
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన చిత్రం యానిమల్. రణ్‌బీర్‌కపూర్, రష్మిక జంటగా నటించిన బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. పలువురు ప్రముఖుల నుంచి విమర్శలు ఎదురైనప్పటికీ భారీ వసూళ్లు సాధించింది. అయితే ఈ చిత్రంలో రష్మిక లీడ్ రోల్‌లో కనిపించగా.. బాలీవుడ్ భామ త్రిప్తి డిమ్రీ తన అందాలతో అభిమానులను ఆకట్టుకుంది. రణ్‌బీర్ కపూర్ ప్రియురాలిగా జోయా పాత్రలో మెప్పించింది. వీరిద్దరి కెమిస్ట్రీకి అభిమానులు సైతం ఫిదా అయ్యారు. యానిమల్‌తో త్రిప్తి డిమ్రీకి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకుంది.
అయితే ఈ సినిమాలో మరో నటుడు సిద్ధాంత్ కర్నిక్ కీలక పాత్ర పోషించారు. రణబీర్ కపూర్ బావగా వరుణ్ ప్రతాప్ మల్హోత్రా అనే పాత్రను పోషించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సిద్ధాంత్.. త్రిప్తి డిమ్మీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆమెతో డేటింగ్ చేయాలనుకుంటున్నట్లు తన మనసులో మాటను సిద్ధాంత్ వెల్లడించారు. రీల్ లైఫ్ నుంచి నిజ జీవితాన్ని వేరుగా చూడాల్సిన అవసరముందని పేర్కొన్నారు. కాగా.. సిద్ధాంత్ కర్నిక్ యానిమల్‌తో పాటు మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2, అమయా, తప్పడ్, ఆదిపురుష్ లాంటి చిత్రాల్లో కనిపించారు. మాహి వే, యే హై ఆషికి, ఏక్ థా రాజా ఏక్ థీ రాణి లాంటి సీరియల్స్‌లో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment