌశల్, అమాండసెర్నీలకు ట్యాగ్ చేశారు. ‘బాటిల్ క్యాప్ చాలెంజ్’లో బాటిల్ మూతను ముందుగానే కాస్త వదులు చేసి ఉంచుతారు. ఆ తర్వాత కాలితో తన్ని బాటిల్ మూతను తీయాలి.. అదీ బాటిల్ కిందపడకుండా! బాలీవుడ్లో మొదటగా ఈ చాలెంజ్‌లో పాల్గొన్న సిద్ధాంత్ దాన్ని పూర్తి చేయడమే కాక నటుడు ఇషాన్ ఖట్టర్‌కు సవాలు విసిరాడు.మరోవైపు హాలీవుడ్ నటుడు జేసన్ స్టాథమ్‌ను స్ఫూర్తిగా తీసుకుని అక్షయ్ కుమార్ సైతం ఈ చాలెంజ్‌లో పాల్గొన్నారు. అక్షయ్ ఒక్క తన్నుతో బాటిల్ మూతను గాలిలో గింగిరాలు తిప్పి తన ఫిట్నెస్ను నిరూపించుకున్నారు. మరో నటుడు టైగర్ ష్రాఫ్ కొంచెం కొత్తగా ట్రై చేద్దామనుకున్నాడో ఏమో! ఏకంగా కళ్లకు గంతలు కట్టుకుని మరీ చాలెంజ్‌ను పూర్తి చేశాడు. టైగర్ చేసిన ఈ వీడియో చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే! -
హీట్స్‌లోనే సిద్ధాంత్ నిష్క్రమణ
బర్మింగ్హమ్: ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ సిద్ధాంత్ తింగాలయకు నిరాశ ఎదురైంది. ఈ మెగా ఈవెంట్లో పురుషుల 60 మీటర్ల హర్డిల్స్‌లో పోటీ పడ్డ సిద్ధాంత్ సెమీఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. మూడో హీట్‌లో బరిలోకి దిగిన 27 ఏళ్ల సిద్ధాంత్ 7.93 సెకన్లలో గమ్యానికి చేరి ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మొత్తం నాలుగు హీట్స్ నుంచి తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన క్రీడాకారులు సెమీఫైనల్‌కు అర్హత పొందుతారు. అమెరికాలో శిక్షణ పొందే సిద్ధాంత్ ఎనిమిది మంది పాల్గొన్న తన హీట్స్‌లో ఆరో స్థానంలో నిలిచి ఆ అవకాశాన్ని కోల్పోయాడు. -
ఐదేళ్ల తర్వాత వరల్డ్ గ్రూప్‌లో భారత్
న్యూఢిల్లీ: జూనియర్ డేవిస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులు రాణించారు. ఐదేళ్ల తర్వాత వరల్డ్ గ్రూప్‌నకు అర్హత సాధించారు. మూడో స్థానం కోసం శనివారం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత్ 2-0 తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. తొలిమ్యాచ్‌లో సిద్ధాంత్ 6-2, 6-4తో థామస్ జేమ్స్‌పై గెలుపొందగా, మరో మ్యాచ్‌లో ఆదిల్ 6-2, 6-4తో అలెగ్జాండర్‌పై నెగ్గాడు. భారత్‌తో పాటు చైనా, జపాన్ కూడా వరల్డ్ గ్రూప్‌నకు అర్హత సాధించాయి. భారత ప్రదర్శనపట్ల అఖిల భారత టెన్నిస్ సంఘం(ఏఐటీఏ) అధ్యక్షుడు అనిల్ ఖన్నా హర్షం వ్యక్తం చేశారు. జట్టు సభ్యులకు రూ. లక్ష చొప్పున నగదు పురస్కారాన్ని ప్రకటించారు.